E-Paper
Advertisement

Safest Cars: మహీంద్రా To టాటా, దేశంలో అత్యంత సురక్షితమైన కార్లు ఇవే!

Safest Cars: మహీంద్రా To టాటా, దేశంలో అత్యంత సురక్షితమైన కార్లు ఇవే!
Advertisement

Safest Cars In India: దేశంలో వాహనాలు పెరగడంతో పాటు ప్రమాదాల సంఖ్య కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో చాలా మంది అత్యంత సురక్షితమైన కార్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కారు నిజంగా తన కుటుంబానికి సురక్షితమో? కాదో? ముందుగా తెలుసుకుని తీసుకుంటున్నారు. ఇందుకోసం NCAP క్రాష్ టెస్ట్ సేఫ్టీ రేటింగ్ ను గమనిస్తున్నారు. ఒకవేళ మీరు కూడా సేఫ్ కార్లు కొనాలనుకుంటున్నారా? అయితే, ప్రస్తుతం దేశంలో ఉన్న సేఫ్ కార్ల గురించి తెలుసుకోండి.

⦿ మహీంద్రా XEV 9E

Advertisement

దేశంలో సేఫ్టీ కార్ల లిస్టులో మహీంద్రా XEV 9E టాప్ లో నిలిచింది. ఈ కారు NCAP క్రాష్ టెస్ట్‌ లో అత్యధిక స్కోరును సాధించింది. ఈ ఎలక్ట్రిక్ SUV అడల్ట్ ప్యాసింజర్ల సేఫ్టీలో 32లో 32 పాయింట్లను సాధించింది. చిన్నారుల భద్రతలో 49లో 45 పాయింట్లను పొందింది.

⦿ టాటా హారియర్.ev

మహీంద్రా XEV 9E లాగానే, టాటా  Harrier.ev క్రాష్ టెస్ట్‌ లో 5-స్టార్ రేటింగ్‌ ను పొందింది. ఈ SUV అడల్ట్ ప్రయాణీకుల భద్రతలో 32 పాయింట్లు, పిల్లల భద్రతలో 45 పాయింట్లను సాధించింది.

⦿ మారుతి విక్టోరిస్

Advertisement

విక్టోరిస్ మిడ్ సైజ్ SUV రీసెంట్ గా భారత మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది.NCAPలో 5 స్టార్ రేటింగ్‌ను సాధించింది. పెద్దల భద్రతలో 31.66 పాయింట్లు, పిల్లల భద్రతలో 43 పాయింట్లను పొందింది.

⦿ టాటా పంచ్.ev

మైక్రో ఎలక్ట్రిక్ SUV Tata Punch.ev కూడా క్రాష్ టెస్ట్‌ లో 5 స్టార్ రేటింగ్‌ పొందింది. పెద్దల భద్రతలో 32లో 31.46 పాయింట్లు సాధించింది. అదే EVకి పిల్లల భద్రతా రేటింగ్ లో 49కి 45 పాయింట్లు సాధించింది.

⦿ మహీంద్రా థార్ రాక్స్

మహీంద్రా గత ఏడాది థార్ 5-డోర్ల వెర్షన్‌ ను విడుదల చేసింది. ఈ SUV ని క్రాష్ టెస్టింగ్ లో 5-స్టార్ రేటింగ్‌ ను పొందింది. పెద్దల భద్రతలో 31.09 పాయింట్లు, పిల్లల భద్రతలో 45 పాయింట్లు సాధించింది.

⦿ టాటా కర్వ్.ev

టాటా ఫస్ట్ కూపే ఎలక్ట్రిక్ SUV కూడా 5 స్టార్ రేటింగ్‌ను సాధించింది. పెద్దల భద్రత విషయంలో 30.81 పాయింట్లు, పిల్లల  భద్రతలో 44.83 పాయింట్లను సాధించింది.

⦿ టాటా హారియర్, సఫారీ

టాటా హారియర్, సఫారీ ఫేస్‌ లిఫ్ట్ పొందిన తర్వాత NCAP క్రాష్ టెస్ట్‌ చేశారు. రెండూ 5-స్టార్ రేటింగ్‌ను పొందాయి. పెద్దల  భద్రతలో 30.08 పాయింట్లు, పిల్లల భద్రతలో 44.54 పాయింట్లు సాధించాయి.

⦿ టాటా నెక్సాన్.ev

టాటా ఫస్ట్ ఎలక్ట్రిక్ SUV NCAPలో 5 స్టార్ రేటింగ్‌ను పొందింది. ఈ SUV పెద్దల భద్రతలో 29.86 పాయింట్లు, పిల్లల భద్రతలో 44.95 పాయింట్లు సాధించింది.

⦿ టాటా కర్వ్

టాటా కర్వ్ SUV క్రాష్ టెస్ట్ లో 5 స్టార్ రేటింగ్‌ పొందింది. పెద్దల భద్రతలో 29.50 పాయింట్లు, పిల్లల భద్రతలో 43.66 పాయింట్లను పొందింది.

⦿ మారుతి డిజైర్

5 స్టార్ రేటింగ్ సాధించిన ఏకైక సెడాన్ మారుతి డిజైర్. ఇది పెద్దల భద్రతలో 29.46 పాయింట్లు, పిల్లల భద్రతలో 41.57 పాయింట్లను పొందింది.

Read Also: క్రాష్ టెస్టులో జీరో రేటింగ్, ఈ కారులో జర్నీ అంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×