E-Paper
Advertisement

Upcoming Toyota SUVs: రెండేళ్లలో 5 SUVలు.. టయోటా నుంచి రాబోయే క్రేజీ కార్లు ఇవే!

Upcoming Toyota SUVs: రెండేళ్లలో 5 SUVలు.. టయోటా నుంచి రాబోయే క్రేజీ కార్లు ఇవే!
Advertisement

5 Exciting Toyota SUVs Coming Soon in India: భారతీయ ఆటో మార్కెట్ లో టయోటా రోజు రోజుకు మరింత సత్తా చాటుతోంది. హైబ్రిడ్ మోడళ్ల నుంచి టఫ్ SUVలు, లైఫ్‌ స్టైల్ వెహికల్స్ వరకు అందుబాటులో ఉంచింది. రాబోయే రెండేళ్లలో పలు న్యూ జెనరేషన్ SUVలు లాంచ్ కానున్నాయి. టయోటా SUV లాంచ్ లైనప్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా

టయోటా, సుజుకి ఇ-విటారాతో ప్లాట్‌ ఫామ్‌ ను పంచుకుంటూ.. అర్బన్ క్రూయిజర్ ఎబెల్లాతో ఎలక్ట్రిక్ SUV మార్కెట్‌లోకి అడుగు పెట్టాలని భావిస్తోంది. లేటెస్ట్ స్టైలింగ్, పెద్ద టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, సిటీ డ్రైవింగ్‌ కు అనువైన ఎలక్ట్రిక్ పవర్‌ ట్రెయిన్‌ ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. వైర్‌ లెస్ స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీ, పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్‌ ప్లే, కనెక్టెడ్ కార్ టెక్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ లాంటి ఫీచర్లతో రానుంది. పనోరమిక్ సన్‌ రూఫ్, 360 డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్,  ADAS సూట్‌ ఉంటుంది. భద్రత కోసం టయోటా 6 ఎయిర్‌ బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు ఉంటాయి. అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా ధర, బ్యాటరీ ప్యాక్ మరియు వేరియంట్‌ను బట్టి, రూ.18 లక్షల నుండి రూ.25 లక్షల మధ్యన ఉంటుందని అంచనా.

న్యూ జెనరేషన్ టయోటా హిలక్స్

Advertisement

సరికొత్త హిలక్స్‌ ను వరల్డ్ వైడ్ గా లాంచ్ చేశారు. ఇది ఎలాంటి రోడ్ల మీదైనా ప్రయాణించే యుటిలిటీ వెహికల్. లేటెస్ట్ స్టైలింగ్, రీ డీజైన్ చేసిన ఇంటీరియర్స్, కొత్త ఫీచర్లు ఉంటాయి. కొత్త హిలక్స్‌ లో టయోటా సేఫ్టీ సెన్స్ ఫీచర్ ఉంటుందని అంచనా. ప్రీ కొలిజన్ సిస్టమ్, లేన్ డిపార్చర్ అలర్ట్, రోడ్ సైన్ అసిస్ట్‌తో కూడిన అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ హై బీమ్ సిస్టమ్స్ ఉంటాయి ప్రోయాక్టివ్ డ్రైవింగ్ అసిస్ట్, లో స్పీడ్ యాక్సిలరేషన్ సప్రెషన్,  ఎమర్జెన్సీ డ్రైవింగ్ స్టాప్ ఉంటుంది. హిలక్స్ 2.8-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌ తో ఉంటుంది.  4×4 డ్రైవ్‌ ట్రెయిన్‌తో పాటు, 6 స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ తో రానుంది. ఎలక్ట్రిక్, హైబ్రిడ్, హైడ్రోజన్ ఆధారిత వెర్షన్‌లను తీసుకురావాలని ఆలోచిస్తోంది. కొత్త హిలక్స్ ధర రూ.  40 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు ఉంటుంది.

