E-Paper
Advertisement

Remedies For Business:  వ్యాపారంలో నష్టాలు రాకుండా ఉండటానికి ఈ రెమెడీస్ పాటించాలట – అవేంటో తెలుసా..?

Remedies For Business:  వ్యాపారంలో నష్టాలు రాకుండా ఉండటానికి ఈ రెమెడీస్ పాటించాలట – అవేంటో తెలుసా..?
Advertisement

Remedies For Business: వ్యాపారంలో ఆటంకాలు తొలగి, లాభాల బాట పట్టడానికి జ్యోతిష్య, వాస్తు శాస్త్రాలలో కొన్ని ప్రభావవంతమైన పరిహారాలు ఉన్నాయట. ఇవి వ్యాపార స్థలంలో సానుకూల శక్తిని (Positive Energy) పెంచి, మీ వ్యాపార అభివృద్ధికి తోడ్పడతాయట.

వ్యాపార స్థలంలో వాస్తు మరియు శుభ్రత: మీ ఆఫీస్ లేదా షాపులో ఈశాన్య మూల (North-East) ఎప్పుడూ ఖాళీగా, శుభ్రంగా ఉండాలట. అక్కడ బరువైన వస్తువులను పెట్టకూడదట. ఈ మూలలో ఒక చిన్న పాత్రలో నీరు పోసి, అందులో పూలు ఉంచడం వల్ల సానుకూలత పెరుగుతుందట. అలాగే వ్యాపార యజమాని ఎప్పుడూ ఉత్తరం లేదా తూర్పు ముఖంగా కూర్చుని వ్యాపారం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుందట. అలాగే బరువైన సామాగ్రి లేదా బీరువాను ఎప్పుడూ నైరుతి (South-West) మూలలో ఉంచాలట.

Advertisement

దిష్టి నివారణ (Evil Eye): వ్యాపారంలో ఎదుగుదల ఉన్నప్పుడు ఇతరుల దృష్టి పడే అవకాశం ఉంటుందట. దీని కోసం మీరు ప్రతి శనివారం లేదా మంగళవారం షాపు గుమ్మానికి ఏడు పచ్చిమిర్చి, ఒక నిమ్మకాయను కట్టాలట. వారానికి ఒకసారి వ్యాపార స్థలాన్ని తుడిచే నీటిలో కొంచెం కల్లు ఉప్పు వేసి శుభ్రం చేయాలట. ఇది ప్రతికూల శక్తిని బయటకు పంపుతుందట.

లక్ష్మీ-కుబేర ఆరాధన: మీ పూజా గదిలో లేదా క్యాష్ కౌంటర్ వద్ద వ్యాపార వృద్ధి యంత్రం లేదా మహాలక్ష్మి యంత్రం ఉంచి నిత్యం ధూపదీప నైవేద్యాలు సమర్పించాలట. ఇంకా 11 గోమతి చక్రాలను ఎర్రటి వస్త్రంలో కట్టి, మీ క్యాష్ బాక్స్‌లో ఉంచడం వల్ల ధన ప్రవాహం పెరుగుతుందట.

Advertisement

కొన్ని ప్రత్యేక పరిహారాలు: ప్రతిరోజూ ఉదయం పక్షులకు గింజలు లేదా నీటిని ఏర్పాటు చేయడం వల్ల వ్యాపారంలోని అడ్డంకులు తొలగిపోతాయట. ప్రతిరోజూ సాయంత్రం వ్యాపార ముగింపు సమయంలో కర్పూరం వెలిగించి షాపు అంతా చూపించడం వల్ల దుష్ట శక్తులు నశిస్తాయట. వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా వస్తుంటే మంగళవారం నాడు కొంచెం బెల్లాన్ని ఆవుకు తినిపించాలట.

లావాదేవీల నియమం: రోజులో మొదటి అమ్మకం (బోణీ) చేసేటప్పుడు వీలైనంత వరకు నగదు రూపంలోనే తీసుకోవడానికి ప్రయత్నించాలట. మొదటి సేల్ అప్పుగా ఇవ్వకూడదని పండితులు సూచిస్తుంటారు. సూర్యాస్తమయం అయిన తర్వాత ఎవరికీ అప్పు ఇవ్వడం లేదా డబ్బులు బయటకు పంపడం వంటివి తగ్గించడం మంచిదట.

అయితే ఈ పరిహారాలు  చేయడం వల్ల మీలోని  త్మవిశ్వాసాన్ని పెరిగి,  మీకు మార్గాన్ని సుగమం చేస్తాయట. వీటితో పాటు వ్యాపారంలో  కృషి, కస్టమర్లతో మంచి సంబంధాలు,  సరైన మార్కెటింగ్ వ్యూహాలు ఉండటం చాలా ముఖ్యమని.. అప్పుడే మీ వ్యాపారం నష్టాల నుంచి లాభాల బాటలోకి వెళ్తుందని పండితులు సూచిస్తున్నారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: శివాలయానికి వెళ్తే ఆ పనులు అసలు చేయకూడదట

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×