E-Paper
Advertisement

Habits: ఈ అలవాట్లే మీ సకల దరిద్రాలకు కారణమట – ఏ అలవాట్లో తెలుసా..?

Habits: ఈ అలవాట్లే మీ సకల దరిద్రాలకు కారణమట – ఏ అలవాట్లో తెలుసా..?

Habits: మీరు చేసే కొన్ని పొరపాట్లే మీ జీవితంలోకి వచ్చే సకల దరిద్రాలకు కారణం అవుతాయట. మీకున్న చిన్న చిన్న అలవాట్లే మీ జీవితాన్ని కష్టాల పాలు చేస్తాయట. ఇంతకీ ఆ పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

దేవుని తిట్టకూడదు:

ఎట్టి పరిస్థితుల్లో దేవుడిని తిట్టకూడదట. అలా చేయడం వల్ల మీ జీవితంలో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందట. ఒకప్పుడు పెద్దలు దేవుడిని తిడితే కళ్లు పోతాయి అని పిల్లలకు బుద్ది చెప్పేవారు. కానీ అది పిల్లలకే కాదు పెద్దలకు కూడా వర్తిస్తుందని పండితులు చెప్తున్నారు.

కుక్కను కాలితో తన్నకూడదు:

ఇంట్లో పెంచుకునే కుక్కైనా వీధిలో తిరిగే కుక్కైనా దానిని కాలితో తన్నకూడదట. సనాతన ధర్మంలో కుక్కను కాలభైరవ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి కుక్కను కాలితో తన్నితే అష్ట దరిద్రాలు వస్తాయట.

చీపురును కాలితో తన్నరాదు:

చీపురును కొన్ని ప్రాంతాల్లో లక్ష్మీ స్వరూపంగా బావిస్తారు. కాబట్టి చీపురును కాలితో తన్నితే ఆ వ్యక్తి జీవితాంతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అంటుంటారు. ఇంకొన్ని చోట్ల చీపురును దరిద్ర దేవతతో పోలుస్తారు. అలా చూసుకున్నా దరిద్రాన్ని కాలితో తన్ని మరీ జీవితంలోకి ఆహ్వానించినట్టు అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చీపురును కాలితో తన్నకూడదట.

బంధువులను, అతిథులను తిట్టరాదు:

ఇంటికి వచ్చిన అతిథులను బంధువులను తిడితే కూడా జీవితంలో ఊహించని కష్టాలు వస్తాయట. హిందూ ధర్మం ప్రకారం అతిథి దేవో భవ అంటారు. అంటే ఇంటికి వచ్చిన అతిథి దేవుడితో సమానం అని అర్థం దేవుడితో సమానం అయిన వ్యక్తిని తిట్టడం అంటే దేవుడిని తిట్టడం లాంటిదే కనుక బంధువులను తిట్టకూడదు అని చెప్తుంటారు పండితులు.

అక్కాచెల్లెళ్లతో హాస్యం ఆడరాదు:

తోడబుట్టిన అక్కా చెల్లెళ్లతో కానీ వరుసకు అక్కా చెళ్లెల్లు అయిన వారితో కూడా ఎప్పటికీ హాస్యం ఆడరాదు. ఇంటికి ఆడపిల్ల అంటే లక్ష్మీ దేవిలా భావిస్తారు. అలాంటి ఆడపిల్లతో హాస్యం ఆడితే లక్ష్మీదేవితో ఆడినట్టేనని అలాంటి వ్యక్తికి ఆర్థికపరమైన కష్టాలు వస్తాయని పండితులు సూచిస్తున్నారు.

చెప్పులను దొంగతనం చేయరాదు:

ఎక్కడైనా సరే వేరే వాళ్ల చెప్పులు వేసుకుంటే వారికున్న కర్మలన్నీ వేసుకున్న వ్యక్తికి వస్తాయని శాస్త్రం చెప్తుందని అంటారు. అలాంటిది వేరే వాళ్ల చెప్పులు దొంగిలించడం వల్ల వారికున్న చెడు కర్మలన్నీ దొంగిలించిన వారికి వస్తాయట. చాలా మంది అంటుంటారు.. ఆలయాలు దగ్గర తమ చెప్పులు పోతే తమ దరిద్రం పోయిందని.. అలాంటిదే ఇది కూడా అంటున్నారు పండితులు.

గోళ్లను సాయంత్ర పూట తీయరాదు:

ఎప్పుడైనా గోళ్లను సాయంత్రం పూట తీస్తే అలీ తీసిన వ్యక్తికి జీవితంలో దరిద్రం పట్టుకుంటుందని పెద్దలు చెప్తుంటారు. సాయంత్రం పూట గోళ్లు తీయడం అంటే నెగెటివ్‌ ఎనర్జీకి ఆహ్వానం పలికినట్టేనట.

సాయంత్రం దీపం వెలిగించిన తర్వాత తల దువ్వకూడదు:

ఇంట్లో సాయంత్ర దేవుడి ముందు దీపం వెలిగించిన తర్వాత కానీ లేదంటే ఇంట్లో లైట్‌ వేసిన తర్వాత కానీ ఎట్టి పరిస్థితుల్లో తల దువ్వరాదని పండితులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల దరిద్ర దేవతను తమ జీవితంలోకి వెల్‌కం చెప్పినట్టేనని సూచిస్తున్నారు.

ఇంకా అన్నదమ్ములను కొట్టరాదు, అద్దమును పదే పదే చూడకూడదు ఇలాంటి పనులను ఎవరైతే చేస్తారో వారి జీవితంలోకి వాళ్లే దరిద్ర దేవతకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు అని పండితులు సూచిస్తున్నారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: తిరుమలలో ఫస్ట్ టైం అన్నదానం చేసింది ఎవరో తెలుసా..?

 

Related News

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే10: ఆ రాశి స్థిరాస్థి వ్యాపారులకు లాభాలు – నిరుద్యోగులకు శుభవార్తలు

Weekly Horoscope May 10 To May 16: ఈ వారం ఆ రాశి రాజకీయ నాయకులకు అద్బుతంగా ఉంటుంది

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 09: ఆ రాశి వారికి వ్యాపారంలో లాభాలు – విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 08: ఆ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది – వారికి వ్యాపారంలో లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 07: ఆ రాశి వారికి అకస్మిక ధన లాభం – వారికి వ్యాపారాలలో లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 06: ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం – వారికి ప్రముఖులతో పరిచయం

Big Stories

×