E-Paper
Advertisement

Milk Products: పాలు, పెరుగు, పనీర్, మజ్జిగ… వీటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మంచిది?

Milk Products: పాలు, పెరుగు, పనీర్, మజ్జిగ… వీటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మంచిది?
Advertisement

ప్రతి ఇంట్లోనూ పాలు, పెరుగు, పనీర్, మజ్జిగ ఉంటాయి. ఇవన్నీ కూడ పాల ఉత్పత్తులే. అయితే వీటిలో ఏవి ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తాయో తెలుసా? పోషకాహార నిపుణుల చెబుతున్న ప్రకారం ప్రతి ఆహారంతో ప్రత్యేకమైన ఆరోగ్య లాభాలు ఉన్నాయి. మన శరీర అవసరాలు, జీర్ణశక్తి, వయసు, ఆరోగ్య పరిస్థితి ఆధారంగా ఏది మంచిదో నిర్ణయించుకోవాలి. అందుకే అన్ని పాల ఉత్పత్తులను ఒకేలా చూడకూడదు.

పాలతో లాభాలు
ముందుగా పాలు గురించి తెలుసుకుంటే… పాలలో కాల్షియం, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. ఎముకలు బలంగా ఉండేందుకు పాలు చాలా అవసరం. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు పాలు తాగితే మంచిది. అయితే కొంతమందికి పాలు తాగిన తర్వాత గ్యాస్, కడుపు ఉబ్బరం, అసౌకర్యం వంటివి కలుగుతాయి. దీనికి కారణం పాలల్లో ఉండే లాక్టోజ్ జీర్ణం కాకపోవడమే. అలాంటి వారు పాలు తాగినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పెరుగు విషయానికి వస్తే, ఇది పాలతో పోలిస్తే జీర్ణానికి మరింత సులువు. పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి కడుపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. లాక్టోజ్ సమస్య ఉన్నవారు కూడా పెరుగు తినవచ్చు. రోజూ భోజనంతో పాటు కొద్దిగా పెరుగు తీసుకుంటే జీర్ణక్రియ బాగుంటుంది.

Advertisement

Also read: Simple Breakfast: ఇన్‌స్టంట్ ఆలూ ఊతప్పం రెసిపీ, ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది

పనీర్
ఇక పనీర్ గురించి చెప్పుకుంటే… దీనిలో ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం. కండరాల బలం పెరగాలనుకునేవారు, జిమ్ చేసే వారు పనీర్ తీసుకోవచ్చు. పనీర్ ను కూడా పాలతో పోలిస్తే త్వరగా జీర్ణం అవుతుంది. కానీ ఇందులో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే పనీర్ లో కాల్షియం ఉన్నా అది శరీరంలో పూర్తిగా శోషించుకోలేదు. చీజ్ విషయానికి వస్తే ఇందులో ప్రోటీన్, కాల్షియం చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఉప్పు, కొవ్వు కూడా అధికంగా ఉంటాయి. రోజూ ఎక్కువగా చీజ్ తినడం గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. అప్పుడప్పుడు తక్కువ మోతాదులో మాత్రమే చీజ్ తీసుకోవాలి.

Advertisement

మజ్జిగ ఒక అద్భుత పానీయం
మజ్జిగను చాలా మంది తేలికగా తీసుకుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. మజ్జిగ త్వరగా జీర్ణం అవుతుంది. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి మజ్జిగ మంచి ఎంపిక. ఇందులో కాల్షియం శరీరం బాగా శోషించుకుంటుంది. పట్ట సమస్యలు, గ్యాస్, అజీర్ణం ఉన్నవారు మజ్జిగ తాగితే ఉపశమనం కలుగుతుంది. మొత్తంగా చూస్తే పాల పదార్థాలు అందరికీ బెస్ట్ అని చెప్పలేము. ప్రోటీన్ కావాలంటే పనీర్ లేదా చీజ్, కాల్షియం కావాలంటే పాలు లేదా పెరుగు, జీర్ణానికి సులువుగా కావాలంటే మజ్జిగను ఎంచుకోవాలి. మన శరీరం అవసరాలను గుర్తించి పాల పదార్థాలను ఎంపిక చేసుకుని తినాలి.

Related News

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

Big Stories

Advertisement
×