E-Paper
Advertisement

వేసవిలో కారు, బైక్ టైర్లు పగలకుండా ఉండాలంటే.. ఈ 6 జాగ్రత్తలు తప్పనిసరి!

వేసవిలో కారు, బైక్ టైర్లు పగలకుండా ఉండాలంటే.. ఈ 6 జాగ్రత్తలు తప్పనిసరి!
Advertisement

Summer Driving Tips: వేసవిలో ఎండలు జనాలను ఎతంగా ఇబ్బంది పెడతాయో, వాహనాల టైర్లపై కూడా అంతే ప్రభావం చూపిస్తాయి. రోడ్లు బాగా వేడెక్కడం, ఎక్కువసేపు డ్రైవింగ్ చేయడం వల్ల టైర్లలో గాలి ఒత్తిడి పెరిగి, ఒక్కసారిగా పేలిపోయే  ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా హైవేలపై ఎక్కువ వేగంతో వెళ్లేటప్పుడు ఊహించని ప్రమాదాలకు కారణం అవుతుంది. అయితే, కొన్ని సులభమైన జాగ్రత్తలు పాటిస్తే టైర్ల జీవితకాలం పెరగడమే కాకుండా ప్రమాదాలను కూడా తగ్గించవచ్చు.

⦿  టైర్ ప్రెజర్‌ను ఉదయాన్నే చెక్ చేయండి!

టైర్లలో గాలి ఎంత ఉందో చూసుకోవడం చాలా ముఖ్యం. టైర్లు చల్లగా ఉన్నప్పుడు సరిగ్గా తెలుస్తుంది. అందుకే ఉదయం వాహనం ఎక్కువగా నడపకముందే టైర్ ప్రెజర్‌ను చెక్ చేయాలి. కారు తయారీ కంపెనీ సూచించిన PSI మేరకే గాలి నింపాలి. ఎక్కువ, తక్కువ గాలి రెండూ కూడా టైర్లకు ప్రమాదకరమే.

⦿ నైట్రోజన్ ఉపయోగించడం మంచిది!

Advertisement

ఇటీవల చాలామంది నైట్రోజన్ గాలి వాడుతున్నారు. సాధారణ గాలితో పోలిస్తే నైట్రోజన్ వేడిలో త్వరగా విస్తరించదు. టైర్లలో ఒత్తిడి స్థిరంగా ఉంటుంది. సుదూర ప్రయాణాల్లో కూడా టైర్లు ఎక్కువగా వేడెక్కకుండా సహాయపడుతుంది. గాలి త్వరగా తగ్గిపోకుండా ఉంటుంది.

⦿ ఎక్కువ బరువు వేయొద్దు!

వేసవిలో టైర్ల రబ్బరు కొంచెం మృదువుగా మారుతుంది. అలాంటి సమయంలో కారులో ఎక్కువ మంది కూర్చోవడం, ఎక్కువ లగేజ్ పెట్టడం వల్ల టైర్లపై అదనపు ఒత్తిడి పడుతుంది. దీంతో సైడ్‌ వాల్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అవసరానికి మించిన బరువు వేయడాన్ని తగ్గిస్తే టైర్లు సురక్షితంగా ఉంటాయి.

⦿  నీడలో పార్క్ చేయండి!

Advertisement

నేరుగా ఎండ పడటం వల్ల టైర్ల మీద ఎక్కు ప్రభావం పడుతుంది. ఎక్కువసేపు ఎండలో ఉండటం వల్ల టైర్ల రబ్బరు పొడిబారి చిన్న పగుళ్లు రావచ్చు. అందుకే వీలైనప్పుడల్లా చెట్టు కింద, షెడ్‌ లో లేదంటే బేస్‌ మెంట్‌ లో కారును పార్క్ చేయాలి. ఇలా చేస్తే, టైర్లు ఎక్కువకాలం బాగుంటాయి.

⦿ లాంగ్ డ్రైవ్‌ మధ్యలో బ్రేక్ తీసుకోండి!

ఎక్కువసేపు డ్రైవింగ్ చేస్తే టైర్లు బాగా వేడెక్కుతాయి. ముఖ్యంగా వేసవిలో మరింత ప్రమాదకరం. అందుకే ప్రతి రెండు గంటలకు ఒకసారి 10 నుంచి 15 నిమిషాలు ఆగడం మంచిది. నీడలో వాహనం నిలిపితే టైర్లు చల్లబడేందుకు అవకాశం ఉంటుంది.

⦿ ట్రెడ్‌, వాల్వ్ క్యాప్‌ లను చెక్ చేయండి!

టైర్లపై ఉన్న గ్రిప్ తగ్గిపోతే అవి త్వరగా వేడెక్కుతాయి. అరిగిపోయిన టైర్లు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. సో, టైర్ల ట్రెడ్ బాగుందో లేదో తరచూ పరిశీలించాలి. అలాగే వాల్వ్ క్యాప్‌ లు సరిగా ఉన్నాయో? లేదో? చూసుకోవాలి. చిన్న గాలి లీక్ కూడా పెద్ద సమస్యకు దారితీయవచ్చు. సమ్మర్ లో టైర్లపై కాస్త శ్రద్ధ పెట్టడం వల్ల పెద్ద ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ప్రయాణం సురక్షితంగా ఉంటుంది.

Read Also: రివర్స్ పార్కింగ్‌ లో జాగ్రత్త.. కారుకు గీతలు పడకూడదంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

Related News

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

కారులో రాకెట్ టెక్నాలజీ.. స్పేస్‌ ఎక్స్‌ తో టెస్లా కొత్త ప్రయోగం చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా XUV 3XO సరికొత్త రికార్డు.. 5 లక్షలు దాటిన సేల్స్!

మారుతి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ. 1.65 లక్షల తగ్గింపు!

హ్యుందాయ్ క్రెటా సరికొత్త రికార్డు.. 15 లక్షలు దాటిన అమ్మకాలు!

ట్రాక్షన్ కంట్రోల్, ఫాస్ట్ ఛార్జింగ్‌.. అప్ డేటెడ్ టీవీఎస్ రైడర్ లో అదిరిపోయే ఫీచర్లు!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

Big Stories

Advertisement
×