E-Paper
Advertisement

నయా కారవాన్.. జస్ట్ రూ.30 లక్షలకే సింగిల్ బెడ్‌రూమ్ లాంటి లగ్జరీ!

నయా కారవాన్.. జస్ట్ రూ.30 లక్షలకే సింగిల్ బెడ్‌రూమ్ లాంటి లగ్జరీ!
Advertisement

Reddy Customs Ford Ranger Caravan: ఈ రోజుల్లో చాలా మంది ట్రిప్పుల కోసం లగ్జరీ కారవాన్ లు కొనుగోలు చేస్తున్నారు. బడ్జెట్ ధరలో చిన్న ఫ్యామిలీకి అనుకూలంగా ఉండేలా చూసుకుంటున్నారు. అందులో భాగంగానే రెడ్డీ కస్టమ్స్ ఫోర్డ్ రేంజర్ కారవాన్ ను రూపొందించింది. ఇది కేవలం రూ. 30 లక్షల్లో లభించే సిగింల్ బెడ్ రూమ్ లా రూపొందించారు. ప్రయాణ సమయంలో ఇంటి మాదిరి సౌకర్యాలను కల్పిస్తుంది. ఆధునిక ఫీచర్లు, విశాలమైన ఇంటీరియర్,  విశ్రాంతి కోసం బాల్కనీతో సహా లగ్జరీ హోమ్ అనుభూతిని ఇస్తుంది.

ఫోర్డ్ రేంజర్ కారవాన్ ప్రత్యేకతలు

⦿ ధర: ఈ కారవాన్  ధర సుమారు రూ. 30 లక్షలు ఉంటుంది. కస్టమైజేషన్‌ తో కలిపి ఈ ధరలో లభిస్తుంది.

Advertisement

⦿ ఇంటీరియర్: ఈ కారవాన్ లో 1BHK తరహా డిజైన్, సోఫా, వాష్ బేసిన్, ఫ్రిజ్‌ తో కూడిన బార్ ఏరియా ఉంటుంది.

⦿ బెడ్‌ రూమ్, బాత్‌ రూమ్: ఇద్దరు వ్యక్తులు పడుకునే బెడ్‌ రూమ్, అత్యాధునిక బాత్‌ రూమ్ సదుపాయం ఉంటుంది.

Advertisement

⦿ ఇతర ఫీచర్లు: రూప్ మీద ఫోల్డబుల్ కుర్చీలు, టేబుల్, పార్కింగ్ కోసం బాల్కనీ,  వైన్, గ్లాసుల కోసం ప్రత్యేక స్థలం ఉంటుంది.  కారవాన్‌ను యాడ్ చేయడానికి, వెనుక భాగంలో సులభంగా లోపలికి వెళ్లడానికి వీలుగా సైడ్ టబ్ స్టెప్స్ ఉంటాయి.

Read Also: కూలెంట్ తగ్గి ఏసీ పని చేయట్లేదా? సింపుల్ గా ఈ టిప్స్ పాటించండి!

⦿ ఇంజిన్ రకాలు: ఈ కారవాన్ లో 3.0L V6 డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇందులో 600 Nm టార్క్‌ ను అందిస్తుంది.  2.0L BiTurbo డీజిల్ కారవాన్.  500 Nm టార్క్‌ తో మంచి ఫనితీరును అందిస్తుంది.

⦿ టెక్నాలజీ: ఇందులో ట్రైలర్ ప్రో బ్యాకప్ అసిస్ట్, ఇంటిగ్రేటెడ్ టోయింగ్ సిస్టమ్స్ ఉన్నాయి.

⦿ పనితీరు: 10 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్ వల్ల ప్రయాణం స్మూత్ గా కొనసాగుతుంది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేస్తుంది.

⦿ కొత్త మోడల్స్: ఈ ఏడాది ఈ కంపెనీకి చెందిన ప్లగ్ ఇన్ హైబ్రిడ్ మోడల్స్ కూడా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇవి  697 Nm టార్క్‌ ను అందిస్తాయి.

మొత్తంగా ఫోర్డ్ రేంజర్ కారావాన్ ఫ్యామిలీ టూర్స్ కు, అడ్వెంచర్ ట్రిప్‌ లకు అనుకూలంగా ఉంటుంది. ఈ కారావాన్ కదిలే ఇల్లు మాత్రమే కాకుండా రెస్ట్ తీసుకునేందుకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.

Read Also:  కియా నుంచి అతి చిన్న ఎలక్ట్రిక్ SUV, రేంజ్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వుద్ది!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×