E-Paper
Advertisement

నిజంగా వండర్.. పెట్రోల్, సీఎన్జీతో పోల్చితే కొత్త టియాగో ఈవీ మరింత చీప్!

నిజంగా వండర్..  పెట్రోల్, సీఎన్జీతో పోల్చితే కొత్త టియాగో ఈవీ మరింత చీప్!
Advertisement

Tata Tiago EV Facelift India Launch: టాటా మోటార్స్ 2026 టియాగో ఈవీని భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. రూ. 6.99 లక్షల ప్రారంభ ధరతో దీనిని అందుబాటులోకి తెచ్చింది. కొత్త అప్‌ డేట్‌ తో ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌ బ్యాక్ ఆకట్టుకునే డిజైన్, కొత్త ఫీచర్లు, మెరుగైన భద్రత, ఫాస్ట్ ఛార్జింగ్ తో వచ్చింది. ప్రస్తుతం దేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఎంజీ కామెట్ EV, సిట్రోయెన్ eC3 లాంటి మోడళ్లకు ఇది గట్టి పోటీ ఇస్తోంది.

ఆకట్టుకునే డిజైన్, ప్రీమియం ఇంటీరియర్

కొత్త టియాగో EVలో ముందుభాగం పూర్తిగా కొత్త లుక్‌ తో కనిపిస్తోంది. స్లీక్ LED హెడ్‌ ల్యాంప్స్, కొత్త LED DRLs, బాడీ కలర్ గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్ మరింత స్టైలిష్‌ గా మార్చాయి. వెనుక భాగంలో కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కొత్త 14 అంగుళాల వీల్స్, డ్యూయల్ టోన్ రూఫ్, షార్క్ ఫిన్ యాంటెన్నా ఆకట్టుకుంటున్నాయి.

Advertisement

ఇంటీరియర్ విషయంలో కూడా టాటా మంచి మార్పులు చేసింది. కొత్త డ్యూయల్ టోన్ డ్యాష్‌ బోర్డ్‌ తో పాటు 10.25 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్ అందించారు. వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, కొత్త వెనుక AC వెంట్స్, కూల్డ్ గ్లోవ్ బాక్స్ లాంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అదనంగా, కొత్త రోటరీ డ్రైవ్ సెలెక్టర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ కూడా ఇచ్చారు.

భద్రత విషయంలోనూ కీలక మార్పులు

భద్రత విషయంలో కూడా కంపెనీ పెద్ద మార్పులు చేసింది. ఇప్పుడు అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్‌ బ్యా గ్‌లు స్టాండర్డ్‌గా లభిస్తున్నాయి. 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్, ESP, హిల్ హోల్డ్ అసిస్ట్, TPMS, ABS లాంటి భద్రతా ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మరింత భద్రత కోసం కార్ బాడీ స్ట్రక్చర్‌ ను కూడా బలోపేతం చేసినట్లు టాటా తెలిపింది.

బ్యాటరీ ఆప్షన్స్, రేంజ్

Advertisement

టియాగో EVలో 19.2kWh, 24kWh అనే రెండు బ్యాటరీ ఆప్షన్లు కొనసాగుతున్నాయి. చిన్న బ్యాటరీ వేరియంట్ ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 226 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. పెద్ద 24kWh బ్యాటరీ వేరియంట్ సుమారు 285 కిలోమీటర్ల MIDC రేంజ్ అందిస్తుంది. వాస్తవ డ్రైవింగ్ పరిస్థితుల్లో 160 నుంచి 215 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుందని కంపెనీ చెబుతోంది. కేవలం 18 నిమిషాల ఛార్జింగ్‌ తో 100 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్ వస్తుంది.  30kW DC ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగిస్తే బ్యాటరీని 35 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.

పాత మోడల్ తో పోల్చితే తక్కువ ధర!

ధరల విషయానికి వస్తే, 19kWh స్మార్ట్ వేరియంట్ రూ. 6.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్ ధర రూ. 9.99 లక్షల వరకు ఉంది. గత మోడల్‌తో పోలిస్తే ఈసారి టాటా ధరలను తగ్గించింది. అంతేకాదు, బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS) ద్వారా ప్రారంభ ధరను రూ. 4.69 లక్షలకు తగ్గిస్తోంది. వాస్తవానికి పాత టియాగో ఈవీతో పోలిస్తే తాజా ఫేస్ లిఫ్ట్  రూ. 1 లక్ష తక్కువ ధరకు వచ్చింది. పాత టియాగో ఈవీ ప్రారంభ ధర రూ. 7.99 లక్షలు ఉండేది. మరోవైపు, టాటా టియాగో పెట్రోల్ మోడల్ ధర సుమారు రూ. 5 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా, సీఎన్జీ వేరియంట్ ధర రూ. 6.60 లక్షల దగ్గర మొదలవుతోంది.

Read Also: పాత 2 స్ట్రోక్ కైనెటిక్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ DX+ వరకు.. 40 ఏళ్ల జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న బెంగళూరు వ్యక్తి!

Related News

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

కారులో రాకెట్ టెక్నాలజీ.. స్పేస్‌ ఎక్స్‌ తో టెస్లా కొత్త ప్రయోగం చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా XUV 3XO సరికొత్త రికార్డు.. 5 లక్షలు దాటిన సేల్స్!

మారుతి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ. 1.65 లక్షల తగ్గింపు!

హ్యుందాయ్ క్రెటా సరికొత్త రికార్డు.. 15 లక్షలు దాటిన అమ్మకాలు!

ట్రాక్షన్ కంట్రోల్, ఫాస్ట్ ఛార్జింగ్‌.. అప్ డేటెడ్ టీవీఎస్ రైడర్ లో అదిరిపోయే ఫీచర్లు!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

Big Stories

Advertisement
×