E-Paper
Advertisement

simple remedies: ఇంటికి పట్టిన దరిద్రం వదలాలంటే ఈ చిన్న రెమెడీస్ పాటించాలట

simple remedies: ఇంటికి పట్టిన దరిద్రం వదలాలంటే ఈ చిన్న రెమెడీస్ పాటించాలట
Advertisement

Simple remedies: మీ ఇంటికి పట్టిన దరిద్రాలన్నీ వదిలిపోవాలంటే పరిహారశాస్త్రంలో చిన్న రెమెడీస్‌ ఉన్నాయని చెప్తున్నారు పండితులు. అయితే ఆ పరిహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మామిడి తోరణం:

ఇంటికి మామిడి తోరణాలు కడితే చాలా శుభమట. ఇంటి డోర్‌ ముందు మామిడి ఆకులు కట్టడం వల్ల ఆ ఇంట్లోకి వచ్చే నెగెటివ్‌ ఎనర్జీ డోర్‌ దగ్గరే ఆగిపోతుందట. అలాగే ఆ ఇంట్లోకి పాజిటివ్‌ ఎనర్జీ తీసుకొస్తుందట. ఇంట్లో ఎంతటి కష్టాలున్నా మెల్లమెల్లగా సమసిపోతాయట. అయితే మామిడాకులు ఏ పండుగకో పబ్బానికో కట్టుకోకుండా తరుచుగా మారుస్తుండాలని పండితులు సూచిస్తున్నారు. చాలా మంది మామిడాకులు కట్టాక అవి ఎండిపోయి రాలిపోతున్నా తీసివేయరు.. అలాంటి వారి ఇంట్లో మామిడాకుల వల్ల వచ్చే పాజిటివ్‌ కన్నా నెగెటివ్‌ ఎక్కువగా ఉంటుందట.

రాగి చెంబులో నీళ్లు, కర్పూరం, రాగి నాణేం:

Advertisement

ఇంట్లో నెగెటివ్‌ ఎనర్జీ వెళ్లిపోయి పాజిటివ్‌ రావాలంటే రాగి చెంబు ప్రయోగం చాలా అద్బుతంగా పని చేస్తుందట. ఇంటి గుమ్మానికి లోపలి వైపు ఒక రాగి చెంబులో శుభ్రమైన గంగాజలం, లేదా నీరు పోసి అందులో కొంచెం పసుపు, మరియు కర్పూరం, ఒక రాగి నాణేం లేదంటే ఐదు రూపాయల బిల్ల వేసి ఉంచాలట. దీంతో ఇంట్లోకి పాజిటివ్‌ ఎనర్జీ వరదలా వస్తుందట. అయితే తరుచుగా ఆ రాగి చెంబులోని నీటిని మారుస్తుండాలట. అప్పుడే ఆ ఇంటికి మంచి జరుగుతుందట.

ఉప్పు పాత్ర:

ఇంట్లో నెగెటివ్‌ ఎనర్జీని తరిమేయడంలో ఉప్పు కీలకపాత్ర పోషిస్తుందని పండితులు చెప్తుంటారు. అలాంటి ఉప్పును ఒక చిన్న పాత్రలో తీసుకుని ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర ఉంచాలట. దీని వల్ల ఇంటిపై ఉన్న దృష్టి దోషం పోతుందట. నరదిష్టి నివారణ అవుతుందట. అలాగే ఇంట్లోకి ప్రవేశించే చెడు శక్తులు దూరమవుతాయట.

రాగి ఆకుల తోరణం:

Advertisement

ఇంట్లో నెగెటివ్‌ ఎనర్జీని తీసివేసి పాజిటివ్‌ ఎనర్జీని ఇవ్వడంలో రాగి ఆకులు కూడా చాలా ఎఫెక్టివ్‌ గా పని చేస్తాయని పండితులు సూచిస్తున్నారు. మామిడి తోరణం లాగే రాగి ఆకులు తోరణం తయారు చేసి గుమ్మానికి కట్టాలట. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్‌ ఎనర్జీ పెరుగుతుందట. అయితే ఈ రాగి ఆకుల తోరణాన్ని కూడా తరచుగా మారుస్తుండాలని పండితులు సూచిస్తున్నారు.

మిరపకాయలు, నిమ్మకాయలు:

ఇంట్లో ప్రధాన గుమ్మం దగ్గర మిరపకాయలు, నిమ్మకాయలు ఒక దారానికి గుచ్చి వేలాడదీయడం వల్ల కూడా ఆ ఇంట్లో నెగెటివ్‌ ఎనర్జీ పోతుందట. దీని వల్ల బయటి నుంచి వచ్చే దిష్టిదోషాలు కూడా ఇంట్లోకి రాకుండా ఆగిపోతాయట. దీంతో ఆ ఇంట్లో పాజిటివ్‌ ఎనర్జీ పెరిగి ఇంట్లో వాళ్లు హ్యాపీగా ఉంటారట. అయితే ఈ రెమెడీ శుక్రవారం చేస్తే చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందట. ఆ ఇంట్లో ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోతాయట.

కుంకుమ స్వస్తిక్‌:

ఏ ఇంటి గుమ్మం పైన కుంకుమతో స్వస్తిక్‌ గుర్తు గీయబడి ఉంటుందో ఆ ఇంట్లో ధన ఐశ్వర్యాలకు లోటు ఉండదట. స్వస్తిక్‌ అనేది ధనాన్ని ఆకర్షిస్తుందట. అందుకే చాలా మంది తమ ఇంటి ముందు స్వస్తిక్‌ గుర్తు వేసుకుంటారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: తులా రాశికి ఈ సంవత్సరం గజకేసరి యోగం పట్టనుంది

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×