Ugadi panchangam 2026: 2026 ఉగాది నుంచి వృశ్చిక రాశి వారికి మంచి చెడు సమానంగా ఉంటాయట. ఈ పరాభవ నామ సంవత్సరం మొదటి ఆరు నెలలు ఆరోగ్యం, ఆర్థిక విషయాల్లో ఈరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలట. అలాగే జూన్ తర్వాత అంటే సంవత్సరం ద్వితీయార్థంలో వీరికి కేరీర్‌లో అద్భుతమైన పురోగతి కనిపిస్తుందట. ఇక ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుందట. అలాగే వీరి కుటుంబంలో ఆనందం, సంతోషం వెల్లివిరుస్తాయట. ఈ రాశి వ్యాపారులకు ఈ సంవత్సరం ద్వితీయార్థం మంచి ప్రయోజనాలను ఇస్తుందని పండితులు చెప్తున్నారు. ఈ రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం, అనురాధ నక్షత్రం ఒకటి, రెండు, మూడు, నాలుగవ పాదాలు, జేష్ట్యా నక్షత్రం ఒకటి, రెండు, మూడు, నాలుగు పాదాలు వస్తాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 05, రాజపూజ్యం 2, అవమానం 6 గానూ ఉన్నాయి.
ఈ రాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయట. ఈ సంవత్సరం ఈ వృశ్చిక రాశి వారికి పని ఒత్తిడి ఉన్నా.. గురు బలంతో విజయం సాధిస్తారట. అలాగే ఉద్యోగులకు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ప్రమోషన్లు లభిస్తాయట. వ్యాపారంలో కొత్త అవకాశాల కోసం ఎదురుచూసే వారికి కొత్త అవకాశాలు లభిస్తాయట. ఇక వ్యాపారంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని.. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారు మరింత జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.
ఈ రాశి వారికి ఈ సంవత్సరం అద్బుతమైన ఆదాయం ఉంటుందట. ఊహించని విధంగా ధనాదాయం పెరుగుతుందట. సంవత్సరం ప్రథమార్థంలో విపరీతమైన ఆదాయం వస్తుందట కానీ సంవత్సరం ద్వితీయార్థంలో మాత్రం ఖర్చులు పెరిగిపోతాయట. కుటుంబ సమస్యల వల్ల కావచ్చు.. ఆరోగ్య సమస్యల వల్ల కావచ్చు ఎలాగైనా సరే ఖర్చులు పెరుగుతాయట. అందుకే అనవసరమైన ఖర్చులు ఏమైనా ఉంటే నియంత్రణ చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
ఈ సంవత్సరం ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. వీరికి ఈ సంవత్సరం చాతీ, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉందట. అలాగే యోగా చేయడం.. ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోవాలని చెప్తున్నారు.
ఈ రాశి వారికి ఈ సంవత్సరం కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అవివాహితులకు వివాహ యోగం ఉంది.
ఈ రాశి వారు ఈ సంవత్సరం మరిన్ని మంచి ఫలితాల కోసం సోమవారం శివాలయంలో శివుడికి అభిషేకం చేయించాలట. శనివారం శని దేవుడికి తైలాభిషేకం చేయించాలట. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.