E-Paper
Advertisement

Ugadi panchangam 2026: వృషభ రాశికి అద్బుతమైన యోగం

Ugadi panchangam 2026: వృషభ రాశికి అద్బుతమైన యోగం
Advertisement

Ugadi panchangam 2026: తెలుగు నూతన సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి అద్భుతమైన యోగం పట్టనుందట. ఈ రాశి వారికి ఈ ఉగాది నుంచి  వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో విశేషమైన అభివృద్ధి, ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని పండితులు సూచిస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందట. అలాగే ఈ రాశి జాతకులు తమ ఇండ్లలో  శుభకార్యాలు జరుగుతాయట. ఈ రాశి వారికి ఈ సంవత్సరం స్థిరాస్తి కొనుగోలు చేసే యోగం ఉందట. కుటుంబంలో అనుకూలత ఉంటుందట. కానీ ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త పడాలని పండితులు సూచిస్తున్నారు. ఈ రాశిలో కృత్తిక నక్షత్రం రెండు, మూడు, నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు, మృగశిర నక్షత్రం ఒకటి, రెండు పాదాలు ఉంటాయి. ఈ సంవత్సరం వృషభ రాశి ఆదాయం 5, వ్యయం 14 ఉంది. అలాగే రాజపూజ్యం 5, అవమానం 4గానూ ఉన్నాయి. ఈ రాశికి ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావం ప్రారంభం కానుంది.

కేరీర్‌ అండ్‌ ఉద్యోగం:

ఈ రాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉద్యోగంలో పురోగతి కనిపిస్తుంది. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ప్రమోషన్లు ఈ సంవత్సరం వస్తాయి. అలాగే ఎవరైతే జీతాలు పెరగాలని ఆశలు పెట్టుకున్నారో వారి ఆశలు ఈ సంవత్సరం నెరవేరతాయి. ఉద్యోగులకు ఈ పరాభవ నామ సంవత్సరంలో జీతాలు పెరుగుతాయి. అయితే ప్రమోషన్లు వచ్చిన వాళ్లకు మాత్రం దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల పని ఒత్తిడి పెరుగుతుంది. దీనిని బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది.

ఆర్థిక పరిస్థితి:

Advertisement

వృషభ రాశి జాతకులకు ఈ తెలుగు నూతన సంవత్సరంలో ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. అద్బుతమైన ఆర్థిక పరిస్థితి నెలకొంటుంది. ఈ సంవత్సరం ఈ రాశి వాళ్లు స్థిరాస్తి కొనే సూచనలు కనిపిస్తున్నాయి. లేదా వాహనం కొనుగోలు చేస్తారు.. లేదీ ఈ రెండు కలిపి తీసుకునే సమయం కూడా ఇదేనని చెప్తున్నారు పండితులు. అయితే ఈ రాశి వారికి ఖర్చులు కూడా ఆదాయానికి మించి ఉంటాయని ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పండితులు హెచ్చరిస్తున్నారు.

ఆరోగ్యం:

వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యం విషయంల కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. నిద్రలేమి, కంటి సమస్యలు ఈ రాశి వారిని వేధిస్తాయి. ఇంకా పాదాల సమస్యలు వీరిని ఇబ్బంది పెడతాయి. అయితే మానసిక ప్రశాంతత కోసం యోగా చేయడం ముఖ్యం.

కుటుంబం:

Advertisement

ఈ రాశి వారికి తీ సంవత్సరం ఉగాది నుంచి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. పెళ్లి, లేదా గృహ ప్రవేశం లాంటిని జరిగే అవకాశం ఉంది. అలాగే జీవిత భాగస్వామితో మంచి రిలేషన్‌ ఏర్పడుతుంది. అయితే చిన్న చిన్న అపార్థాలకు తావివ్వకుండా ఉండాలి.

పరహారాలు:

ఈ రాశి వారు ఈ సంవత్సరం శుభ ఫలితాలు పెరగడానికి లక్ష్మీ దేవిని పూజించాలట. అలాగే  కనకధారా స్తోత్రం పఠించాలట. ఇంకా శివారాధన చేయడం.. హనుమాన్‌ చాలీసా పారాయణ చేయడం.  మరియు శ్రీకృష్ణుడికి పాలతో చేసిన ప్రసాదాన్ని నివేదించడం మంచిదట. అలాగే పక్షులకు లేదా జంతువులకు తరచుగా దాన ఇస్తుండాలట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: మేష రాశికి ఈ సంవత్సరం అదృష్టమే అదృష్టం

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×