Ugadi panchangam 2026: ఉగాది నుంచి తెలుగు నూతన సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం రానుంది. ఈ తెలుగు నూతన సంవత్సరంలో మీన రాశి వారికి అద్బుతమై యోగం ఉంటుందని పండితులు చెప్తున్నారు. ఏలినాటి శని ఈ సంవత్సరం మీనరాశికి పని చేయదట. అందువల్ల అద్బుతమైన విజయాలు మీరు సాధించబోతున్నారు. ముఖ్యంగా పిల్లలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మంచి స్కూల్స్ లో జాయిన్ చేస్తారు. వాళ్ల అభివృద్దిని మీరు ప్రత్యక్షంగా చూస్తూ మానిటర్ చేస్తారు. గతజన్మ ఫుణ్యపలం మీకు ఇప్పుడు అక్కరకు రానుంది.
పాత మిత్రులను మీరు మళ్లీ కలుసుకుంటారు.. పాత వ్యాపారస్తులు మళ్లీ మీ దగ్గరకు వచ్చి మీతో కలిసి వ్యాపారం చేస్తారు. మీరు చేయబోయే సాహసోపేతమైన నిర్ణయాల వల్ల మీ కంపెనీస్ అద్బుతమైనటువంటి విజయాల్ని సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే మీకు నరఘోష ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ గురువు అనుగ్రహంతో మీరు సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు. అయితే ఈ సంవత్సరం మీన రాశి వారికి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కావాలట అందుకోసం సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాలను సందర్శించాలని సూచిస్తున్నారు.
మీన రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా బాగా కలిసి వస్తుందట. కానీ ఖర్చుల విషయంలో నియంత్రణ ఉండాలని సూచిస్తున్నారు.. అయితే మీన రాశి వారు.. జూన్ నుండి అక్టోబర్ వరకు పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉంటుందని సూచిస్తున్నారు.
మీన రాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో కేరీర్ ప్రరంగా జూన్ వరకు ఒత్తిడి, ఆలస్యాలు ఉండవచ్చు. జూన్ తర్వాత కెరీర్‌లో వృద్ధి పుంజుకుంటుంది. కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు, ముఖ్యంగా రసాయనాలు, రియల్ ఎస్టేట్ రంగాల్లో స్థిరమైన అభివృద్ధిని పొందుతారు.
మీన రాశి వారికి శని ప్రభావం వల్ల మొదటి 3 నెలలు అలసటగా, మానసిక ఒత్తిడితో ఉండవచ్చని జ్యోతిష్యులు చెప్తున్నారు.. ఈ మూడు నెలలో కఠినమైన ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ఉత్తమం అంటున్నారు. విద్యార్థులకు, పరిశోధన చేసేవారికి జూన్ తర్వాత మంచి ఫలితాలు ఉంటాయట.
మొత్తం మీద మీన రాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో కెరీర్ పరంగా, ఆర్థికపరంగా స్థిరత్వం ఉంటుందట, జూన్ తర్వాత గురుడు 5వ ఇంట సంచరించడం వల్ల సృజనాత్మకత, అదృష్టం, విద్యలో మంచి ఫలితాలు లభిస్తాయని పండితులు సూచిపస్తున్నారు. ఈ సంవత్సరం మొదటి సగం కుటుంబ సంతోషాన్ని ఇస్తే, చివరి నెలల్లో ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అయితే ఖర్చుల విషయంలో నియంత్రణ ఉంటే అద్బుతమైన అభివృద్ది చూస్తారట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.