E-Paper
Advertisement

Anil Ravipudi: 2027 సంక్రాంతికి అనిల్ రావిపూడి ల్యాండ్‌మార్క్ మూవీ…హీరో ఎవరంటే..!

Anil Ravipudi: 2027 సంక్రాంతికి అనిల్ రావిపూడి ల్యాండ్‌మార్క్ మూవీ…హీరో ఎవరంటే..!
Advertisement

Anil Ravipudi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకెళ్తున్న దర్శకుల్లో.. అనిల్ రావిపూడి పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇప్పటికే ఎనిమిది సినిమాలు ఈ దర్శకుడు తీస్తే….వాటిలో ఒక్కటైనా ఫ్లాప్ లేకుండా.. అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్లుగా నిలిచాయి. ఎస్.ఎస్. రాజమౌళి తర్వాత అలాంటి రికార్డు ఉన్న దర్శకుడు.. అనిల్ రావిపూడి అనే చెప్పాలి.

ఇక ఈ సంక్రాంతి సందర్భంగా విడుదలైన మాన శంకర వర ప్రసాద్ గారు సినిమాతో మరోసారి తన స్టామినాను నిరూపించాడు. ఈ సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకోవడంతో..సంక్రాంతి సీజన్‌లో ఆయన హ్యాట్రిక్ మాత్రమే కాదు.. ఆయన కెరీర్లో ట్రిపుల్ హ్యాట్రిక్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే హాస్యం, వినోదం ఆయన సినిమాలకు ప్రధాన బలం.

Advertisement

ఇప్పుడు అందరి దృష్టి అనిల్ రావిపూడి 10వ సినిమాపై పడింది. ఈ సినిమా 2027 సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఇటీవల మీడియాతో మాట్లాడిన అనిల్ రావిపూడి, అక్కినేని నాగార్జునతో పని చేయాలని తన ఆసక్తిని వ్యక్తం చేశారు. ఈ కాంబినేషన్ జరిగితే, నాలుగు సీనియర్ హీరోలతో పని చేసిన న్యూ ఏజ్ దర్శకుడిగా అనిల్ అరుదైన రికార్డు సొంతం చేసుకుంటాడు. కానీ నాగార్జున ప్రస్తుతం తన 100వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటంతో.. వెంటనే ఈ ప్రాజెక్ట్ సాధ్యమవుతుందా అనేది అనిశ్చితమే.

ఇక వెంకటేష్ తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచన కూడా ఉందని సంకేతాలు ఇచ్చారు. అయితే వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. అదేవిధంగా ‘దృశ్యం 3’ కూడా ప్లాన్‌లో ఉంది. అందుకే వెంటనే వెంకీ–రవిపూడి కాంబినేషన్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

Advertisement

మరోవైపు..దిల్ రాజు నిర్మాణ సంస్థలో మరో సినిమా చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు పవన్ కళ్యాణ్ హీరోగా ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ ఇంకా ఊహాగానాలే.

మొత్తం పైన చూస్తే ..అనిల్ రావిపూడి 10వ సినిమాకు హీరో ఎవరు అనే విషయం అధికారికంగా ప్రకటించలేదు. అయినా, ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ హైప్ ఏర్పడింది. వచ్చే సంక్రాంతికి మరోసారి ఆయన విజయం సాధిస్తాడనే నమ్మకం అభిమానుల్లో బలంగా ఉంది.

ALSO READ: Jana Nayagan Release Date: ఇక ఈ సంక్రాంతి సెలవల్లో విజయ్ సినిమా లేనట్టే.. కోర్టులో ఏమైందంటే..

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×