E-Paper
Advertisement

ఫోటో, వీడియో ఎడిటింగ్ సరికొత్తగా! మీ బడ్జెట్‌లో టాప్ 5 డిస్‌ప్లే మానిటర్స్

ఫోటో, వీడియో ఎడిటింగ్ సరికొత్తగా! మీ బడ్జెట్‌లో టాప్ 5 డిస్‌ప్లే మానిటర్స్
Advertisement

Best color accurate monitors: గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ లేదా ఫోటోగ్రఫీ చేసేవారికి కరెక్ట్ కలర్ టోన్స్ ఇచ్చే మానిటర్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మామూలు స్క్రీన్లపై కనిపించే రంగులు, ప్రింట్ లేదా ఫైనల్ అవుట్‌పుట్‌లోకి వచ్చే సరికి మారి పోతుంటాయి. ఈ కలర్ తేడాల వల్ల క్రియేటివ్ వర్క్ దెబ్బతినకుండా ఉండాలంటే.. 100% sRGB, DCI-P3, HDR సపోర్ట్ ఉన్న ప్రొఫెషనల్ మానిటర్స్ వాడటం బెటర్. గ్రాఫిక్ డిజైనర్లు, ఎడిటర్లు, కంటెంట్ క్రియేటర్ల కోసం టాప్ 5 కలర్-ఆక్యురేట్ మానిటర్లు, వాటి ధరలు ఇవే..

1.BenQ DesignVue PD2700U 27-inch 4K UHD:

డిజైనర్లు, యానిమేటర్లలో బెన్‌క్యూ ప్రొఫెషనల్ లైన్ మానిటర్లకు చాలా క్రేజ్ ఉంది. 27-ఇంచుల 4.K UHD IPS డిస్‌ప్లే, 100% sRGB, Rec.709 కలర్ స్పేస్, డ్యూయల్‌వ్యూ మోడ్, CAD/CAM మోడ్ దీని స్పెషల్ ఫీచర్లు. అంతే కాకుండా ఇది ఫ్యాక్టరీ కాలిక్యులేటెడ్ కలర్ ఆక్యురసీ కలిగి ఉంటుంది. బాక్స్ నుంచి బయటకు తీయగానే రీ-కాలిక్యులేట్ చేయకుండా నేరుగా ప్రొఫెషనల్ వర్క్ మొదలుపెట్టవచ్చు.

Advertisement

ధర: రూ.33,990 – రూ.35,500

2.ASUS ProArt Display PA278QV 27-inch:

తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం లెవెల్ ఆక్యురసీ కోరుకునే ఫోటో ఎడిటర్లకు ఇది అద్భుతమైన ఛాయిస్. 27-ఇంచుల WQHD (2560 x 1440) IPS స్క్రీన్, 100% sRGB, 100% Rec.709, Calman Verified సర్టిఫికేషన్, 75Hz రిఫ్రెష్ రేట్ దీని ప్రత్యేకతలు. ప్రోఆర్ట్ ప్యానెట్, ప్రోఆర్ట్ ప్రిసెట్ ఫీచర్ల వల్ల కలర్స్, బ్రైట్‌నెస్ కస్టమైజ్ చేసుకోవడం చాలా ఈజీ.

Advertisement

ధర: రూ.24,990 – రూ.26,500

3. Dell UltraSharp U2723QE 27-inch 4K USB-C Hub Monitor:

డెల్ ఆల్ట్రాషార్ప్ సిరీస్ ఎప్పటికప్పుడు వీడియో ఎడిటింగ్, యానిమేషన్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. 27-ఇంచుల 4K UHD, IPS Black టెక్నాలజీ, 98% DCI-P3, VESA DisplayHDR 400, USB-C హబ్ విత్ 90W పవర్ డెలివరీ దీని ప్రత్యేక ఫీచర్లు. దీనిలో IPS బ్లాక్ టెక్నాలజీ వల్ల డార్క్ షేడ్స్, కాంట్రాస్ట్ రేషియో నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. కలర్ గ్రేడింగ్ చేసే వీడియో ఎడిటర్లకు ఇది రోల్స్ రాయిస్ లాంటిది.

