E-Paper
Advertisement

Weekly Horoscope April 05 To April 11: ఈ వారం ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో అవరోధాలు

Weekly Horoscope April 05 To April 11: ఈ వారం ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో అవరోధాలు
Advertisement

Weekly Horoscope: 

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఈ వారం (ఏఫ్రిల్ 05–ఏఫ్రిల్ 11) రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేష రాశి:

ఈ వారం మీకు ఆరోగ్య విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా అధిగమించి ముందుకు సాగుతారు. వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు మరింత అనుకూలంగా సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. విద్యార్థులు విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం మధ్యలో ధన పరంగా ఇబ్బందులు ఉంటాయి.

వృషభ రాశి: 

Advertisement

ఈ వారం మీకు వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. శత్రు సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచన చేయడం మంచిది. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. శుభకార్య విషయమై ఆత్మీయులతో చర్చలు చేస్తారు.

 మిథున రాశి: 

ఈ వారం మీకు సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన విషయాలలో ఆత్మీయుల సలహాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతుంది. వారం చివరిలో పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

కర్కాటక రాశి:

Advertisement

ఈ వారం మీకు ప్రముఖులతో పరిచయాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. మీ నిర్ణయాలు కుటుంబంలో అందరికి ఆమోదయోగ్యంగా ఉంటాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో దీర్ఘకాలిక సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యవహారాలు చేపట్టిన సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో గృహమున ఆనందంగా గడుపుతారు. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది.

సింహారాశి:

ఈ వారం మీకు వ్యాపారాలు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. కొన్ని రంగాల వారికి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో ఋణ వత్తిడి అధికమవుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు గతం కంటే కాస్త మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

 కన్యా రాశి: 

ఈ వారం మీకు చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి. వ్యాపారాలలో ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది. ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. చిన్న తరహా పరిశ్రమలు అనుకూల వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభంలో బంధు వర్గం వారితో వివాదాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అవసరానికి ధన సహాయం అందుతుంది కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో వ్యవహారాల గురించి చర్చలు చేస్తారు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

 తులా రాశి:

ఈ వారం మీకు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి .దైవ చింతన పెరుగుతుంది. చిన్న తరహా పరిశ్రమలకు అధికారుల అండదండలు లభిస్తాయి. వారం మధ్యలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. శత్రు పరమైన సమస్యలను ఓర్పుగా పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాలలో అనుకూల స్థానచలన సూచనలు ఉన్నవి

వృశ్చిక రాశి: 

ఈ వారం మీకు విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వారం చివరిలో పనులలో జాప్యం కలుగుతుంది. నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. విద్యార్థులకు ఆశించిన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది.

ధనస్సు రాశి:

ఈ వారం మీకు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు నుండి బయటపడతారు. కొన్ని రంగాల వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి. ఆత్మీయుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడతాయి. వారం ప్రారంభంలో కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

మకర రాశి:

ఈ వారం మీకు ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది. అన్ని రంగాల వారికి మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. దూరపు బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వారం ప్రారంభంలో ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు ఉంటాయి మొండి బాకీలు వసూలవుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.

కుంభ రాశి: 

ఈ వారం మీకు గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ఉద్యోగాలలో ఇతరులతో ఉన్న సమస్యలను పరిష్కరించుకొని ఊరట చెందుతారు. చిన్నతరహా పరిశ్రమలకు కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ఇతరుల నుంచి రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. వారం మధ్యలో వృధా ఖర్చులు పెరుగుతాయి. మిత్రులతో కలహాల సూచనలు ఉన్నవి.

మీన రాశి:

ఈ వారం మీకు బంధు మిత్రుల నుండి రుణ ఒత్తిడులు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు చికాకులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వారం మధ్యలో సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో అకారణంగా తగాదాలు నెలకొంటాయి. వాహన యోగం ఉన్నది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×