న్యూ జెనరేషన్ టయోటా ఫార్చ్యూనర్

టయోటా లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న లాంచ్‌లలో ఇది ఒకటి. నెక్ట్స్ జెనరేషన్ ఫార్చ్యూనర్‌ ను టయోటా కొత్త లాడర్ ఫ్రేమ్ ఆర్కిటెక్చర్‌ పై నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. మంచి రైడ్ క్వాలిటీ, మరింత భద్రతను అందిస్తుందని భావిస్తున్నారు.  ఈ SUVలో పూర్తిగా అప్ డేట్ చేసిన క్యాబిన్ ఉంటుందని భావిస్తున్నారు. 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌ లెస్ ఛార్జింగ్, లెవెల్-2 ADAS లాంటివి  వంటివి ఉంటాయి. 2.8-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను కొనసాగించే అవకాశం ఉంది. మెరుగైన సామర్థ్యం మరియు పనితీరు కోసం దీనికి 48V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ ను యాడ్ చేయనుంది. 2.7-లీటర్ పెట్రోల్ ఇంజిన్ కూడా అందుబాటులో ఉంటుందని అంచనా. ఇది మాన్యువల్,ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో పాటు, 4×4 డ్రైవ్‌ ట్రెయిన్‌తో కూడా వస్తుంది. దీని సుమారు రూ. 40 లక్షల నుంచి రూ. 65 లక్షల వరకు ఉంటుంది. దీనిని 2026 చివరిలో లేదంటే 2027 ప్రారంభంలో ఉంటుందని అంచనా.

టయోటా ల్యాండ్ క్రూయిజర్ FJ

Advertisement

టయోటా ల్యాండ్ క్రూయిజర్ FJ చిన్న, బలమైన ఆఫ్ రోడర్. ఫార్చ్యూనర్, హైలక్స్‌ లో ఉపయోగించే అదే ఆర్కిటెక్చర్‌తో, టయోటా IMV లాడర్ ఫ్రేమ్ ప్లాట్‌ఫామ్‌పై దీనిని నిర్మించారు. 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీటు, టయోటా సేఫ్టీ సెన్స్ ADAS సూట్‌ తో పాటు, హిల్-డిసెంట్ కంట్రోల్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్‌ లను కలిగి ఉంటుంది. బేస్ మోడల్‌ లో బహుశా 2.7-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్, పార్ట్ టైమ్ 4WD సిస్టమ్ యాడ్ చేసి ఉన్నాయి. దీని ధర సుమారు రూ.34-42 లక్షలు ఉంటుంది. ఇండియాలోకి 2028లో అడుగుపెట్టే అవకాశం ఉంది.

అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఫేస్‌లిఫ్ట్

హైబ్రిడ్ SUV టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కూడా ఫేస్‌ లిఫ్ట్‌ లో రానుంది. కొత్త బంపర్లు, కొత్త గ్రిల్, కొత్త అల్లాయ్ వీల్స్ లాంటి మార్పులతో రానుంది.  లోపల, టయోటా విక్టోరిస్‌ లో ఉన్నటువంటి కొన్ని ఫీచర్ అప్‌ గ్రేడ్‌ చేయనుంది. వెంటిలేటెడ్ సీట్లు, పెద్ద టచ్‌స్క్రీన్, హెడ్స్ అప్ డిస్‌ప్లే, కనెక్టెడ్ కార్ టెక్, TPMS, స్టాండర్డ్‌ గా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.  1.5-లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్, 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌ బాక్స్‌ తో పాటు, 1.5-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ సెటప్, e-CVT ట్రాన్స్‌ మిషన్‌ తో రానుంది. CNG ఆప్షన్, AWD కూడా కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుత హైరైడర్ ధర రూ. 13.27 లక్షల నుంచి రూ. 24.51 లక్షల మధ్య ఉంది. ఫేస్‌లిఫ్ట్ ధర సుమారు రూ. 50,000 వరకు పెరిగే అవకాశం ఉంది. ఇది 2026 చివరి నాటికి విడుదల కానుంది.

Read Also: ఒకే ఛార్జ్ తో 902 కి.మీ రేంజ్, వామ్మో ఇదేం టెక్నాలజీ భయ్యా!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×