E-Paper
Advertisement

శాంసంగ్ యూజర్లు ఎగిరి గంతేసే బిగ్ అప్డేట్.. పాత ఫోన్లన్నీ ఇక Galaxy S26లా మారిపోతాయ్, ఎలాగంటే?

శాంసంగ్ యూజర్లు ఎగిరి గంతేసే బిగ్ అప్డేట్.. పాత ఫోన్లన్నీ ఇక Galaxy S26లా మారిపోతాయ్, ఎలాగంటే?
Advertisement

Samsung One UI 8.5: ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ తమ వినియోగదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. పాత గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్‌లను వాడుతున్న వారి కోసం కంపెనీ సరికొత్త One UI 8.5 అప్‌డేట్‌ను రోల్ అవుట్ చేయడం ప్రారంభించింది. ఆండ్రాయిడ్ 16 ఆధారంగా పనిచేసే ఈ అప్‌డేట్ ద్వారా పాత మోడళ్లలో కూడా ప్రీమియం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Galaxy AI) ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల ప్రారంభంలో దక్షిణ కొరియాలో మొదలైన ఈ అప్‌డేట్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాల వినియోగదారులకు కూడా లభిస్తోంది.

ప్రీమియం ఫీచర్లు ఇక అందరికీ..

ధారణంగా సరికొత్త సాంకేతికత, AI ఫీచర్లు కేవలం లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ మోడల్స్ అయిన Galaxy S26 సిరీస్‌కే పరిమితం అవుతాయని అందరూ భావించారు. కానీ శాంసంగ్ తమ పాత ఫ్లాగ్‌షిప్, మిడ్‌రేంజ్ ఫోన్లను వాడుతున్న వారికి సైతం ఈ అధునాతన ఫీచర్లను అందిస్తూ షాక్ ఇచ్చింది. దీనివల్ల యూజర్లు సరికొత్త ఫోన్లు కొనాల్సిన అవసరం లేకుండానే.. తమ పాత ఫోన్లలోనే సరికొత్త టెక్నాలజీని ఉచితంగా పొందవచ్చు.

ఏయే మోడళ్లకు వస్తుందంటే?

Advertisement

భారతదేశంలోని Galaxy S23 సిరీస్ వాడుతున్న వారికి ఈ స్టేబుల్ అప్‌డేట్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. దాదాపు 4GB సైజులో ఉన్న ఈ అప్‌డేట్‌తో పాటు Galaxy S24 సిరీస్ ఫోన్లకు కూడా కొత్త సాఫ్ట్‌వేర్ లభిస్తోంది. ఫోన్లతో పాటే Galaxy Tab S11, Tab S11 Ultra, Tab S10 FE వంటి టాబ్లెట్లకు కూడా ఈ కొత్త వెర్షన్ వచ్చేసింది. కేవలం కాస్ట్‌లీ ఫోన్లకే కాకుండా మిడ్‌రేంజ్ బడ్జెట్ ఫోన్లు అయిన Galaxy A56, Galaxy A36 మోడళ్లకు కూడా శాంసంగ్ ఈ అప్‌డేట్ ఇస్తుండటం విశేషం.

Also Read: హోమ్ థియేటర్ రేంజ్ సౌండ్.. బ్లౌపంక్ట్ కొత్త వైర్‌లెస్ స్పీకర్ల స్పెషాలిటీ ఇదే!

మెరుగైన AI టూల్స్..

Advertisement

ఈ One UI 8.5 అప్‌డేట్ ద్వారా ఫోన్ల పెర్ఫార్మెన్స్ పెరగడమే కాకుండా రోజువారీ పనులను సులువు చేసే ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా కాల్ స్క్రీనింగ్, ఏజెంటిక్ AI సపోర్ట్, క్రియేటివ్ స్టూడియో, నిరంతర AI ఇమేజ్ జనరేషన్, అప్‌గ్రేడెడ్ ఆడియో ఎరేజర్ వంటి అద్భుతమైన ఫీచర్లు దీనిలో ఉన్నాయి. ఇవి ఫొటోగ్రఫీ, కమ్యూనికేషన్, కంటెంట్ క్రియేషన్‌ను మరింత సులభతరం చేస్తాయి.

ఇలా అప్‌డేట్ చేసుకోండి..

భారత్‌లోని వినియోగదారులకు ఈ అప్‌డేట్ విడతల వారీగా ఆటోమేటిక్‌గా అందుతుంది. ఒకవేళ మీకు ఇంకా నోటిఫికేషన్ రాకపోతే.. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘సాఫ్ట్‌వేర్ అప్‌డేట్’ ఆప్షన్‌ను ఎంచుకుని ‘డౌన్‌లోడ్ అండ్ ఇన్‌స్టాల్’ పై క్లిక్ చేసి మాన్యువల్‌గా చెక్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ సైజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. మధ్యలో ఎలాంటి ఆటంకాలు లేకుండా Wi-Fi నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయి అప్‌డేట్ చేసుకోవడం ఉత్తమం.

Also Read: Realme 16T భారత్‌లో లాంచ్.. 144Hz డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ బాడీతో పాటు మరెన్నో ప్రత్యేకతలు!

Related News

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

AIతో పెరుగుతున్న సైబర్ మోసాలు.. మీ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండిలా!

BSNL కనివిని ఎరుగని ప్లాన్స్.. రోజుకు రూ.5 మాత్రమే.. 80 రోజులపాటు మీ ఇష్టం!

కొత్త 5G ఫోన్‌తో ఫిలిప్స్ రీ-ఎంట్రీ.. సెప్టెంబర్ 2న ఏం లాంచ్ చేయనుందంటే?

బ్యాటరీ ఎక్కువకాలం మన్నాలంటే 80-20 రూల్ పాటించాల్సిందేనా?

ఒకప్పుడు ఇవే స్టేటస్ సింబల్.. 90లలో ఫేమస్ అయిన 5 ఫోన్లు ఇవే!

మ్యాక్‌లో సిస్టమ్ స్టోరేజ్ పెరిగిపోయిందా? ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా ఖాళీ చేసి స్పీడ్ పెంచండి!

Big Stories

Advertisement
×