E-Paper
Advertisement

జుట్టు రాలడం వేరు.. బట్టతల వేరు, రెండింటి మధ్య తేడాలను కనిపెట్టండిలా!

జుట్టు రాలడం వేరు.. బట్టతల వేరు, రెండింటి మధ్య తేడాలను కనిపెట్టండిలా!
Advertisement

Hair fall vs Baldness: జుట్టు దువ్వెనప్పుడు లేదా తల స్నానం చేసినప్పుడో కొన్ని జుట్టు వెంట్రుకలు రాలడం చాలా సహజం. అయితే.. చాలా మంది జుట్టు రాలడాన్ని చూసి తమకు బట్టతల వచ్చేస్తోందేమోనని తెగ కంగారుపడిపోతుంటారు. నిజానికి జుట్టు రాలడానికి, బట్టతలకు మధ్య చాలా తేడా ఉంది. జుట్టు రాలడం అనేది తాత్కాలికమైన సమస్య అయితే.. బట్టతల అనేది ఒక నిర్దిష్ట పద్ధతిలో జుట్టు శాశ్వతంగా ఊడిపోయే ప్రక్రియ.ఈ రెండింటి మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. జుట్టు రాలడం అంటే ఏమిటి?
మన తలపై ఉన్న జుట్టు జీవితకాలంలో మూడు దశలు ఉంటాయి (ఎదగడం, విశ్రాంతి, రాలడం). రోజుకు 50 నుంచి 100 వెంట్రుకలు రాలడం అనేది పూర్తిగా సాధారణమైన విషయం.

Advertisement

కారణాలు: తీవ్రమైన మానసిక ఒత్తిడి, పోషకాహార లోపం (ఐరన్, విటమిన్ డి, బయోటిన్ లోపించడం), వాతావరణ మార్పులు, డెలివరీ తర్వాత లేదా జ్వరం వచ్చినప్పుడు జుట్టు ఎక్కువగా రాలుతుంది.

లక్షణం: తల మొత్తం మీద ఎక్కడైనా జుట్టు రాలవచ్చు. అయితే.. రాలిన చోట మళ్లీ కొత్త జుట్టు మొలుస్తుంది. సరైన ఫుడ్, మంచి హెయిర్ ఆయిల్ వాడితే ఈ సమస్య కొన్ని రోజుల్లోనే తగ్గిపోతుంది.

Advertisement

2. బట్టతల అంటే ఏమిటి?
బట్టతల అనేది జుట్టు రాలడం కంటే భిన్నమైంది. రాలిన చోట మళ్లీ కొత్త జుట్టు రాకపోవడాన్ని.. లేదా వచ్చే జుట్టు చాలా పల్చగా మారి క్రమంగా ఆగిపోవడాన్ని బట్టతల అంటారు.

కారణాలు: ఇది ముఖ్యంగా జన్యుపరమైన కారణాలు, హార్మోన్ల అసమతుల్యత (DHT హార్మోన్) వల్ల వస్తుంది. దీన్ని ‘ఆండ్రోజెనెటిక్ అలోపేసియా’ అని కూడా పిలుస్తారు.

లక్షణాలు: బట్టతల వచ్చేటప్పుడు జుట్టు ఒక పద్ధతిలో ఊడిపోతుంది. మగవారిలో నుదుటి భాగం వెనక్కి వెళ్లడం లేదా నెత్తి నడిబొడ్డున జుట్టు పల్చబడటం జరుగుతుంది. ఆడవారిలో అయితే పాపిడి వెడల్పు అవ్వడం కనిపిస్తుంది.

3. తేడాను సులభంగా ఎలా గుర్తించాలి?
మీకు అవుతున్నది సాధారణ జుట్టు రాలడమా లేక బట్టతలా అనేది ఈ కింది విషయాల ద్వారా తెలుసుకోవచ్చు.

జుట్టు పల్చబడటం: మీ తలపై జుట్టు సాంద్రత తగ్గిపోతూ, స్కాల్ప్ (తల చర్మం) స్పష్టంగా కనిపిస్తుంటే అది బట్టతలకు సంకేతం.

వెంట్రుకల పరిమాణం: రాలే వెంట్రుకలు చాలా సన్నగా, చిన్నగా మారుతుంటే హెయిర్ ఫాలికల్స్ దెబ్బతింటున్నాయని అర్థం.

కాలం: జుట్టు ఆరు నెలల కంటే ఎక్కువగా రాలుతూ.. కొత్త జుట్టు రావడం లేదంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

జుట్టు కొద్దిగా రాలినంత మాత్రాన బట్టతల వచ్చేస్తుందని భయపడాల్సిన అవసరం లేదు. అది కేవలం శరీరంలో పోషకాల లోపం వల్ల కావచ్చు. అయితే నుదురు వెనక్కి పోవడం, జుట్టు విపరీతంగా పల్చబడటం గమనిస్తే మాత్రం అది బట్టతల కావచ్చు. సమస్య ప్రారంభంలోనే మంచి డెర్మటాలజిస్ట్‌ను సంప్రదిస్తే జుట్టును కాపాడుకోవచ్చు.

Related News

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

పిల్లల చేతి నుంచి ఫోన్ తీసుకోగానే ఏడుస్తున్నారా? ఇలా చేస్తే స్వయంగా ఇచ్చేస్తాడు

మన రక్తంలో ప్లాస్టిక్ విధ్వంసం.. తాజా రీసెర్చ్‌లో తేలిన సంచలన విషయాలు!

ఈ నవరాత్రులకు 3 స్పెషల్ డిషెస్.. ప్రసాదంగానూ పెట్టొచ్చు, రుచికి తిరుగే ఉండదు!

ఇడ్లీ,దోశలోకి అదిరిపోయే రుచితో ఉల్లిపాయ చట్నీలు..ఇలా చేసేయండి!

Big Stories

Advertisement
×