E-Paper
Advertisement

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు ఏఫ్రిల్ 14: ఆ రాశి వ్యాపారులకు అనుకోని లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు ఏఫ్రిల్ 14: ఆ రాశి వ్యాపారులకు అనుకోని లాభాలు
Advertisement

Today Horoscope: 

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన  ఏఫ్రిల్ 14వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూ సంభందిత కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది.  నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. 

వృషభం

Advertisement

వృధా ఖర్చుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు ఉన్నపటికీ సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. 

మిథునం

దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందక ఇబ్బందిపడతారు. ధన వ్యవహారాలలో చిన్నపాటి సమస్యలు కలుగుతాయి. ఉద్యోగమున ఇతరులతో వాదనకు వెళ్ళకపోవడం మంచిది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలించవు. దూర ప్రయాణాలు కలసిరావు. 

కర్కాటకం

Advertisement

అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. ఖర్చులకు మించి ఆదాయం ఉంటుంది. సంఘంలో ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంటారు. గృహమున సంతోషంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారమునకు నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది.

సింహం

బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్ధిరాస్తి వివాదాల పరిష్కారానికి చేసే ప్రయత్నాలు కలసివస్తాయి. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. 

కన్య

నిరుద్యోగులు ఉద్యోగమున అంచనాలు అందుకుంటారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దీర్ఘకాలిక ఋణాలు కొంతవరకు తీర్చగలుగుతారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితుల నుండి బయటపడతారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ఆలోచనలు ఆచరణలో పెడతారు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

పని ఒత్తిడి అధికమై మానసిక ఆందోళనలు పెరుగుతాయి. వాహన ప్రయాణ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని వ్యవహారాలలో సన్నిహితులు మీ మాటతో విభేదిస్తారు. వృత్తి వ్యాపారాలలో శత్రు సమస్యలు పెరుగుతాయి. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ఉద్యోగమున శ్రమాధిక్యత పెరుగుతుంది.

వృశ్చికం

వ్యాపార వ్యవహారాలలో దైర్యంగా ముందుకు సాగుతారు. ఉద్యోగమున అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృథా వ్యాపారాలలో మీ కృషికి తగిన ఫలితం పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. 

ధనుస్సు

చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచెయ్యక వాయిదా వేస్తారు. నూతన వ్యాపార ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. ఇతరులతో కొన్ని విషయాలలో విభేదాలు కలుగుతాయి. ఆర్ధికంగా స్వల్ప నష్టాలు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులుంటాయి. సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి.  

మకరం

దాయాదులతో భూ సంభందిత వివాదాల నుండి బయటపడతారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారములలో అప్రయత్న విజయం సాధిస్తారు. గృహమున పెద్దల సహాయంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగమున జీత భత్యాల విషయంలో శుభవార్త అందుకుంటారు. ఆర్ధిక పురోగతి కలుగుతుంది. 

కుంభం

ఇంటా బయట ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ధనపరంగా ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయం ఆశించినంత లభించదు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఉద్యోగమున కొంత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది.

మీనం

అనారోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం పొందుతారు. సంతాన విద్యా విషయాలు పట్ల శ్రద్ద వహించాలి. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.  ఉద్యోగమున మీ పని తీరుతో అందరిని ఆకట్టుకుంటారు.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×