E-Paper
Advertisement

Shiva temple: శివాలయానికి వెళ్తే ఆ పనులు అసలు చేయకూడదట

Shiva temple: శివాలయానికి వెళ్తే ఆ పనులు అసలు చేయకూడదట
Advertisement

Shiva temple: శివాలయానికి వెళ్లినప్పుడు ఆ పనులు అసలు చేయకూడదంటున్నారు పండితులు. కొంత మంది తెలిసో తెలియకో ఆ పనులు చేసినా మీరు గుడికి వెళ్లిన పుణ్యం రాకపోగా పాపపు కర్మలు మూటగట్టుకుంటారట. కాబట్టి శివాలయానికి వెళ్తే ఏ పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

శివాలయానికి వెళ్లినప్పుడు భక్తులు కొన్ని నియమాలను పాటించడం ఆచారంగా వస్తోంది. శాస్త్రాల ప్రకారం శివుడిని దర్శించుకున్నప్పుడు పొరపాటున కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయంటున్నారు పండితులు. అయితే ఆ పనులు తెలిసి చేసినా తెలియక చేసినా నష్టపోయేది మాత్రం మీరేనట. అందుకే శివాలయంలో అసలు చేయకూడని పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

అభిషేక తీర్థాన్ని దాటకూడదు: శివాలయంలో శివలింగానికి అభిషేకం చేసిన నీరు వెళ్లే మార్గాన్ని  సోమసూత్రం అంటారు. ఆలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ సోమసూత్రాన్ని ఎప్పుడూ దాటకూడదట. అక్కడి వరకు వెళ్లి మళ్ళీ వెనక్కి తిరిగి ప్రదక్షిణ పూర్తి చేయాలని (దీనిని చండీ ప్రదక్షిణ అని కూడా అంటారు) పండితులు సూచిస్తున్నారు. అలా కాకుండా సోమసూత్రం దాటితే అక్కడ ఉన్న దేవతలు శపిస్తారట.

శివలింగానికి వెనుక వైపు నిలబడకూడదు: గర్భగుడిలోని శివలింగానికి సరిగ్గా వెనుక భాగంలో నిలబడి నమస్కరించకూడదట. ఎప్పుడూ లింగానికి ఎదురుగా లేదా పక్కగా నిలబడి మాత్రమే మొక్కాలట. అలాగే దర్శనం చేసుకున్నప్పుడు కూడా వెనక వైపు నుంచి తిరిగి రాకూడదట.

Advertisement

శివలింగానికి, నందికి అడ్డంగా వెళ్లకూడదు: శివాలయంలో నందికి, శివలింగానికి మధ్యలో నుంచి వెళ్లకూడదట. నంది చూపు ఎప్పుడూ శివుడి మీద ఉంటుంది కాబట్టి ఆ చూపుకి అడ్డు రాకుండా పక్క నుంచి వెళ్లడం శ్రేయస్కరమని పండితులు సూచిస్తున్నారు.

శివాలయంలో శివుడి పూజలో ఉపయోగించకూడని వస్తువులు: శివ పూజలో కొన్ని వస్తువులను నిషిద్ధంగా శాస్త్రం సూచించిందని పండితులు చెప్తున్నారు. వాటిలో మొదటిది మొగలి పువ్వు (Ketaki Flower).. పురాణాల ప్రకారం శివుడు మొగలి పువ్వును పూజకు అనర్హమైనదిగా శపించాడట. ఇక తులసి దళాలు.. విష్ణుమూర్తికి ఇష్టమైన తులసిని సాధారణంగా శివలింగ పూజలో వాడరట. జలంధరుడనే రాక్షసుడి కథ దీనికి కారణంగా చెప్తున్నారు. ఇక శంఖం కూడా వాడకూడదట. శివుడు శంఖచూడుడనే అసురుడిని సంహరించినందున, శివలింగానికి శంఖంతో అభిషేకం చేయకూడదట.

శివాలయంలో గట్టిగా మాట్లాడటం లేదా కేకలు వేయడం: శివాలయం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. అక్కడ అనవసరమైన మాటలు మాట్లాడటం.. గట్టిగా నవ్వడం లేదా ఫోన్లలో మాట్లాడటం వంటివి ధ్యానానికి భంగం కలిగిస్తాయట.

విభూతిని ధరించడంలో పొరపాటు చేయకూడదట: శివాలయంలో ఇచ్చే విభూతిని నుదుటిపై అడ్డంగా (త్రిపుండ్రం) ధరించాలి తప్ప నిలువుగా పెట్టుకోకూడదట. అలాగే ఆలయం నుంచి బయటకు వచ్చేటప్పుడు కనీసం రెండు నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని రావడం మంచిదట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: సొంతింటి కల నెరవేరాలంటే ఈ అద్భుతమైన ఈజీ రెమెడీస్ పాటించాలట

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×