Girls Zodiac Sign: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త లేదంటే మీ జీవితాలు తారుమారు కావొచ్చంటున్నారు జ్యోతిష్య పండితులు. అసలు ఏ రాశి అమ్మాయిల గురించి జ్యోతిష్యులు చెప్తున్నారు. ఆ అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండకపోతే ఏం జరుగుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహస్థితుల కదలికల ఆధారంగా మనుషుల వ్యక్తిత్వాలను అంచనా వేయోచ్చంటున్నారు జ్యోతిష్య పండితులు. అందుకోసం పుట్టిన జన్మ నక్షత్రాన్ని, జన్మ తిథిని, జన్మ రాశుల ఆధారంగా ఎవరు ఎలాంటి వారో కూడా చెప్పొచ్చంటున్నారు. ఇలా తెలుసుకోవడం వల్ల మన స్నేహితుల్లో కానీ బంధువుల్లో కానీ ఎవరు ఎలాంటి వారో ముందే తెలుసుకుని వారితో అలాగే నడుచుకునే వీలుంటుంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అబ్బాయిలు చాలా మంది లవ్‌లో ఫెయిల్ అయి సూసైడ్ చేసుకునే వరకు వెళ్తున్నారు. అలాంటి వాళ్లు ముందే తాము లవ్ చేసిన అమ్మాయి వ్యక్తిత్వం అంటే ఆ అమ్మాయికి ప్రేమించడం ఇష్టమా..? లేదా..? ఒక వేళ ప్రేమిస్తే ఆ అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలి.. ఆ అమ్మాయి అభిరుచులు ఏంటి…? అనే విషయాలు తెలుసుకోవచ్చంటున్నారు పండితులు.
వృషభ రాశి: ఈ రాశిలో పుట్టిన అమ్మాయిలు అంత త్వరగా ప్రేమని అంగీకరించరట. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేమ విషయంలో బలవంతం చేయకండి. ఒకవేళ మీరు బలవంతంగా వీరిని ప్రేమ విషయంలో ఒప్పించాలిన చూస్తే.. వీళ్లు జీవితాంతం మిమ్మల్ని ధ్వేషిస్తారట.
కన్యా రాశి: ఈ రాశిలో పుట్టిన అమ్మాయిలు గురించి జ్యోతిష్య పండితులు పలు ఆసక్తికర విషయాలు చెప్తున్నారు. ఈ రాశి అమ్మాయిలు డేటింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారట. ప్రేమ పేరుతో డేటింగ్ కి పిలిస్తే ఈ రాశి జాతకులు జీవితంలో ఇక మీ ముఖం చూడరట. మీరు వాళ్లను మోసం చేస్తారేమోనన్న చిన్న అనుమానం వచ్చినా కూడా మీకు గుడ్ బై చెప్తారట. ఇక మీరు చెప్పిందే వేదం అన్నట్టు ప్రవర్తించినా మీరు విపరీత ధోరణితో ఉన్నారన్న అనుమానం వచ్చినా ఈ రాశి అమ్మాయిలు మిమ్మల్ని దూరం పెడతారట. ఇంకా చెప్పాలంటే వీళ్లు వెంటనే మీ గురించి పట్టించుకోవడం కూడా మానేస్తారట.
తులా రాశి: ఈ రాశిలో పుట్టిన అమ్మాయిలు మొదట్లో కాస్త మొండిగా ప్రవర్తిస్తారట. మీరేంటో.. మీ వ్యక్తిత్వం ఏంటో అంచనా వేయడంలో ఈ రాశి అమ్మాయిలు దిట్ట. మీరు ఈ అమ్మాయిల మీద ప్రేమ, అప్యాయత కొంచెం తగ్గించినా వెంటనే పసిగట్టేస్తారట. అలాంటి సిచ్యుయేషన్ వస్తే మిమ్మల్ని అవైడ్ చేస్తారట. తర్వాత మీరు ఎంత ప్రయత్నించినా వీళ్లను ఒప్పించలేరట.
ధనస్సు రాశి: ఈ రాశిలో పుట్టిన అమ్మాయిలు ఎక్కువగా స్వేచ్చను కోరుకుంటారు. వీళ్లకు మీరు ఫ్రీడమ్ ఇవ్వాలట. అలా కాకుండా రిస్టిక్షన్స్ పెడితే మాత్రం వెంటనే మిమ్మల్ని వాళ్లు దూరం పెట్టేస్తారట. ఇక వీళ్లు ఏదైనా పని చేస్తే మీరు మెచ్చుకోవాలి. కానీ విమర్శిస్తే మాత్రం మిమ్మల్ని నిర్దాక్ష్యిణంగా వదిలేసి వెళ్లిపోతారట.
మీన రాశి: ఈ రాశిలో పుట్టిన అమ్మాయిల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలట. ప్రేమ విషయంలో ఈ రాశి అమ్మాయిలు చాలా కఠినంగా ఉంటారట. ఏ విషయంలో అయినా వీరిని ఒప్పించడం అంత ఈజీ కాదంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రేమ విషయంలో అయితే ఈ రాశి అమ్మాయిలను మెప్పించడం అంత సులువు కాదట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం