Love Marriages: ఆ నెలల్లో పుట్టిన జాతకులకే ఎక్కువగా ప్రేమపెళ్లిళ్లు అవుతుంటాయట. ఆ నెలలు ఏంటో.. వారికి ప్రేమ పెళ్లిళ్లు ఎలా అవుతాయో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
జనవరి: ఈ నెలలో పుట్టిన జాతకులకు పెద్దలు కుదిర్చిన వివాహమే అవుతుందట. కానీ కొన్ని సందర్బాలలో మాత్రం ఈ నెలలో జన్మించిన వాళ్లు ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటారట. కుదిర్చిన వివాహశాతం 80 ఉంటే.. లవ్ మ్యారేజ్ పర్సంటేజ్ 20 శాతంగా ఉంటుందట.
ఫిబ్రవరి: ఈ నెలలో జన్మించిన వారి జాతకరీత్యా వీరికి ప్రేమ వివాహమే అవుతుందట. పెద్దలు కుదిర్చిన వివాహం రేర్‌గా అవుతుందట. వీరిలో ప్రేమ పెళ్లిళ్ల పర్సంటేజ్ 90 శాతంగానూ అరేంజ్డ్ మ్యారేజేస్ 10 శాతంగా ఉంటాయట.
మార్చి: ఈ నెలలో పుట్టిన వ్యక్తులు కూడా ప్రేమ వివాహం చేసుకుంటారట. అయితే ఫిబ్రవరిలో పుట్టిన వారిలా 90 శాతం కాకుండా 80 శాతం మంది వ్యక్తులు ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటారట. పెద్దలు కుదిర్చిన వివాహలు 20 మందికి అవుతాయట.
ఏఫ్రిల్: ఈ నెలలో పుట్టిన జాతకులకు పెద్దలు కుదిర్చిన వివాహమే అవుతుందట. ప్రేమ పెళ్లిళ్లు అనేవి వీరి జీవితాల్లో చాలా తక్కువగా ఉంటాయట. ఇంకా చెప్పాలంటే 95 శాతం మంది అరేంజ్డ్ మ్యారేజెస్ చేసుకుంటారట. 5 శాతం మంది మాత్రమే లవ్ మ్యారేజ్ చేసుకుంటారట.
మే: ఈ నెలలో పుట్టిన వ్యక్తులు కూడా ప్రేమ వివాహాలు ఎక్కువగా చేసుకుంటారట. ఈ నెలలో పుట్టిన 65 శాతం మంది లవ్ మ్యారేజ్ చేసుకుంటే మిగతా 35 శాతం మంది అరేంజ్డ్ మ్యారేజెస్ చేసుకుంటారట.
జూన్: ఈ నెలలో పుట్టిన అధిక శాతం మంది వివాహాలు చాలా విచిత్రంగా అవుతాయట. వీరి ప్రేమను ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో ఇంట్లోంచి పారిపోయి ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటారట. కొద్ది శాతం మంది మాత్రమే అరేంజ్డ్ మ్యారేజెస్ చేసుకుంటారట.
జులై: ఈ నెలలో పుట్టిన వారికి కూడా ఫిప్టీ ఫిఫ్టీ చాన్సెస్ ఉంటాయట. వీరిలో 50 శాతం మంది లవ్ మ్యారేజ్ చేసుకుంటే మిగతా 50 శాతం మంది అరేంజ్డ్ మ్యారేజెస్ చేసుకుంటారట.
ఆగస్ట్: ఈ నెలలో పుట్టిన వాళ్లు కూడా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారట. కానీ కొద్ది మంది మాత్రం ప్రేమ కోసం పారిపోయి జీవిత భాగస్వామితో బతుకుతారట. అంటే ప్రేమ పెళ్లి చేసుకోవడం అన్నమాట.
సెప్టెంబర్: ఈ నెలలో పుట్టిన వారికి ప్రేమ పెళ్లిళ్లే అవుతాయట. వీరిలో 90 శాతం మంది లవ్ మ్యారేజ్ చేసుకుంటే మిగతా 10 శాతం పెద్దలు కుదిర్చిన అరేంజ్డ్ మ్యారెజెస్ చేసుకుంటారట.
అక్టోబర్: ఈ నెలలో పుట్టిన జాతకులు కూడా పెద్దలు కుదిర్చిన అరేంజ్డ్ మ్యారెజెస్ చేసుకుంటారట. కొద్ది మంది మాత్రం ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోతే పారిపోయి లవ్ మ్యారేజ్ చేసుకుంటారట.
నవంబర్: నవంబర్ నెలలో పుట్టిన జాతకులు కూడా 65 శాతం మంది వ్యక్తులు ప్రేమ పెళ్లిల్లు చేసుకుంటారట. వీరిలో చాలా మంది పారిపోయి పెళ్లి చేసుకుంటారట. ఇక మిగతా 35 శాతం మంది వ్యక్తులు ఇంట్లో పెద్దలు కుదిర్చిన పెళ్లి మాత్రమే చేసుకుంటారట.
డిసెంబర్: ఈ నెలలో పుట్టిన వ్యక్తులు కూడా పెద్దలు కుదిర్చిన పెళ్లిల్లే చేసుకుంటారట. వీరిలో చాలా మందికి లేటు మ్యారేజెస్ అవ్వొచ్చు లేదంటే అత త్వరగా పెళ్లి కావొచ్చని పండితులు చెప్తున్నారు.
ఆయా నెలల్లోనే పుట్టిన వారు ప్రేమ పెళ్లిళ్లు మాత్రమే చేసుకుంటారు అనేది కూడా గ్యారంటీ కాదంటున్నారు పండితులు. ఏ నెలలో పుట్టినా కొందరికి వ్యక్తిగత జాతకరీత్యా ఎలాంటి పెళ్లి అవుతుందనేది ఖచ్చితంగా చెప్పవచ్చంటున్నారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.