E-Paper
Advertisement

బుధవారం పుట్టారా? మీ టాలెంటుకు  లోకం మొత్తం ఫిదా అయ్యే రోజు అప్పుడే వస్తుందట

బుధవారం పుట్టారా? మీ టాలెంటుకు  లోకం మొత్తం ఫిదా అయ్యే రోజు అప్పుడే వస్తుందట
Advertisement

Born on Wednesday: బుధవారం పుట్టారా..? అయతే మీకున్న టాలెంట్ కు ఇప్పటి వరకు ఏ గుర్తింపు రాలేదా… అయితే మీ టాలెంట్‌కు యావత్‌ ప్రపంచం మొత్తం ఫిదా అయ్యే రోజు ఒకసారి వస్తుందట. మిమ్మల్ని చీ కొట్టిన వారే మీకు దగ్గర అవుతారట. మీ టాలెంట్ చూసి అసూయపడే రోజు వస్తుందట. అయితే అది ఎప్పుడనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

బుధవారం జన్మించిన వారు జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధ గ్రహం (Mercury) ప్రభావం కలిగి ఉంటారట. బుధుడు తెలివితేటలు, మాటకారి తనం మరియు వ్యాపార నైపుణ్యానికి కారకుడట. వీరి జీవితం, కెరీర్ మరియు ఇతర ముఖ్య అంశాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

బుధవారం పుట్టిన వారి వ్యక్తిత్వం మరియు స్వభావం: బుధవారం పుట్టిన వారు చాలా చురుకైన వారట. ఏ విషయాన్నైనా త్వరగా గ్రహిస్తారట. అందరితో కలిసిపోయే గుణం, వినయపూర్వకమైన మాటతీరు వీరి ప్రత్యేకతట. వీరు మాటలతో ఎవరినైనా ఇట్టే ఆకట్టుకోగలరట. చర్చల్లో లేదా వాదనల్లో వీరు ముందుంటారట. వీరు ఒకే సమయంలో రెండు మూడు పనులను చక్కబెట్టగల సామర్థ్యం కలిగి ఉంటారట.

బుధవారం పుట్టిన వారి కెరీర్, వృత్తి పరమైన అంశాలు: బుధుని ప్రభావం వల్ల బుధవారం పుట్టిన వారు మేధస్సుకు సంబంధించిన రంగాల్లో బాగా రాణిస్తారట. ముఖ్యంగా సొంతంగా వ్యాపారం చేయడం లేదా మార్కెటింగ్ రంగంలో వీరు అగ్రస్థానంలో ఉంటారట. అలాగే రైటర్స్, జర్నలిస్టులు, ఎడిటర్లు లేదా సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లుగా రాణిస్తారట. వీరికి సాంకేతిక రంగంలోనూ  రాణించే సత్తా ఉంటుందట. సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, డేటా అనాలిసిస్ వంటి రంగాల్లో వీరికి మంచి పట్టు ఉంటుందట. ఇంకా బుధవారం పుట్టిన వారు టీచర్లుగా, లాయర్లుగా లేదా కౌన్సిలర్లుగా కూడా గొప్పగా రాణిస్తారట. వీరు అది ఇది అనేది లేకుండా ఏ రంగంలోనైనా రాణించగల సామర్థ్యం కలిగి ఉంటారట.

Advertisement

ఆర్థిక పరిస్థితి మరియు స్థిరత్వం: బుధవారం పుట్టిన వారు తమ తెలివితేటలతో ధనాన్ని సంపాదిస్తారట. అయితే  ఒక్కోసారి అనవసరమైన ఖర్చులు చేసే అవకాశం కూడా ఉంటుందట. సాధారణంగా బుధవారం జన్మించిన వారికి 27 నుండి 33 ఏళ్ల మధ్య వయసులో వృత్తిపరంగా, ఆర్థికంగా మంచి స్థిరత్వం లభిస్తుందట. ముఖ్యంగా 32వ ఏట వీరి జీవితంలో పెద్ద మలుపు వచ్చే అవకాశం ఉంటుందట. ఆ సమయంలో వీరి టాలెంట్‌కు ప్రపంచమే ఫిదా అయిపోయే చాన్స్‌ ఉందట.

బుధవారం పుట్టిన వారికి కలిసి వచ్చే అంశాలు (Lucky Factors): బుధవారం పుట్టిన వారికి అదృష్ట రంగులు.. పచ్చ రంగు. వీరు ఎప్పుడు ఆకుపచ్చని దుస్తులు ధరించడం లేదా దగ్గర ఉంచుకోవడం వల్ల సానుకూల ఫలితాలు ఉంటాయట. అలాగే ఐదు, పద్నాలుగు, ఇరవై మూడు అదృష్ణ సంఖ్యలట. వీరికి అదృష్ట దేవుడు గణపతి. వినాయకుడిని ఆరాధించడం వల్ల వీరు చేసే పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: గురు, శని గ్రహాల సంచారం – ఆ నాలుగు రాశులకు పట్టిందల్లా బంగారమేనట

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×