E-Paper
Advertisement

Best car: 33 కిమీ మైలేజ్ ఇచ్చే కారు.. కేవలం ఆరు లక్షల రూపాయలే

Best car: 33 కిమీ మైలేజ్ ఇచ్చే కారు.. కేవలం ఆరు లక్షల రూపాయలే
Advertisement

పదిలక్షల రూపాయలు దాటిన కార్లను మధ్యతరగతి వారు కొనలేరు. వీరికోసమే అతి తక్కువ ధరలో సెడాన్ కార్లు అందుబాటులో ఉన్నాయి. డిసెంబర్ 2025 నెలలో భారత్‌లో సెడాన్ కార్ల అమ్మకాల వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. గత కొన్నేళ్లుగా ఎస్‌యూవీలు, హ్యాచ్‌బ్యాక్ కార్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్నా, సెడాన్ కార్లు మాత్రం తమ స్థానం నిలబెట్టుకుంటూ వస్తున్నాయి. డిసెంబర్ 2025లో మొత్తం దాదాపు 32 వేల సెడాన్ కార్లు అమ్ముడయ్యాయి. ఇది గత ఏడాది డిసెంబర్‌తో పోలిస్తే పెరిగిందనే చెప్పుకోవాలి. నవంబర్ నెలతో పోలిస్తే అమ్మకాలు కొంచెం తగ్గాయి. సంవత్సరాంతం కావడం, కొత్త ఏడాది ఆఫర్ల కోసం కొంతమంది వేచి చూడటం వల్ల ఇలా జరిగి ఉంటుందని ఆటో రంగ నిపుణులు చెబుతున్నారు.

తక్కువ ధరతో ఎక్కువ మైలేజీ
ఈ అమ్మకాలలో మారుతి సుజుకి డిజైర్ టాప్ లో నిలిచింది. ఇది మరోసారి నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఒక్క డిసెంబర్ నెలలోనే దాదాపు 19 వేల డిజైర్ కార్లు అమ్ముడయ్యాయి. తక్కువ ధర, మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు ఉండటమే ఈ కారుకు ప్లస్ పాయింట్లు. ఫ్యామిలీ కారుగా, టాక్సీ అవసరాలకు కూడా దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. దీని ధర కూడా తక్కువే. కేవలం ఆరు నుంచి ఏడు లక్షల్లోనే ఈ కారు వచ్చేస్తుంది. అందులోనూ 33 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. దీని తరువాత రెండో స్థానంలో హ్యుందాయ్ ఆరా నిలిచింది. ఆరా అమ్మకాలు కూడా గత ఏడాదితో పోలిస్తే పెరిగాయి. స్టైల్, ఫీచర్లు, కంఫర్ట్ కారణంగా ఈ కారు మంచి ఆదరణ పొందుతోంది. హోండా అమేజ్ మాత్రం ఈసారి కొంచెం వెనకబడింది. గతంలో మంచి అమ్మకాలు ఉన్నా, డిసెంబర్‌లో అమేజ్ అమ్మకాలు తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Advertisement

Also read: Milk Products: పాలు, పెరుగు, పనీర్, మజ్జిగ… వీటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మంచిది?

మిడ్ సైజ్ సెడాన్ సెగ్మెంట్‌లో వోల్క్‌స్వాగన్ వర్టస్, హోండా సిటీ, స్కోడా స్లావియా మధ్య పోటీ సాగింది. స్పోర్టీ డిజైన్ వల్ల యువత దీనిపై ఆసక్తి చూపుతోంది. హోండా సిటీ అమ్మకాలు కూడా స్థిరంగానే ఉన్నాయి స్కోడా స్లావియా మాత్రం ఈ నెలలో పెద్దగా అమ్ముడుపోలేదు. అలాగే హ్యుందాయ్ వెర్నా అమ్మకాలు కూడా గణనీయంగా తగ్గాయి. టాటా టిగోర్, టిగోర్ ఈవీ కూడా తక్కువ సంఖ్యలో అమ్ముడయ్యాయి.

Advertisement

మొత్తంగా చూస్తే సెడాన్ కార్ల మార్కెట్ నెమ్మదిగానే ఉన్నా పూర్తిగా మాత్రం తగ్గిపోలేదు. చిన్న సెడాన్‌లలో డిజైర్, ఆరా లాంటి కార్లు ఇంకా మంచి డిమాండ్ చూపిస్తున్నాయి. కానీ మిడ్ సైజ్ సెడాన్‌లకు ఎస్‌యూవీల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, రఫ్ అండ్ టఫ్ లుక్ ఉండటంతో చాలా మంది ఎస్‌యూవీల వైపు మొగ్గు చూపుతున్నారు. అయినా కూడా సౌకర్యవంతమైన డ్రైవ్, మంచి బూట్ స్పేస్, స్టేబిలిటీ కారణంగా సెడాన్ కార్లను ఇష్టపడే వారు ఇంకా ఉన్నారు. రాబోయే నెలల్లో కొత్త మోడళ్లు, ఆఫర్లు వస్తే సెడాన్ అమ్మకాలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని ఆటో రంగ నిపుణులు చెబుతున్నారు.

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×