E-Paper
Advertisement

వ‌ద్దే వ‌ద్దు! రైతు డిస్క‌మ్ కాదు.. రైతుల కొంప ముంచే డిస్క‌మ్‌.. ఈఆర్‌సీ ప‌బ్లిక్ హియ‌రింగ్‌లో లోతైన డిస్క‌ష‌న్‌!

వ‌ద్దే వ‌ద్దు! రైతు డిస్క‌మ్ కాదు.. రైతుల కొంప ముంచే డిస్క‌మ్‌.. ఈఆర్‌సీ ప‌బ్లిక్ హియ‌రింగ్‌లో లోతైన డిస్క‌ష‌న్‌!
Advertisement

స‌ర్కార్ త్వ‌ర‌లో ప్ర‌వేశ‌పెట్ట‌బోయేందుకు, అమ‌లు ప‌రిచేందుకు రెడీగా ఉన్న మూడో డిస్కం.. రైతు డిస్కంపై ప్ర‌తిపక్షాలు, ప్ర‌జా , రైతు సంఘాలు విరుచుకుప‌డ్డాయి. ఇది కేంద్రానికి వ‌త్తాసు ప‌లికే కంపెనీల‌కు లాభం చేకూర్చేందుకే త‌ప్ప‌.. రైతుల‌కు ఏమాత్రం మేలు చేసేది కాద‌నే అభిప్రాయాలు వెల్ల‌డ‌య్యాయి. తెలంగాణ ఎల‌క్ట్రిసిటీ రెగ్యులేట‌రీ క‌మిష‌న్… టీ ఈఆర్‌సీ నిర్వ‌హించిన ప‌బ్లిక్ హియ‌రింగ్‌లో బీఆరెస్ నుంచి మాజీ మంత్రులు నిరంజ‌న్‌రెడ్డి, గుంత‌కండ్ల జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, టీఆరెస్ చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత‌, రైతు సంఘ నాయ‌కులు పాల్గొని త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డించారు. దీనిపై లోతైన అధ్య‌య‌నంతో కూడిన స‌ల‌హాలు ఇచ్చారు.

అంతిమంగా ఈ ప్ర‌తిపాద‌న ప‌ర్మిష‌న్ కోసం ఎదురు చూస్తున్న స‌ర్కార్‌కు.. ముక్త‌కంఠంతో అంతా చెప్పిందొక్క‌టే. ఈ డిస్కం వ‌ద్దే వ‌ద్దే.. ఉన్న రెండు డిస్క‌మ్‌లు స‌రిగా చేసుకుంటే.. వాటిలోని లోపాల‌ను స‌వ‌రించుకుంటే.. అప్పుల విష‌యంలో ప్ర‌భుత్వం చొర‌వ తీసుకుని వాటి మ‌నుగ‌డ‌కు ప్ర‌త్యేక శ్ర‌ద్ద చూపితే స‌రిపోతుంద‌నే అభిప్రాయాలు వెల్ల‌డ‌య్యాయి. దీన్ని అవ‌స‌ర‌మైతే ఫైల‌ట్ ప్రాజెక్టుగా చేసి చూపాల‌ని,ఆ త‌రువాతే ముందుకు పోవాల‌ని క‌విత ఓ ప్ర‌తిపాద‌న పెట్టారు. ఈ రైతు డిస్కం వ‌ద్దంటూనే.. ప్ర‌భుత్వం ఒక‌వేళ ముందుకే పోవాల‌నుకుంటే.. మాత్రం పైల‌ట్‌గా పోవాల‌న్నారు. రైతుల వ‌ద్ద‌కు పోయి అభిప్రాయాలు సేక‌రించాల‌ని స‌ల‌హా ఇచ్చారు. అసెంబ్లీ స‌మావేశంలో చ‌ర్చ‌లు జ‌రపాల‌ని, ప్ర‌జ‌లంతా దీన్ని గ‌మ‌నిస్తార‌ని, ఏది మంచో ఏది చెడో వారికి తెలిసిపోతుంద‌న్నారు.

