E-Paper
Advertisement

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు ఏఫ్రిల్ 23: ఆ రాశి వారికి సన్నిహితుల నుంచి ధనలాభం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు ఏఫ్రిల్ 23: ఆ రాశి వారికి సన్నిహితుల నుంచి ధనలాభం
Advertisement

Today Horoscope: 

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన  ఏఫ్రిల్ 23వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. దైవ చింతన పెరుగుతుంది. బంధు మిత్రులతో గృహమున సందడిగా గడుపుతారు. ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి. 

వృషభం

Advertisement

వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపార వ్యవహారాలలో స్వంత ఆలోచనతో ముందుకు సాగడం మంచిది. చేపట్టిన పనులు వాయిదా వేయడం మంచిది. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగమున పనిభారం తప్పదు. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం కనిపించదు. 

మిథునం

చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. సన్నిహితుల నుండి ఊహించని ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ది కలుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలసివస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. 

కర్కాటకం

Advertisement

ఆర్థికంగా కొంత పురోగతి కలుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపారమున ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.

సింహం

ఆదాయం విషయంలో నిరాశ తప్పదు. ఉద్యోగమున చిన్నపాటి వివాదాలుంటాయి. వృత్తి వ్యాపారములలో కొత్త సమస్యలు ఎదురవుతాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. 

కన్య

నూతన ఋణ ప్రయత్నాలు కొంతవరకు కలిసివస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఆకస్మికంగా స్థానచలనాలుంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు. బంధు వర్గం వారితో మాటపట్టింపులుంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

కుటుంబ సభ్యుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. పాతమిత్రుల కలయిక సంతోషం కలిగిస్తుంది. సమాజంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

వృశ్చికం

ఆప్తులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన ఆలోచనలను కార్యరూపం దాల్చుతాయి. స్ధిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. 

ధనుస్సు

మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో ఊహించని కలహాలు కలుగుతాయి. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి,వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి.  

మకరం

ఆప్తుల నుండి అందిన సమాచారం కొంత మానసికంగా బాధిస్తుంది. దూర ప్రయాణాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ విషయంలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. 

కుంభం

ఆప్తులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలలో ఊహించని లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమౌతుంది.

మీనం

వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. చుట్టు పక్కల వారితో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహారించాలి.  ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపడతారు.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×