Born on a Sunday: మీరు ఆదివారం పుట్టారా..? అయితే మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా..? మీరు జీవితంలో ఏ రంగంలో అయితే బాగా రాణిస్తారో తెలుసా..? మీకు కలిసొచ్చు రంగులు ఏంటో తెలుసా..? ముఖ్యంగా మీరు ఆ ఒక్కటి వదిలేస్తే మీకు జీవితంలో తిరుగుండదట. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడుతు తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆదివారం (Sunday) జన్మించిన వ్యక్తులు రవి (సూర్యుడు) ప్రభావం కలిగి ఉంటారట. సూర్యుడు గ్రహాలకు రాజు, కాబట్టి వీరి స్వభావం మరియు వృత్తి జీవితం చాలా ప్రత్యేకంగా ఉంటాయట. వీరు జీవితంలో ఏం చేసినా కలిసి వస్తుందట. అయితే ఒక్క పని మాత్రం చేయకూడదని పండితులు సూచిస్తున్నారు.
వ్యక్తిత్వం మరియు లక్షణాలు: ఆదివారం పుట్టిన వారికి నాయకత్వ లక్షణాలు ఉంటాయట. వీరు పుట్టుకతోనే నాయకులుగా పుడతారట. ఏ పనిలోనైనా ముందడుగు వేయడానికి, ఇతరులను నడిపించడానికి ఇష్టపడతారట. వీరికి ఆత్మవిశ్వాసం కూడా చాలా ఎక్కువగానే ఉంటుందట. వీరు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగిన వారై ఉంటారట. ఇక సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్టల కోసం ఎక్కువగా ఆరాటపడతారట. ఆత్మాభిమానం (Self-respect) వీరికి ప్రాణంతో సమానమట. ఇక ఏదైనా విషయాన్ని మొహమాటం లేకుండా ముక్కుసూటిగా చెప్పేస్తుంటారట. దీనివల్ల కొన్నిసార్లు ఇతరులకు కోపం తెప్పిస్తారట. ఇదొక్కటి వదిలేస్తే ఆదివారం పుట్టిన వారికి ఎదురే ఉండదట. ఆదివారం పుట్టిన వారు ఉదార స్వభావులు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారట.
ఉద్యోగ మరియు వ్యాపార రంగాలు: సూర్యుడి ప్రభావం వల్ల వీరు చాలా రంగాలలో రాణిస్తారట. వాటిలో రాజకీయం ఒకటి. ఆదివారం పుట్టినవారు ముఖ్యంగా రాజకీయాల్లో అధికార కాంక్ష, నాయకత్వ సామర్థ్యం వల్ల బాగా రాణిస్తారని పండితులు చెప్తున్నారు. ఇక ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాల్లో మంచి పొజిషన్‌లో ఉంటారట. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఇతర ప్రభుత్వ పదవులు లభిస్తాయట. ఇక సూర్యుడు ఆరోగ్య ప్రదాత. అందుకే ఆదివారం పుట్టిన వాళ్లు డాక్టర్లుగా, ముఖ్యంగా సర్జన్లుగా మంచి పేరు తెచ్చుకుంటారట. ఇక ఏదైనా సంస్థను మేనేజ్ చేయడం లేదా లీడ్ చేయడంలో వీరు దిట్టట. ఆదివారం పెట్టిన వాళ్లకు ఆభరణాల వ్యాపారం లేదా లోహాలకు సంబంధించిన వ్యాపారాలు బాగా కలిసి వస్తాయట.
వీరికి అదృష్టాన్ని ఇచ్చే కలర్స్ మరియు నెంబర్స్: ఇక ఆదివారం పుట్టిన జాతకులకు అదృష్టాన్ని తీసుకువచ్చే రంగు ఎరుపు, నారింజ కలర్. అలాగే వీరికి అదృష్ట సంఖ్య ఒకటి. ఏ పని మొదలు పెట్టినా ఒకటవ తేదీన మొదలు పెడితే వీరికి బ్రహ్మండంగా ఉంటుందట. ఆదివారం పుట్టిన వాళ్లు ప్రతిరోజూ ఉదయం సూర్య నమస్కారాలు చేయడం లేదా ‘దిత్య హృదయం పఠించడం వల్ల వీరికి మరింత శుభ ఫలితాలు కలుగుతాయట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.