Love Marriage: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆయా తేదీల్లో పుట్టిన వారు అనుకోకుండా ప్రేమ పెళ్లి చేసుకుంటారట. మరికొన్ని తేదీలల్లో పుట్టిన వారు పెళ్లి కోసం యుద్దమే చేయాల్సి వస్తుందట. ఇంతకీ ఏ తేదీలో పుట్టిన వారికి ఎలాంటి వివాహం జరుగుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా సరే 2, 6, 11, 15, 20, 24, 29 తేదీలలో పుట్టిన వ్యక్తులకు త్వరగా వివాహం అవుతుందట. వీరు జీవితంలో స్థిరపడ్డారా లేదా జాబ్ చేస్తున్నారా లేదా.? ఏదైనా వ్యాపారం చేస్తున్నారా లేదా అనే విషయాలతో సంబంధం లేకుండానే వీరికి పెళ్లి జరిగిపోతుందట.
జాతకం ప్రకారం కొంత మందికి జీవితంలో స్థిర పడిన తర్వాతే పెళ్లి అవుతుందట. స్థిర పడిన తర్వాతే పెళ్లి అవుతుందా అయితే యాభై సంవత్సరాలు వచ్చాక స్థిరపడితే పెళ్లి అవుతుందా… అని చాలా మందికి అనుమానం వస్తుంది. ఇక్కడ స్తిర పడిన తర్వాత పెళ్లి అవుతుంది అంటే ఆయా తేదీలలో పుట్టిన వ్యక్తులు జీవితంలో త్వరగా స్థిర పడతారని అర్థం. ఇక ఏ నెలలోనైనా 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వ్యక్తులు జీవితంలో స్థిరపడిన తర్వాతే పెళ్లి చేసుకుంటారట.
జీవితంలో లేట్ మ్యారెజెస్ అటుంటారు కదా..? ఈ తేదీలలో పుట్టిన వారే ఆ జాతకులు. వీరికీ ఆలస్యంగా పెళ్లి అవుతుందట. ఏ నెలలో అయినా 4, 13, 22, 31 ఈ తేదీలఓ పుట్టిన వ్యక్తులకు పెళ్లి లేటుగా అవుతుందట. వీళ్లు ప్రయత్నించినా ఎర్లీగా మ్యారేజ్ అనేది వీరి జాతకంలో ఉండదట.
చాలా మంది పెళ్లి విషయంలో కన్ఫీజ్ గా ఉంటారు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో తెలియదు.. కానీ కొంత మందికి అనుకోకుండా ప్రేమ పెళ్లి జరిగిపోతుంటాయి. అది కూడా అకస్మాత్తుగా అనుకున్నదే తడవుగా ప్రేమించడం.. ప్రేమించిన వారినే వెంటనే పెళ్లి చేసుకోవడం ఈ కోవకే చెందుతుందట. ఇలాంటి జాతకులు ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీలలో పుట్టి ఉంటారట. అయితే వీరికే మాత్రమే అలా జరుగుతుందా వేరే ఎవ్వరికీ జరగదా అన్న అనుమానం రావొచ్చు కానీ నూటికి 90 శాతం అకస్మిక ప్రేమ పెళ్లిళ్లు ఈ తేదీలల్లో పుట్టిన వారికే జరగుతుంటాయని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
ఆ తేదీలలో పెట్టిన వ్యక్తులు పెళ్లి కోసం పెద్ద యుద్దమే చేయాల్సి వస్తుందట. వారు పెళ్లి చేసుకోవాలంటే అదొక పెద్ద టాస్క్ అవుతుందట. ఇలాంటి జాతకులు ఏ నెలలోనైనా 5, 14, 23 తేదీలల్లో పుడతారని పండితులు చెప్తున్నారు.
ఇక ఏ నెలలో అయినా 7, 16, 25 తేదీలల్లో పుట్టిన జాతకులు జీవితంలో పెళ్లి చేసుకోవాలంటే ఎన్నో కష్టాలు దాటాల్సి వస్తుందట. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్టు వీరి వివాహం కూడా అలా జరుగుతుందట.
ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీలల్లో పుట్టిన జాతకుల పెళ్లి ఎంతో ఫవర్ ఫుల్‌గా జరుగుతుందట.
ఆదర్శవంతమైన పెళ్లి 9, 18, 27 తేదీలల్లో పుట్టిన జాతకులకు జరుగుతుందని పండితులు చెప్తున్నారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: గ్రామ దేవతల ప్రత్యేకత ఎంటో తెలుసా..? ఇంతకీ గ్రామ దేవతలు ఎంత మందో తెలుసా..?