E-Paper
Advertisement

Ugadi panchangam 2026: తులా రాశికి ఈ సంవత్సరం గజకేసరి యోగం పట్టనుంది

Ugadi panchangam 2026: తులా రాశికి ఈ సంవత్సరం గజకేసరి యోగం పట్టనుంది
Advertisement

Ugadi panchangam 2026: తెలుగు నూతన సంవత్సరం శ్రీ పరాభవ నామ ఉగాది నుంచి శని 6వ ఇంట ఉండటంతో  తులా రాశి వారికి ఈ సంవత్సరం శత్రువుల మీద విజయం లభిస్తుంది. అలాగే గురువు 10వ ఇంట.. అంటే రాజ్యస్థానంలో  ఉండటం వల్ల తులా రాశి వారికి  కేరీర్‌లో విజయం లభిస్తుంది. అలాగే ఈ సంవత్సరం తులా రాశి వారికి ఉద్యోగంలో అద్భుతమైన గుర్తింపు లభిస్తుందట. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం కొండంత  పెరుగుతుందట. అలాగే ఈ రాశి వారు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారట. వ్యాపారంలో విపరీతమైన లాభాలు వస్తాయట. సంఘంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయట. అయితే ఈ రాశి వారు మాత్రం స్పెక్యులేషన్‌ వ్యాపారంలో కానీ ఒప్పందాలలో కానీ ఆచితూచి వ్యవహరించాలని పండితులు హెచ్చరిస్తున్నారు.

ఈ రాశిలోకి చిత్తా నక్షత్రం మూడవ, నాలుగవ పాదాలు, స్వాతి నక్షత్రం ఒకటవ, రెండవ, మూడవ, నాలుగవ పాదాలు, విశాఖ నక్షత్రం ఒకటవ, రెండవ, మూడవ పాదాలు వస్తాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సర ఆదాయం 05, వ్యయం 14, రాజపూజ్యం 06, అవమానం 03గా ఉంటుంది.

కేరీర్‌ అండ్‌ ఉద్యోగం:

Advertisement

ఈ పరాభవ నామ సంవత్సరంలో తులా రాశి వారికి జీవితంలో అనుకోని పురోగతి లభిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి. అలాగే జీతాలు పెరుగుతాయి. కోరుకున్న ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్లు అవుతాయి. మీపై పోటీ చేసే ఎవరైనా మీ చేతిలో ఓడిపోవాల్సిందే.. మీ ఆఫీసులో మీకు విలువ పెరుగుతుంది. వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మీకు స్వర్ణయుగం లాంటిది.

ఆర్థిక పరిస్థితి:

ఈ సంవత్సరం తులారాశి వారి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. స్థిరాస్థి వ్యాపారంలో కానీ షేర్‌ మార్కెట్‌ పెట్టుబడుల్లో కానీ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పాత అప్పుల నుంచి మీకు ఈ సంవత్సరం విముక్తి లభిస్తుంది.

ఆరోగ్యం:

Advertisement

ఈ సంవత్సరం మీకున్న అన్ని రకాల ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందుతారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయితే మీరు ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం  సూచించదగ్గ విషయం.

కుటుంబం:

ఈ సంవత్సరం కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీ తల్లి వైపు బంధువుల నుంచి ఆస్తి కలిసి వస్తుంది. మీ పిల్లలు చదువులో ఉన్నతంగా రాణిస్తారు. అలాగే పెళ్లి కానీ పిల్లలు ఉంటే ఈ సంవత్సరం వారికి పెళ్లి అయిపోయే సూచనలు ఉన్నాయి.

పరిహారాలు:

ఈ సంవత్సరం మరిన్ని మంచి ఫలితాల కోసం మీరు ప్రతి శుక్రవారం లక్ష్మీ దేవి ఆరాధన చేయాలి. అలాగే అష్టోత్తరం పారాయణ చేయాలి. ఇక తెల్లటి ఆవుకు గోసేవ చేయాలి. పేద మహిళలకు వస్త్రదానం చేయాలి.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఊహించని మార్పులు

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×