E-Paper
Advertisement

ఎలక్ట్రిక్ SUV To ప్రిల్యూడ్ స్పోర్ట్స్ కారు.. హోండా నుంచి రాబోయే 4 క్రేజీ మోడళ్లు ఇవే!

ఎలక్ట్రిక్ SUV To ప్రిల్యూడ్ స్పోర్ట్స్ కారు.. హోండా నుంచి రాబోయే 4 క్రేజీ మోడళ్లు ఇవే!
Advertisement

హోండా భారత మార్కెట్‌ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే సిటీ ఫేస్‌ లిఫ్ట్, ZR-V వంటి మోడళ్లను పరిచయం చేసిన ఈ జపాన్ కార్ల దిగ్గజం, రాబోయే రోజుల్లో మరికొన్ని కొత్త కార్లు, SUVలను తీసుకురానున్నట్లు ప్రకటించింది. వచ్చే రెండు సంవత్సరాల్లో ఏకంగా నాలుగు క్రేజీ మోడళ్లను విడుదల చేయాలని హోండా భావిస్తోంది.

⦿ హోండా ఎలక్ట్రిక్ SUV

హోండా తొలి ఎలక్ట్రిక్ SUVపై మార్కెట్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇటీవల ఈ మోడల్ భారత రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించింది.  0-ఆల్ఫా  ప్లాట్‌ ఫారమ్ ఆధారంగా రూపొందుతున్న ఈ ఎలక్ట్రిక్ SUVకు ప్రత్యేకమైన బాక్సీ డిజైన్, విశాలమైన క్యాబిన్ ఉండనున్నాయి. ఇందులో ట్రిపుల్ స్క్రీన్ సెటప్, 360 డిగ్రీల కెమెరా, పనోరమిక్ సన్‌ రూఫ్, లెవెల్-2 ADAS, వెంటిలేటెడ్ సీట్లు లాంటి అత్యాధునిక ఫీచర్లు అందుబాటులో ఉండనున్నాయి. దీని ధర రూ.18 లక్షల నుంచి రూ.27 లక్షల వరకు ఉంటుంది.

⦿ హోండా సబ్ కాంపాక్ట్ SUV

Advertisement

ఇక సబ్ కాంపాక్ట్ SUV విభాగంలో కూడా హోండా అడుగుపెట్టబోతోంది. ప్రస్తుతం టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, మహీంద్రా XUV 3XO లాంటి మోడళ్లు ఆధిపత్యం చెలాయిస్తున్న ఈ సెగ్మెంట్‌ లో హోండా కొత్త SUVతో పోటీ ఇవ్వనుంది. ఈ కారు అమేజ్ ప్లాట్‌ ఫారమ్ ఆధారంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ లేదంటే ఎలక్ట్రిక్ పవర్‌ ట్రెయిన్ అందించే అవకాశం ఉంది. ఈ SUV 2027 నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉండగా, ధర రూ.9 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య ఉంటుందని భావిస్తున్నారు.

⦿ హోండా మిడ్ సైజ్ SUV

అటు మిడ్ సైజ్ SUV సెగ్మెంట్‌ లో కూడా హోండా కొత్త మోడల్‌ ను తీసుకురానుంది. ఇది పూర్తిగా కొత్త SUV కావచ్చని తెలుస్తోంది. లేదంటే ఎలివేట్‌ కు అప్‌ డేట్ వెర్షన్ కావచ్చని భావిస్తున్నారు. ఒకవేళ కొత్త మోడల్ అయితే WR-V  లాంటి  పేరుతో రావచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా హైబ్రిడ్ టెక్నాలజీతో ఈ SUVను అందించే అవకాశాలు ఉన్నాయి. టెస్టింగ్ ప్రారంభమైన తర్వాత దీనిపై మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

⦿ హోండా ప్రిల్యూడ్ స్పోర్ట్స్ కారు

Advertisement

హోండా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రిల్యూడ్ స్పోర్ట్స్ కారు కూడా భారత్‌ కు రానుంది. పూర్తిగా దిగుమతి చేసుకునే CBU మోడల్‌ గా ఇది అందుబాటులోకి వస్తుంది. 2.0 లీటర్ పెట్రోల్, హైబ్రిడ్ ఇంజిన్‌ తో వచ్చే ఈ కారు మంచి పనితీరు, ఇంధన సామర్థ్యాన్ని అందించనుంది.  దీని ధర రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

Read Also: వోక్స్‌ వ్యాగన్ కొత్త కాంపాక్ట్ SUV వచ్చేస్తోంది.. నెక్సాన్, బ్రెజ్జాకు పోటీ తప్పదా?

Related News

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

కారులో రాకెట్ టెక్నాలజీ.. స్పేస్‌ ఎక్స్‌ తో టెస్లా కొత్త ప్రయోగం చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా XUV 3XO సరికొత్త రికార్డు.. 5 లక్షలు దాటిన సేల్స్!

మారుతి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ. 1.65 లక్షల తగ్గింపు!

హ్యుందాయ్ క్రెటా సరికొత్త రికార్డు.. 15 లక్షలు దాటిన అమ్మకాలు!

ట్రాక్షన్ కంట్రోల్, ఫాస్ట్ ఛార్జింగ్‌.. అప్ డేటెడ్ టీవీఎస్ రైడర్ లో అదిరిపోయే ఫీచర్లు!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

Big Stories

Advertisement
×