E-Paper
Advertisement

లాంచ్‌కు ముందే బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ సీక్రెట్స్ లీక్.. కొత్త ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

లాంచ్‌కు ముందే బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ సీక్రెట్స్ లీక్.. కొత్త ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!
Advertisement

2026 Maruti Brezza Facelift Leaked: 2026 మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌ లిఫ్ట్ జూలై 24న విడుదల కానుంది. అయితే, విడుదలకు ముందే ఈ SUVకు సంబంధించిన పలు వివరాలు లీక్ అయ్యాయి. ఇప్పటికే డీలర్ స్టాక్‌ యార్డ్‌ లకు కొత్త బ్రెజ్జా చేరుకోవడంతో, ఇందులో ఉండే డిజైన్ మార్పులు, కొత్త ఫీచర్లు, ట్రాన్స్‌ మిషన్ ఆప్షన్స్ పై క్లారిటీ వచ్చింది. 2022లో వచ్చిన సెకెండ్ జెనరేషన్ బ్రెజ్జాకు ఇది తొలి మిడ్ లైఫ్ అప్‌ డేట్.

డిజైన్‌ లో చిన్న మార్పులు

కొత్త బ్రెజ్జా మొత్తం డిజైన్‌ ను మారుస్తారని భావించినప్పటికీ, ఈ ఫేస్‌ లిఫ్ట్‌ లో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. ముందు భాగంలో గ్రిల్‌ ను కొత్త డిజైన్‌ తో మరింత సన్నగా రూపొందించారు. దీనికి గోల్డ్ ఫినిష్ కూడా ఇచ్చారు. బంప ర్‌ను రీడిజైన్ చేసి, సిల్వర్ స్కిడ్ ప్లేట్, కొత్త లోయర్ ఎయిర్ డ్యామ్, త్రిభుజాకార LED ఫాగ్ ల్యాంప్ హౌసింగ్‌ తో మరింత స్పోర్టీ లుక్ ఇచ్చారు. సైడ్ ప్రొఫైల్‌లో మాత్రం పాత బ్రెజ్జా స్టైల్‌ను కొనసాగించారు. బ్లాక్ అవుట్ పిల్లర్లు, వీల్ ఆర్చ్ క్లాడింగ్ అలాగే ఉన్నాయి. అయితే కొత్త డిజైన్ 16 అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్‌ ను యాడ్ చేశారు. వెనుక భాగంలో కూడా చిన్ని మార్పులు మాత్రమే ఉండే అవకాశం ఉంది.

క్యాబిన్‌లో కొత్త ఫీచర్లు

Advertisement

ఇంటీరియర్‌ లో కొన్ని కొత్త అప్‌డేట్లు చేశారు. బ్రౌన్ కలర్ సీట్ అప్‌హోల్స్టరీ, కొత్త క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్, స్టోరేజ్‌ తో కూడిన రీడిజైన్ సెంటర్ ఆర్మ్‌ రెస్ట్ అందించారు. పెద్ద 10.1 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్ లాంటి కొత్త ఫీచర్లు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లను కూడా అందించే అవకాశం ఉంది. కొత్త బ్రెజ్జాలో ఇప్పటికే ఉన్న పలు ప్రీమియం ఫీచర్లు కూడా కొనసాగనున్నాయి. వైర్‌ లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సింగిల్ పేన్ సన్‌ రూఫ్, ఆటో డిమ్మింగ్ IRVM, కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ లాంటి సౌకర్యాలు ఉండనున్నాయి.

భద్రతకు కీలక ప్రాధాన్యత

సేఫ్టీ పరంగా కూడా బ్రెజ్జా మరింత అప్ డేట్ కానుంది. ఇందులో 6 ఎయిర్‌ బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, 360 డిగ్రీ కెమెరా, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, రియర్ పార్కింగ్ సెన్సార్లతో పాటు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు కూడా ఉండే అవకాశం ఉంది.

ఇంజిన్, ట్రాన్స్‌ మిషన్ ఆప్షన్స్

Advertisement

కొత్త బ్రెజ్జాలో 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కొనసాగనుంది. ఈ ఇంజిన్ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో 103 PS పవర్, 139 Nm టార్క్ ఉత్పత్తి చేయనుంది. CNG వెర్షన్‌లో 88 PS పవర్, 121.5 Nm టార్క్ లభించనుంది. ట్రాన్స్‌ మిషన్‌ లో ఈసారి కొత్త 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌ బాక్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్లు కూడా కొనసాగనున్నాయి. CNG మోడల్‌ కు డ్యూయల్ సిలిండర్ సెటప్ అందించే అవకాశం ఉందని సమాచారం.

ధర ఎంత?  పోటీ ఏ కార్లతో?

2026 మారుతి బ్రెజ్జా జూలై 24న అధికారికంగా మార్కెట్లోకి రానుంది. దీని ప్రారంభ ధర సుమారు రూ. 8.50 లక్షలు  ఉండొచ్చని అంచనా. మార్కెట్లో ఇది టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV 3XO, కియా సోనెట్, స్కోడా కైలాక్, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కైగర్, మారుతి ఫ్రాంక్స్, టయోటా టైసర్ లాంటి సబ్ కాంపాక్ట్ SUVలకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Read Also: సిట్రోయెన్ మాస్టర్ స్ట్రోక్.. బసాల్ట్ ఎక్స్ కంఫర్ట్ ఎడిషన్ విడుదల!

Related News

పెట్రోల్‌తో పాటు ఇథనాల్‌ తోనూ పరుగులు.. కియా సైరోస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు వచ్చేస్తోంది!

హీరో, హోండాకు టీవీఎస్ షాక్.. ఆగస్టులో నంబర్ వన్ టూ వీలర్ కంపెనీగా రికార్డ్!

కొత్త కలర్స్‌ తో కవాసకి Z సిరీస్.. నయా లుక్ సూపరో సూపరు!

కియా సోరెంటో వచ్చేసింది.. ఫార్చ్యూనర్‌ కు ఇక చుక్కలే!

హిమాలయన్ 440 వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

టాటా కర్వ్‌ లో కొత్త సిరీస్ X.. తక్కువ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు!

హోండా ఫ్యాన్స్‌ కు గుడ్‌న్యూస్.. ఎలివేట్, సిటీ, అమేజ్‌పై అదిరిపోయే డిస్కౌంట్లు!

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

Big Stories

Advertisement
×