E-Paper
Advertisement

Crash Test: క్రాష్ టెస్టులో జీరో రేటింగ్, ఈ కారులో జర్నీ అంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే!

Crash Test: క్రాష్ టెస్టులో జీరో రేటింగ్, ఈ కారులో జర్నీ అంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే!
Advertisement

Grand i10 Crash Test: సౌతాఫ్రికా మార్కెట్ కోసం నిర్వహించిన తాజా గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్ లో.. భారత్ లో తయారు చేసిన హ్యుందాయ్ గ్రాండ్ i10 చెత్త రేటింగ్ సాధించింది. అడల్ట్స్ ప్రయాణీకుల రక్షణలో జీరో రేటింగ్ పొందింది. సేఫ్టీ రేటింగ్ ఏజెన్సీ నిర్వహించిన పరీక్షల్లో చిన్న పిల్లల రక్షణ కోసం నిర్వహించిన టెస్ట్ లో 3 స్టార్ రేటింగ్ సాధించింది.

34 పాయింట్లకు 0 పాయింట్లు!

వయోజన ప్రయాణీకుల సేఫ్టీ విభాగంలో గ్రాండ్ i10 34 పాయింట్లలో సున్నా పాయింట్లను సాధించింది. ఫ్రంటల్ ఆఫ్‌ సెట్ టెస్ట్ టైమ్ లో ముందు భాగంలో ఉన్న ఇద్దరికీ తల, మెడ రక్షణలో బాగానే పని చేసింది. అయితే, డ్రైవర్‌కు ఛాతీ రక్షణ విషయంలో చాలా బలహీన రేటింగ్ సాధించింది. డాష్‌ బోర్డ్ వెనుక ఉన్న భాగాలు పక్కాగా లేకపోవడంతో ఇద్దరు ప్రయాణీకుల మోకాళ్లకు అంతగా సేఫ్టీ లేదని NCAP గుర్తించింది. అటు సైడ్ ఇంపాక్ట్ గైడ్ లో సేప్టీ రేంజ్ లో మిక్స్ డ్ రిజల్ట్స్ ను సాధించాయి.  తల, పెల్విస్‌ కు బాగానే ఉన్నా, ఛాతి విషయంలో పేలవమైన సేఫ్టీని కలిగి ఉంటుంది. ఈ పేలవమైన ఛాతీ స్కోరు మొత్తం రేటింగ్‌ ను గణనీయంగా తగ్గించింది. కారులో కర్టెన్ ఎయిర్‌ బ్యాగ్స్ లాంటి ప్రామాణిక సైడ్ హెడ్ ప్రొటెక్షన్ లేనందున సైడ్ పోల్ టెస్ట్ నిర్వహించలేదు. మోడల్ డ్రైవర్‌కు మాత్రమే సీట్‌ బెల్ట్ రిమైండర్‌ ను అందిస్తుంది. ఇది స్కోరింగ్‌ను మరింత ప్రభావితం చేసింది.

పిల్లల భద్రతలో 3 స్టార్ రేటింగ్

Advertisement

పిల్లల భద్రత విషయంలో గ్రాండ్ i10 మెరుగైన పనితీరును కనబరిచింది, 49కి 28.28 పాయింట్లను సాధించింది. త్రీ-స్టార్ రేటింగ్‌ను పొందింది. ఈ అంచనా మంచి డైనమిక్ పనితీరును చూపించింది. 18 నెలల, మూడు సంవత్సరాల పిల్లల డమ్మీలు ఫ్రంటల్, సైడ్ ఇంపాక్ట్ టెస్టుల సమయంలో పిల్లలు సేఫ్ గా ఉన్నారు. కీలకమైన భద్రతా ఫీచర్లు లేకపోవడం వల్ల మోడల్ పాయింట్లను కోల్పోయింది. దీనికి అన్ని సీటింగ్ స్థానాల్లో మూడు పాయింట్ సీట్‌ బెల్ట్‌ లు లేవు. ఎయిర్‌ బ్యాగ్ డీయాక్టివేషన్ స్విచ్‌ ను అందించలేదు. వెనుక మధ్య సీటులో సురక్షితమైన చైల్డ్ రెస్ట్రైన్ట్ సిస్టమ్ ఇన్‌స్టాలేషన్‌ ను ఏర్పాటు చేయలేదు.

Read Also: రెనాల్ట్ న్యూ డస్టర్ To టాటా సియెర్రా EV.. 2026లో రాబోతున్న క్రేజీ కార్లు ఇవే!

ఇండియాలో తయారు చేసిన గ్రాండ్ i10

Advertisement

తాజాగా పరీక్షించిన వెర్షన్ ఇండియాలో తయారు చేయబడింది. ఇక్కడి నుంచి దక్షిణాఫ్రికాకు ఎగుమతి చేయబడింది. ఇది దేశీయంగా అందుబాటులో ఉన్న హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్‌ మాదిరిగా ఉన్నా, సేఫ్టీ కాన్ఫిగరేషన్ భిన్నంగా ఉంటుంది. భారతీయ మోడల్ ప్రామాణికంగా ఆరు ఎయిర్‌ బ్యాగ్‌ లతో పాటు, ప్రయాణీకులందరికీ త్రీ పాయింట్ సీట్‌ బెల్ట్‌ లు, సీట్‌ బెల్ట్ రిమైండర్లు, వెనుక పార్కింగ్ సెన్సార్లు ఏర్పాటు చేయబడి ఉంటాయి.

Read Also:  ప్రతి కారు ఓనర్ ఈ విషయాల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.. ఎందుకంటే?

Related News

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

Big Stories

Advertisement
×