ప్రస్తుతం దేశీయ మార్కెట్లో క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి. అన్ని రకాల రైడర్ల అవసరాలకు అనుగుణంగా పలు రకాల ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీరు కొత్త ఇ స్కూటర్ కోసం చూస్తున్నట్లయితే, మీ రోజువారీ ప్రయాణ అవసరాలను తీర్చడానికి మంచి రేంజ్ కావాలనుకుంటే, IDC లెక్కల ప్రకారం ఎక్కువ రేంజ్ ను అందించే ఈ 5 ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఓసారి ఆలోచించండి.
Ola S1 Pro ప్రస్తుతం దేశంలోని అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఎక్కువ రేంజ్ ను అందిస్తుంది. ఒక ఫుల్ ఛార్జ్ మీద ఏకంగా 242 కిలో మీటర్లు వెళ్లొచ్చు. ఈ స్కూటర్ 5.2 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇందులో S1 Pro Sport, S1 Pro+ అందుబాటులో ఉన్నాయి. వీటి ధర వరుసగా రూ.1,49,999, రూ. 1,54,999గా ఉంది. ప్రో+ 13 kW గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 2.1 సెకన్లలో 0-40 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గంటకు 130 కిలో మీటర్ల వేగంతో వెళ్తుంది.
సింపుల్ ఎనర్జీ నుంచి వచ్చిన తాజా ఈవీ సింపుల్ వన్ జెన్ 2. ఇది ఒక్క ఛార్జ్ తో 265 కి.మీ పరిధిని అందిస్తుంది. 5.0 kWh బ్యాటరీ ప్యాక్ తో టాప్ వేరియంట్‌లో ఉంది. దీని ధర రూ. 1,77,999గా ఉంది. మంచి డిజైన్, రీన్‌ఫోర్స్డ్ బ్యాటరీ నిర్మాణం, కొత్త OSను కలిగి ఉంటుంది. ఇది 2.55 సెకన్లలో 0–40 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 115 కిలో మీటర్ల టాప్ స్పీడ్ ను కలిగి ఉంటుంది.
TVS iQube ఒక్క ఛార్జ్ తో 212 కి.మీ ప్రయాణిస్తుంది. ఇది 5.3 kWh బ్యాటరీతో ST వేరియంట్ లో అందించబడింది. ఇది రేంజ్ టాపింగ్ మోడల్. దీని ధర రూ. 1,58,834గా ఉంటుంది. ఇది 4.5 సెకన్లలో 0-40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. 4.4 kW పీక్ పవర్ అవుట్ పుట్ తో 82 కి.మీ టాప్ స్పీడ్ ను అందుకుంటుంది.
Vida V2 అనేది ఒక్క ఛార్జింగ్ తో 165 కి.మీ రేంజ్ ను కలిగి ఉంటుంది. దీని ధర రూ. 1,20,300గా కంపెనీ నిర్ణయించింది. 3.9 kWh బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుంది. ఇది కేవలం 2.9 సెకన్లలో 40 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 90 కిలో మీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. V2 7-అంగుళాల TFT టచ్ స్క్రీన్, రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌లు, క్రూయిజ్ కంట్రోల్, బ్రేక్ రీజెన్ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.
రివర్ ఇండీ జెన్ 3 ఈవీ 4 kWh బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుంది. ఇది ఒక్క ఛార్జ్ తో 163 కి.మీ పరిధిని కలిగి ఉంటుంది. దీని ధర రూ. 1,46,399గా ఉంటుంది. ఇది ఒకే వేరియంట్ లో అందుబాటులో ఉంది. 6.7 kW PMS మోటారును కలిగి ఉంటుంది. కేవలం 3.5 సెకన్లలో 0-40 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 90 కిలో మీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటుంది.
Read Also: ఒక్క ఛార్జ్ తో 400 కిలో మీటర్లు.. హ్యుందాయ్ నుంచి క్రేజీ ఈవీ లాంచ్!