ధర: రూ.52,990 – రూ.55,000

4. LG 27UP850N-W 27-inch 4K UHD Display:

యూట్యూబర్లు, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు మల్టీపర్పస్ యూసేజ్‌కి ఇది బాగా సెట్ అవుతుంది.
4K UHD IPS ప్యానెల్, DCI-P3 95%, VESA DisplayHDR 400, USB Type-C పోర్ట్ సపోర్ట్ దీని ఫీచర్లు.
ఈ లాప్‌టాప్‌లను సింగిల్ కేబుల్‌తో కనెక్ట్ చేసి ఛార్జింగ్ పెట్టుకుంటూనే, హాలీవుడ్ లెవెల్ కలర్ ప్రొఫైల్‌ను హ్యాండిల్ చేయవచ్చు.

ధర: రూ.30,990 – రూ.32,990

Also Read: తాగునీరు విషయంలో కాంప్రమైజ్ వద్దు ! వీటితో హెల్దీ అండ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్

5. ViewSonic ColorPro VP2768a-4K 27-inch:

కలర్ ఆక్యురసీలో రాజీ పడని డిజైనర్ల కోసం వ్యూసోనిక్ ప్రొఫెషనల్ లైన్‌ నుంచి వచ్చిన మోడల్ ఇది.
4K UHD, 100% sRGB, Pantone Validated కలర్ కవరేజ్, ఆటోమేటిక్ యునిఫార్మిటీ కరెక్షన్, ఎర్గోనామిక్ స్టాండ్ దీని ఫీచర్లు. స్క్రీన్ అంతటా ఒకే రకమైన లైటింగ్, కలర్ డెప్త్ ఉండేలా ఇది చూసుకుంటుంది. గ్రాఫిక్ డిజైన్స్, ప్రింటింగ్ వర్క్స్ చేసేవారికి ఇది పర్‌ఫెక్ట్ అని చెప్పొచ్చు.

ధర: రూ.39,990 – రూ.41,500

మంచి కలర్-ఆక్యురేట్ మానిటర్ అనేది ఎడిటర్లు, డిజైనర్ల క్రియేటివిటీకి ఇచ్చే బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్. మీ వర్క్ ప్రొఫైల్, బడ్జెట్‌ను బట్టి పైన పేర్కొన్న 5 ప్రొఫెషనల్ మానిటర్లలో ఒకదాన్ని ఎంచుకుంటే.. మీ డిజైన్ల విజువల్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్‌కు చేరుకోవడం ఖాయం

Related News

అమెజాన్‌లో ప్రత్యక్షమైన గూగుల్ సీక్రెట్ డివైజ్.. ఇండియా లాంచ్ డేట్ లీక్?

గూగుల్ కంటే ఏఐ సెర్చ్ వేగంగా పనిచేస్తుందా? ఏ సమయంలో ఏది వాడటం బెటర్?

Airtel యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆ ప్రచారంలో నిజం లేదు.. క్లారిటీ ఇచ్చిన టెలికాం దిగ్గజం

కొత్త Air Purifier కొనేముందు తప్పక చూడాల్సిన 5 ముఖ్యమైన ఫీచర్లు ఇవే!

ఈ స్మార్ట్‌వాచ్ దెబ్బకు మార్కెట్ షేకవ్వాల్సిందే.. భారీ అప్‌గ్రేడ్‌తో Galaxy Watch 9!

ఛార్జర్ లేదా? డోంట్ వర్రీ.. ఫోన్ బ్యాటరీ ఫుల్ చేయడానికి ఈ ఒక్క కేబుల్ చాలు!

అమెజాన్ బంపరాఫర్.. ‘వన్‌ప్లస్ 13’పై రూ.12 వేల తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలివే!

వైన్ బాటిల్‌కి స్క్రూ క్యాప్ ఉంటే నాసిరకమా? అసలు మూతకి, క్వాలిటీకి ఉన్న సంబంధం ఏమిటి!

Big Stories

Advertisement
×