E-Paper
Advertisement

Suspense thriller OTT: అమ్మాయిలకు నరకం చూపించే జైలు… ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠభరితమే

Suspense thriller OTT: అమ్మాయిలకు నరకం చూపించే జైలు… ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠభరితమే
Advertisement

Suspense thriller OTT : బీభత్సమైన కంటెంట్ కావాలనుకుంటే, ఈ హాలీవుడ్ సిరీస్ పై ఓ లుక్ వేయండి. గత ఏడాది వచ్చిన ఈ సిరీస్ ఊహించని మలుపులతో షాక్ ఇస్తూ ఉంటుంది. ఇది హింస, జైలు రాజకీయాలతో నడిచే ఒక క్రైమ్ థ్రిల్లర్. జైలులో మహిళల మధ్య ఉండే గొడవలను ఈ సిరీస్ ఉత్కంఠంగా చూపిస్తుంది. ఒక్క సారి చూడటం మొదలు పెడితే అస్సలు వదలరు చివరి ఎపిసోడ్ వరకు. ఈ క్రైమ్  సిరీస్ పేరు, ఎక్కడ ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ క్రైమ్ డ్రామా సిరీస్ పేరు ‘ఇన్ ది మడ్’ (In The Mud). ఇందులో అనా గారిబాల్డి, వాలెంటినా జెనెరె, రీటా కోర్టేస్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇది 2025 ఆగస్ట్ 14న నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ కి వచ్చింది. అర్జెంటీనాకు చెందిన ప్రసిద్ధ సిరీస్ ‘ఎల్ మార్జినల్’ (El Marginal)కు ఇది స్పిన్-ఆఫ్. మొదటి సీజన్‌లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్నాయి. మొదటి సీజన్ హిట్ కావడంతో ప్రస్తుతం ఈ సిరీస్ రెండవ సీజన్ కోసం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్లు సమాచారం.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

గ్లాడిస్ అనే మహిళ, తన భర్త చేసిన నేరం వల్ల జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఆమెను ఒక ప్రమాదకరమైన మహిళా జైలుకు తరలిస్తున్నప్పుడు ఒక ఊహించని ప్రమాదం జరుగుతుంది. ఆ ఖైదీల వ్యాన్ నదిలో పడిపోతుంది. ఆ చావు అంచుల్లో నుండి గ్లాడిస్ మరికొందరు మహిళలతో కలిసి ప్రాణాలతో బయటపడుతుంది. కానీ అసలు నరకం జైలుకు వెళ్ళాక మొదలవుతుంది. జైలు లోపల రకరకాల గ్యాంగ్‌లు ఉంటాయి. కొత్తగా వచ్చిన గ్లాడిస్ కి అసలు సమస్యలు మొదలవుతాయి. అక్కడ మనుషులు ఎలా ఉంటారో తెలుస్తుంది. ఆమె ఇప్పుడు తనను తాను కాపాడుకుంటూ, బతకాల్సి వస్తుంది.

బయట ప్రపంచంలో అమాయకంగా ఉండే మహిళలు, జైలు గోడల మధ్య బ్రతకడం కోసం ఎంత క్రూరంగా మారాల్సి వస్తుంది? అక్కడ ఉండే అవినీతి అధికారులు, తోటి ఖైదీల వేధింపులను వాళ్ళు ఎలా ఎదురించారు? అనే విషయాలను ఈ క్రైమ్ డ్రామా సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.
మొత్తానికి ఇది ఒక సాదాసీదా కథ కాదు. పక్కా రా అండ్ రస్టిక్ స్టైల్‌లో ఉంటుంది.

Advertisement

Read Also : బయట శత్రువులే కానీ లోపల మాత్రం మ్యాటర్ వేరే… ఓటిటిలో దుమ్ము దులుపుతున్న రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా

Tags

Related News

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

Big Stories

Advertisement
×