Advertisement

ఇంత ఆద‌రాబాద‌ర‌గా నిర్ణ‌యం తీసుకోవ‌డం.. జూన్ 2 నుంచి దీన్ని అమ‌లు ప‌రిచేందుకు స‌ర్కార్ హ‌డావుడిగా రెడీ అయిపోవడం.. లోగో కూడా త‌యారు చేసి పెట్టుకోవ‌డం.. ఇవ‌న్నీ కేంద్రం ఒత్తిడితో చేస్తున్నచ‌ర్య‌లేన‌ని నిరంజ‌న్‌రెడ్డి ఆరోపించారు. దీని నిర్వ‌హ‌ణ బాధ్య‌త అదానీకి ఇచ్చేందుకు అంతా రెడీ అయిపోయంద‌నే ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో.. దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఈ విష‌యంలో గ‌తంలో కేసీఆర్‌పై మోడీ తీవ్ర ఒత్తిడి తెచ్చార‌ని తాము.. దీంట్లో భాగ‌స్వామ్యం కాక‌పోవ‌డంతో రావాల్సిన నిధులు ఆపేశార‌ని, తీవ్ర ఇబ్బందులు పెట్టార‌ని కూడా అన్నారు. క్ర‌మ‌క్ర‌మంగా ఇది వ్య‌వ‌సాయ పంపు సెట్ల‌కు మోటార్లు బిగించేందుకే దారి తీయ‌నుంద‌ని, దీని ద్వారా అస‌లు రైతుకు మేలే జ‌ర‌గ‌న‌ప్పుడు.. రైతు డిస్కం అని ఎందుకు పేరుపెట్ట‌డం.. మూడో డిస్కం అని పేరు పెట్టుకోండ‌ని కూడా స‌ల‌హాలు ఇచ్చారు. మొత్తానికి దీనిపై రైతు సంఘాలు కూడా తీవ్ర వ్య‌తిరేక‌తను వెల్ల‌డించాయి.

పాల‌కులు ఉన్న రెండు డిస్కంల‌కు వేలాది కోట్లు బ‌కాయిలు ప‌డి.. ఇప్పుడు దీన్ని నెత్తుకోవ‌డం ద్వారా.. రైతుల‌ను మ‌రింత ఇబ్బంది పెట్ట‌డ‌మే అవుతుంద‌ని భావించారు. హ‌డావుడి చ‌ర్య‌గా దీన్ని తీసుకోవ‌ద్ద‌ని, జిల్లాల వారీగా రైతులతో స‌మావేశాలు పెట్టి.. ఆ తరువాత అసెంబ్లీలో కూడ చ‌ర్చ పెట్టాల‌న్నారు. ఈ సంద‌ర్బంగా క‌విత కేసీఆర్ పాల‌న‌లో.. ప్ర‌స్త‌తం డిస్కంల‌కు బ‌కాయిలు ప‌డ్డ నిధుల‌పై స‌వివరంగా మాట్లాడారు. తెలంగాణ ఎల‌క్ట్రిసిటీ ఇంజినీర్ల‌కు, ఉద్యోగుల‌కు కూడా ఈ డిస్కం ద్వారా న‌ష్టం జ‌రుగుతుంద‌ని, ఆంధ్రా ఉద్యోగులు మ‌రోసారి దీంట్లో తిష్ట వేసి.. తెలంగాణ వారికి అన్యాయం చేసేందుకు రెడీగా ఉన్నార‌ని గుర్తు చేశారు.

Related News

ప‌శ్చాత్తాపాలు.. మీ పాపాల‌ను క‌డ‌గ‌లేవు! అందెశ్రీ గ‌ళానికి సంకెళ్లేశావు..! ఫామ్‌హౌజ్‌లో నిన్ను బంధీ చేశాము..!

డెబ్బైవేల‌కు ఒక్క‌రు త‌గ్గినా.. త‌ల‌న‌రుక్కుంటా..! ఉద్యోగాల క‌ల్ప‌న‌లో ఎవ‌రి లెక్క‌లు వారివే..

కేటీఆర్ ప‌శ్చాత్తాపం! పొరపాట్ల‌కు చింతిస్తున్నాం.. మీ ఆకాంక్ష‌ల బాధ్య‌త నేను తీసుకుంటా..!

ఇక చివరి దరువు ధరణి! విచారణలేనా!? చర్యలుండవా…? జ‌నం ఏమ‌నుకుంటున్నారు..?

మావిగ‌న్‌ను ముంచిన అమ‌రావ‌తి!జ‌గ‌న్‌కు చెంప‌పెట్టులాంటి బాబు ఆన్స‌ర్.. అమ‌రావ‌తి ఆర్థిక మండ‌లి..!

అంతుచిక్క‌ని అర్వింద్ అంతరంగం! అనుకున్న‌ది చేస్తాడు.. చెప్పాల్సింది చెప్పేస్తాడు…లైన్ దాటి!

కేసీఆర్ ట్ర‌య‌ల్ ర‌న్‌! కేటీఆర్‌ భారీ బ‌హిరంగ స‌భ‌లు! మొన్న రైతు స‌భ‌.. రేపు యువ సంగ్రామ స‌ద‌స్సు.. !

రెడ్‌బుక్ బెదిరింపులు వ‌చ్చు..! ప్లీజ్ మా ఏపీకి రండని బ‌తిమాల‌డ‌మూ వ‌చ్చు..!

Big Stories

Advertisement
×