E-Paper
Advertisement

AC vs Windows: కారు విండోస్ ఓపెన్ చేసి కారు నడిపితే తక్కువ పెట్రోల్ ఖర్చవుతుందా? ఏసీతో నడిపితేనా?

AC vs Windows: కారు విండోస్ ఓపెన్ చేసి కారు నడిపితే తక్కువ పెట్రోల్ ఖర్చవుతుందా? ఏసీతో నడిపితేనా?
Advertisement

కారు నడపడం సరదాగా ఉంటుంది. కానీ, పెట్రోల్ కు ఎక్కవ ఖర్చు అవుతుంది. హైవేలపై ప్రయాణిస్తున్నా, సిటీలో నడుపుతున్నా, కొన్ని టిప్స్ పాటించడం వల్ల పెట్రోల్ సేవ్ చేసుకోవచ్చు. పర్సు ఖర్చును తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ప్రయాణ సమయంలో ఏసీ ఆన్ చేస్తే ఎక్కువ పెట్రోల్ అయిపోతుందా? విండోస్ ఓపెన్ చేస్తే, ఎక్కువ మైలేజ్ వస్తుందా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఏసీ vs ఓపెన్ విండోస్..  ఏది ఎక్కువ పెట్రోల్ ఆదా చేస్తుంది?

వేడి వాతావరణంలో డ్రైవర్లకు తరచుగా వచ్చే ఆలోచన.. కారు ఏసీని ఆన్ చేయాలా? విండోలను క్రిందికి దింపాలా? ఎలా వెళ్తే పెట్రోల్ ఆదా అవుతుంది? ఇప్పుడు మనం పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

సిటీ ట్రాఫిక్‌ లో (తక్కువ వేగం: 40-60 కి.మీ.)

Advertisement

⦿ ఓపెన్ విండోస్ విన్: తక్కువ వేగంతో, ఓపెన్ విండోస్ ద్వారా బయటి గాలిని లోపలికి వచ్చేలా చేయడం వల్ల తక్కువ ఫ్యూయెల్ ఖర్చు అవుతుంది. తరచుగా ACని ఉపయోగించడం కంటే మంచిది.

⦿ AC ఖర్చు: AC ఆన్ చేయడం వల్ల ఇంజిన్‌పై అదనపు భారం పడుతుంది. మైలేజ్ 10-20% తగ్గుతుంది.  సాధారణంగా 18 కిలో మీటర్ల మైలేజ్ ఇచ్చే కారులో ఏసీ ఆన్ చేయడం వల్ల 1-3 కిలో మీటర్ల మైలేజ్ తక్కువగా వస్తుంది.

హైవేలపై (హై స్పీడ్: 80 కి.మీ.)

Advertisement

⦿ AC మంచిది: ఎక్కువ వేగంతో వెళ్లే సమయంలో ఓపెన్ విండోలు కారును ముందుకు కదలకుండా చేస్తాయి. ఇది 10-20% మైలేజీని తగ్గిస్తుంది. కొన్నిసార్లు AC కంటే ఎక్కువ పెట్రోల్ ఖర్చు అవుతుంది.

⦿ క్రాస్ ఓవర్ పాయింట్: దాదాపు 70-90 కిలో మీటర్ల వేగం దగ్గర, విండోలను మూసివేసి AC ఆన్ చేయడం వల్ల మరింత పెట్రోల్ ఎఫిషియెన్సీ వస్తుంది. సాధారణంగా 15-16 kmplకి తగ్గించవచ్చు, కానీ 100 kmph వద్ద విండోలను తెరవడం వల్ల అది 14-15 kmplకి చేరుకుంటుంది.

⦿ అదనపు పొదుపు కోసం ఏం చేయాలంటే? కారు లోపల రీసైకిల్ చేయబడిన గాలిని వేగంగా చల్లబరచడానికి AC  రీసర్క్యులేషన్ మోడ్ ని ఉపయోగించాలి. సిటీ డ్రైవ్‌ లో కిటికీలను ఓపెన్ చేయాలి. హైవేలకు ఏసీ ఆన్ చేయాలి.

పెట్రోల్ ఆదా చేయడానికి  టాప్ టిప్స్  

మీ పెట్రోల్‌ ను మరింత పెంచడానికి సులభమైన, ఆచరణాత్మక మార్గాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని అనుసరించండి మరియు మీరు మైలేజీని 10-30% మెరుగుపరచవచ్చు!

⦿ స్మూత్ యాక్సిలరేషన్, బ్రేకింగ్: సడెన్ స్టార్ట్‌లు, హార్డ్ స్టాప్‌ నివారించాలి. స్మూత్ డ్రైవింగ్ ఇంజిన్‌ ను మరింత కండీషన్ లో ఉంచుతుంది. 20% వరకు ఇంధనాన్ని ఆదాను అందిస్తుంది.

⦿ ఒకే రకమైన వేగం: వేగాన్ని పెంచడం, తగ్గించడం కాకుండా ఓకే వేగాన్ని ఫాలో కావాలి. హైవేలో బెస్ట్ ఎఫిషియెన్సీ కోసం 80 నుంచి 100 కి.మీ వేగంతో ప్రయాణించడం మంచిది.

⦿ టైర్ ప్రెజర్‌ చెక్ చేయాలి: తక్కువ గాలితో కూడిన టైర్లు కారు వేగాన్ని తగ్గిస్తాయి. 5-10% ఎక్కువ ఇంధనాన్ని వృథా చేస్తాయి. కారు మాన్యువల్‌ లో సిఫార్సు చేయబడిన ప్రెజర్ ను మెయింటెయిన్ చేయాలి.

⦿ రెగ్యులర్ సర్వీసింగ్: క్లీన్ ఎయిర్ ఫిల్టర్లు, ట్యూన్డ్ స్పార్క్ ప్లగ్‌లు మైలేజీని 5-15% పెంచుతాయి.

⦿ లోడ్‌ను తగ్గించాలి: ప్రతి 50 కిలోల అదనపు బరువు 1-2% ఎక్కువ ఇంధనాన్ని తీసుకుంటుంది.

Read Also: ఈవీ కారు ఎక్కితే వికారం రావడానికి కారణం ఇదేనట.. పరిష్కారం కనుగొన్న మెర్సిడెస్!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×