E-Paper
Advertisement

UGADI PANCHANGAM: పరాభవ నామ సంవత్సర (2026-27) ఉగాది పంచాంగం  

UGADI PANCHANGAM: పరాభవ నామ సంవత్సర (2026-27) ఉగాది పంచాంగం  
Advertisement

UGADI PANCHANGAM: ఉగాది పండుగ నుంచి తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం కాబోతుంది. ఈ నూతన సంవత్సరం పేరు శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఈ సంవత్సరం మొత్తం పంచాంగం ఎలా ఉండబోతుంది. అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీ పరాభవ నామ సంవత్సరం (2026-2027) మార్చి 19, 2026న ఉగాదితో ప్రారంభమై ఏప్రిల్ 6, 2027 వరకు కొనసాగుతుంది. ఇది 60 తెలుగు సంవత్సరాలలో 40వ సంవత్సరం. ఈ ఏడాది పరాభవం అంటే ఓటమి కాదు, అహంకారాన్ని జయించి.. జ్ఞానాన్ని పొందే కాలంగా పండితులు చెబుతున్నారు. ఈ సంవత్సరంలో ప్రజలకు ధర్మంపై ఆసక్తి కలుగుతుందని..  నూతన మార్పులు చోటు చేసుకుంటాయని.. అలాగే అజ్ఞానంపై జ్ఞానం విజయం సాధిస్తుందని పండితులు చెప్తున్నారు. తెలుగు సంవత్సరం పేరులో పరాభవం ఉన్నా..  ఈ ఏడాది మాత్రం గ్రహస్థితులు అద్బుతంగా ఉన్నాయని చెప్తున్నారు. అలాగే ప్రజలపై కూడా దేవుడి అనుగ్రహం అత్యంత అద్భుతంగా ఉంటుందని సూచిస్తున్నారు.

Advertisement

శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రత్యేకత: సాధారణంగా పరాభవం అంటే తెలుగులో  ఓటమి అని అర్థం వస్తుంది. అయితే ఈ ఓటమి అనేది చెడుకు వస్తుందని మంచికి విజయం దక్కుతుందని పండితులు చెప్తున్నారు. ఆధ్యాత్మికంగా ఇది అహాన్ని ఓడించి..  విజయాన్ని అందించే పవిత్ర సమయమని సూచిస్తున్నారు. ఈ  పరాభవ నామ సంవత్సరంలో మంచి పనులు చేయాలనే పట్టుదల ఉన్న వాళ్లకు విజయం చేకూరుతుందట. అలాగే బీదలకు పేదలకు సేవ చేయాలనే గుణం కలిగిన వారికి అందుకోసం అహర్నిశలు కృషి చేసే వారికి కూడా విజయాలు వరిస్తాయని చెప్తున్నారు.

రాజ్యాధికార చక్రం – ఎవరి ప్రభావం ఎలా ఉంటుంది: ఈ పరాభవ నామ సంవత్సరంలో 7 శుభ గ్రహాలు, కేవలం 2 పాప గ్రహాల ప్రభావం మాత్రమే ఉందట. దీంతో ఇది చాలా అరుదైన మరియు శుభప్రదమైన నిష్పత్తిగా వర్ణిస్తున్నారు పండితులు.

Advertisement

రాజు: గురువు (Jupiter): ఈ సంవత్సరం రాజు గురుగ్రహం అయ్యిందట. దీంతో గురువు చేతిలో పరిపాలన ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు అంటున్నారు. ధర్మం, న్యాయం, విద్య మరియు ఆధ్యాత్మిక రంగాలకు ఈ  పరాభవ నామ సంవత్సరం స్వర్ణయుగం లాంటిది అవుతుందంటున్నారు.

మంత్రి: కుజుడు (Mars): ఈ సంవత్సరం మంత్రి కుజుడు అవ్వడంతో రాష్ట్ర, దేశ,  ప్రపంచ రాజకీయాలు వాడీవేడీగా ఉంటాయట. అలాగే దేశాల సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణాలు నెలకొంటాయట.

సేనాధిపతి & మేఘాధిపతి: చంద్రుడు (Moon): ఈ సంవత్సరం సేనాధిపతి, మేఘాధిపతి చంద్రుడట. చంద్రుడు అంటే చల్లదనానికి ప్రతీక. అందుకే ఈ సంవత్సరం సమృద్దిగా వర్షాలు కురుస్తాయట. అలాగే జల వనరులు పుష్కలంగా ఉంటాయట.

​సస్యాధిపతి: శుక్రుడు (Venus): భాగ్య కారకుడైన శుక్రుడు ఈ సంవత్సరం సస్యాధిపతి అయ్యాడట. దీంతో ఈ సంవత్సరం పంటలు బాగా పండుతాయట. కళలు, వినోద రంగాలు చాలా బాగా అభివృద్ది చెందుతాయట.

ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సంవత్సరం ​ వ్యవసాయం అత్యద్భుతంగా ఉంటుందట. ఆర్థిక రంగం చాలా అనుకూలంగా ఉంటుందట. దేశరక్షణ అద్బుతంగా ఉంటుందట. అయితే రాజకీయ రంగంలో మాత్రం మిశ్రమంగా ఉంటుందట. ఈ సంవత్సరం పేరు పరాభవం అయినా మంచి విషయాల్లో మాత్రం అన్ని విజయాలే ఉంటాయట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: ఉగాది రోజు ఆ పనులు తప్పనిసరిగా చేయాలట – అవేంటో తెలుసా..?

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×