E-Paper
Advertisement

Simple Remedies:  సొంతింటి కల నెరవేరాలంటే ఈ అద్భుతమైన ఈజీ రెమెడీస్ పాటించాలట

Simple Remedies:  సొంతింటి కల నెరవేరాలంటే ఈ అద్భుతమైన ఈజీ రెమెడీస్ పాటించాలట
Advertisement

Simple Remedies: మీ సొంతింటి కల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారా..? ఎంత కష్టపడినా మీరు సొంతంగా ఇల్లు కట్టుకోలేకపోతున్నారా..? అయితే సొంతింటి కల నెరవేరాలంటే పరిహారశాస్త్రంలో సింపుల్ రెమెడీస్‌ ఉన్నాయంటున్నారు పండితులు. మరి ఆ రెమెడీస్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సొంత ఇంటి కల నెరవేరడం అనేది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రధానంగా చతుర్థ స్థానం (4th House), దాని అధిపతి, మరియు కుజ (Mars), శని (Saturn) గ్రహాల అనుగ్రహంపై ఆధారపడి ఉంటుందట. కుజుడు భూమికి కారకుడు అయితే, శని నిర్మాణానికి కారకుడట. మీ సొంత ఇంటి ప్రయత్నాలు త్వరగా ఫలించడానికి పరిహార శాస్త్రంలో ఈజీగా ఉండే అద్బుతమైన రెమెడీస్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

కుజ గ్రహ అనుగ్రహం కోసం: భూమికి కారకుడైన కుజుడిని ప్రసన్నం చేసుకోవడం చాలా ముఖ్యమట. అందుకోసం ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం లేదా సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం లాంటివి చేయాలట. దీనివల్ల భూమి కొనుగోలులో ఉన్న ఆటంకాలు తొలగుతాయట. ఇక మంగళవారం నాడు ఉపవాసం ఉండి, కందులను దానం చేయాలట.

వాస్తు పురుషుడి ఆరాధన: ఇంటి నిర్మాణం ఆటంకం లేకుండా సాగాలంటే వాస్తు పురుషుడి ఆశీస్సులు ఉండాలట. అందుకోసం ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం వాస్తుపురుషాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలట.

Advertisement

గణపతి ప్రార్థన చేయాలి: ఏ పనిలోనైనా విఘ్నాలు తొలగాలంటే వినాయకుడిని పూజించాలని చెప్తుంటారు పండితులు. సొంతింటి కల నెరవేరాలన్నా కూడా గణపతి ప్రార్థన తప్పనిసరి అంటున్నారు. వీలైతే ఇంట్లో గణపతి హోమం చేయించుకోవాలట. ఇంకా ప్రతి సంకటహర చతుర్థి రోజున వినాయకుడికి గరికతో పూజ చేయడం వల్ల ఆస్తి సంబంధిత చిక్కులు తొలగిపోతాయట.

కొన్ని ప్రత్యేక పరిహారాలు: ప్రతిరోజూ పక్షులకు గింజలు (ముఖ్యంగా జొన్నలు లేదా సజ్జలు) వేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి సొంత ఇంటి కల సాకారమవుతుందని చెప్తున్నారు పండితులు. అలాగే శుక్రవారం నాడు తెల్లటి ఆవుకు బెల్లం కలిపిన పచ్చి గడ్డిని లేదా నానబెట్టిన శనగలను తినిపించాలట. ఋణ విమోచన అంగారక స్తోత్రం పఠించడం వల్ల అప్పుల బాధలు తొలగి ఇల్లు కట్టుకోవడానికి మార్గం సుగమం అవుతుందట.

నిర్మాణ స్థలంలో చేయాల్సినవి: మీరు ఇప్పటికే స్థలం కొని ఉంటే ఆ స్థలంలో ఈశాన్య మూలలో ఒక చిన్న గుంట తీసి అందులో పాలు, గంగాజలం పోసి పూజ చేయడం శుభప్రదమట.  మీ స్థలంలో పసుపు రంగు పువ్వులు పూసే మొక్కలను నాటడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుందట.

జాతక చక్రంలో నాలుగవ ఇల్లు బలహీనంగా ఉన్నప్పుడు లేదా గ్రహ దోషాలు ఉన్నప్పుడు సొంతింటి నిర్మాణంలో  జాప్యాలు జరుగుతుంటాయట. పైన చెప్పిన పరిహారాలతో పాటు, మీ జాతకాన్ని ఒకసారి నిపుణులైన జ్యోతిష్యులకు చూపించుకుని, ఏ గ్రహం వల్ల ఆటంకం కలుగుతుందో తెలుసుకుని దానికి తగిన శాంతి ప్రక్రియలు చేయించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు వస్తాయట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: పుట్టుకతోనే ఆ రాశుల జాతకులకు దైవ శక్తులు వస్తాయట – ఏ రాశుల వారో తెలుసా..?

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×