E-Paper
Advertisement

Women Health: మహిళా దినోత్సవం ప్రత్యేకం.. మీరు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన హెల్త్ స్క్రీనింగ్ టెస్టులు ఇవే!

Women Health: మహిళా దినోత్సవం ప్రత్యేకం.. మీరు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన హెల్త్ స్క్రీనింగ్ టెస్టులు ఇవే!
Advertisement

Women Health: అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది కేవలం వేడుక మాత్రమే కాదు, మహిళల హక్కులు, సమానత్వం , ముఖ్యంగా వారి ఆరోగ్యంపై అవగాహన కల్పించే సందర్భం. 2026 సంవత్సరానికి గానూ “Rights. Justice. Action. For ALL Women and Girls” అనే నినాదంతో ఐక్యరాజ్యసమితి ముందుకు సాగుతోంది. మహిళలు కుటుంబం, వృత్తి బాధ్యతల్లో మునిగిపోయి తరచుగా తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ ప్రత్యేక రోజున మహిళలు ఎదుర్కొనే ప్రధాన ఆరోగ్య సమస్యలు, ముందస్తు జాగ్రత్తలపై అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం.

మహిళలు ఎదుర్కొనే ప్రధాన ఆరోగ్య సమస్యలు:
మహిళల శరీర నిర్మాణం, హార్మోన్ల మార్పుల వల్ల వారు కొన్ని ప్రత్యేకమైన ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటారు. 2026 గణాంకాల ప్రకారం.. మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న సమస్యలు ఇవే..

Advertisement

1. గుండె సంబంధిత వ్యాధులు:
చాలా మంది గుండెపోటు అనేది పురుషులకు మాత్రమే వస్తుందని భావిస్తారు. కానీ మహిళల్లో మరణాలకు ప్రధాన కారణం గుండె జబ్బులే. పురుషులతో పోలిస్తే మహిళల్లో గుండెపోటు లక్షణాలు (అలసట, శ్వాస ఆడకపోవడం, వికారం) భిన్నంగా ఉంటాయి.అందుకే వీటిని తరచుగా నిర్లక్ష్యం చేస్తారు.

2. రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు:
ప్రపంచ వ్యాప్తంగా మహిళల్లో అత్యధికంగా నమోదవుతున్న క్యాన్సర్లు ఇవే. ముందస్తుగా గుర్తిస్తే.. వీటిని నయం చేయడం సులభం. 40 ఏళ్లు పైబడిన వారు మామోగ్రామ్, 30 ఏళ్లు దాటిన వారు ప్యాప్ స్మియర్ పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవాలి.

Advertisement

3. థైరాయిడ్, హార్మోన్ల అసమతుల్యత:
ప్రస్తుత లైఫ్ స్టైల్ కారణంగా థైరాయిడ్ సమస్యలు,పీసీఓఎస్ వంటివి పెరిగిపోతున్నాయి. దీని వల్ల బరువు పెరగడం, పీరియడ్స్ సమయానికి రాకపోవడం, సంతానలేమి వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.

4. ఎముకల బలహీనత:
మెనోపాజ్ తర్వాత మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం వల్ల ఎముకలు గుల్లబారిపోతాయి. విటమిన్ డి, కాల్షియం లోపం వల్ల చిన్న దెబ్బలకే ఎముకలు విరిగిపోయే ప్రమాదం ఉంది.

5. రక్తహీనత:
ముఖ్యంగా ఇండియాలో 50% పైగా మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. పోషకాహార లోపం, అధిక రక్తస్రావం దీనికి ప్రధాన కారణాలు. ఇది తీవ్రమైన అలసట, రోగ నిరోధక శక్తి తగ్గడానికి దారి తీస్తుంది.

Also Read: కొత్తగా, స్టైలిష్‌గా.. మనసుకి హత్తుకునేలా ఉమెన్స్ డే విషెస్ చెప్పేయండి!

ముందస్తు పరీక్షలు – నివారణ మార్గాలు:
వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స కంటే.. రాక ముందే గుర్తించడం ఉత్తమం. వయస్సును బట్టి మహిళలు ఈ కింది పరీక్షలు చేయించుకోవాలి.

20-30 ఏళ్లలో: రక్తహీనత పరీక్ష, థైరాయిడ్ టెస్ట్ (TSH), ప్యాప్ స్మియర్.

40 ఏళ్ల తర్వాత: మామోగ్రామ్,డయాబెటిస్, బీపీ పరీక్షలు.

50 ఏళ్ల తర్వాత: ఎముక సాంద్రత పరీక్ష (DEXA Scan), కొలెస్ట్రాల్ , గుండె సంబంధిత పరీక్షలు.

మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళ తన ఆరోగ్యాన్ని ప్రాధాన్యతగా మార్చుకోవాలి. సరైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, మానసిక ప్రశాంతత , ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు.

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×