E-Paper
Advertisement

Ugadi panchangam 2026: ఈ సంవత్సరం మిథున రాశికి మిశ్రమ ఫలితాలు

Ugadi panchangam 2026: ఈ సంవత్సరం మిథున రాశికి మిశ్రమ ఫలితాలు
Advertisement

Ugadi panchangam 2026: పరాభవ నామ సంవత్సరంలో మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా ఎంత సంపాదించినా.. ఖర్చులు కూడా అంతే విధంగా  పెరుగుతాయి. ఉద్యోగులకు, వ్యాపారస్తులకు ఈ సంవత్సరం ఓర్పు చాలా అవసరం, ఈ రాశి జాతకులకు సామాజికంగా గౌరవం పెరుగుతుంది. ఈ సంవత్సరం ఈ రాశి జాతకుల కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. రాహు, కేతువుల ప్రభావంతో ఈ రాశిలో జన్మించిన వారికి అనారోగ్య సూచనలు ఉన్నాయి కాబట్టి వీళ్లు ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి.  ఈ రాశిలో మృగశిర నక్షత్రం మూడు, నాలుగు పాదాలు కా, కి అనే అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారు.. ఆరుద్ర  నక్షత్రం ఒకటి, రెండు, మూడు, నాలుగు పాదాలు కూ, ఖం, జ, చా అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారు.. పునర్వసు నక్షత్రం ఒకటి, రెండు, మూడు పాదాలు కే, కో, హా అనే అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారు ఈ రాశిలోకి వస్తారు.  ఈ సంవత్సరం ఈ రాశి జాతకుల ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7గా ఉంది.

కేరీర్‌ అండ్‌ ఉద్యోగం:

ఈ పరాభవ నామ సంవత్సరంలో మిథున రాశి వారి కేరీర్‌ పరంగా బాగానే ఉంటుంది. ఈ సంవత్సరం వీరికి పనిభారం ఎక్కువగా ఉంటుంది. అయితే చేసిన పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే ప్రమోషన్లు వస్తాయి. ఇక నూతన అవకాశాల కోసం ఎదురుచూసేవారికి శుభవార్తలు అందుతాయి. ఎన్నో రోజుల నుంచి వ్యాపార విస్తరణ చేయాలనుకుంటున్న వారికి ఇది సరైన సమయం. ఈ సంవత్సరం వ్యాపారాలు విస్తరిస్తే లాభాల బాటలో నడుస్తాయట.

ఆర్థిక పరిస్థితి:

Advertisement

ఈ రాశి జాతకులు ఈ సంవత్సరం ఆర్థికంగా అద్బుతంగా ఉంటుందని చెప్తున్నారు. గురువు ధన స్థానంలో ఉన్నందుకు వీరికి ఆర్థికపరమైన విజయం లభిస్తుందట. లక్ష్మీ దేవి వీరి ఇంట్లో తాండవం చేయబోతుందంటున్నారు. ధనం ప్రవాహంలా వస్తుందట. పాత బాకీలు కూడా వసూలు అవుతాయట. ఈ సంవత్సరం వీరు పెట్టుబడులు పెట్టడానికి అనువైన కాలం అని చెప్తున్నారు పండితులు.

ఆరోగ్యం:

ఈ సంవత్సరం ఈ రాశి జాతకులు సంపాదనలో పడి ఆరోగ్య విషయంలో అజాగ్రత్తగా ఉండే పరిస్థితులు ఉన్నాయట. పని ఒత్తిడిలో పడిపోవడం వల్ల వీరికి ఈ పరాభవ నామ సంవత్సరంలో వెన్నుపూసక సంబంధించిన అనారోగ్య సూచనలు ఉన్నాయట. అలాగే మోకాళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉందట. అయితే తగినంత విశ్రాంతి తీసుకోవడం.. మసయానికి భోజనం చేయడం మర్చిపోవద్దని పండితులు సూచిస్తున్నారు.

కుటుంబం:

Advertisement

ఈ రాశి జాతకులు ఈ ఉగాది నుంచి కుటుంబ జీవితం అద్బుతంగా ఉంటుందట. వీళ్లు కుటుంబంతో సంతోషంగా గడుపుతారట. కుటుంబంలో వారి మాటకు విలువ పెరుగుతుందట.. అలాగే అవివాహితులకు వివాహం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయట. ఇక పెళ్లైన పిల్లలు కానీ జంటలకు ఈ సంవత్సరం శుభవార్త అందిస్తుదట. ఈ రాశి వారికి ఈ సంవత్సరం సంతాన భాగ్యం కలుగుతుందట.

పరిహారాలు:

ఈ సంవత్సరం అంతా ఈ మిథున రాశి జాతకులు ప్రతిరోజూ విష్ణు సహస్రనామాలు పారాయణ చేయాలట. అలాగే శనివారం నియమం పాటించాలి. ఇంకా గోసేవ చేయాలట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: వృషభ రాశికి అద్బుతమైన యోగం

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×