E-Paper
Advertisement

బిజీ లైఫ్ స్టైల్‌‌లోనూ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి !

బిజీ లైఫ్ స్టైల్‌‌లోనూ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి !

Healthy Lifestyle: ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ అనేది చాలా ముఖ్యం. ఇది మనం మానసికంగా అంతే కాకుండా శారీరకంగా ఆరోగ్యంగా ఉండటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైన అలవాట్లను ఎంచుకోవడం అనారోగ్యాన్ని నివారించడంలో సహాయ పడుతుంది. అంతే కాకుండా మీకు ఇప్పటికే ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే.. దాని వల్ల కలిగే సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అనేక మంది ఉద్యోగాలు చేస్తున్నారు. వీరికి గంటల తరబడి వ్యాయామం చేయడానికి అస్సలు సమయం ఉండదు.  ఇలాంటి సందర్భంలో కూడా ఎలాంటి టిప్స్ పాటిస్తే హెల్తీగా ఉంటారు. అనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మీ బరువు పెరగనివ్వకండి:
అనారోగ్యాలను నివారించడానికి బరువును అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. అధిక బరువు , ఊబకాయం అనేక తీవ్రమైన అనారోగ్యాలకు ప్రమాద కారకాలుగా పరిగణించబడతాయి. అందుకే బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. మధుమేహం, గుండె జబ్బుల రోగులలో పెరిగిన బరువు వారి ఆరోగ్య సమస్యలను మరింత పెంచుతుంది. చిన్న వయస్సు నుంచే మెరుగైన పద్ధతులను అవలంబిస్తే.. ఈ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు.. అనేక ఇతర రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

యోగా వ్యాయామం అవసరం:
ప్రతిరోజూ వ్యాయామం చేయడం చాలా అవసరం. మంచి ఆరోగ్యానికి క్రమమైన యోగాసనాలు అత్యవసరం. వ్యాయామం వల్ల మన డైలీ లైఫ్ స్టైల్‌పై ప్రభావం చూపే అనేక శారీరక,మానసిక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే పెద్దలందరూ ప్రతి రోజూ కనీసం 30 నిమిషాల శారీరక శ్రమ చేయాలని పరిశోధకులు చెబుతున్నారు. వారానికి 75 నిమిషాలు వ్యాయామం చేసినా కూడా.. అది అనేక రకాల వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుందని అంటున్నారు.

మంచి నిద్ర చాలా అవసరం:
ప్రతిఒక్కరికీ మంచి, సరిపడా రాత్రి నిద్ర చాలా అవసరం. అది మిమ్మల్ని ఉత్తేజపరచడమే కాకుండా.. ఒత్తిడిని తగ్గించి, మరుసటి రోజుకు శక్తినిస్తుంది. నిద్రలేమికి.. అనేక రకాల శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలకు సంబంధం ఉందని పలు అధ్యయనాలలో తేలింది. నిద్రలేమి ఉన్నవారికి మెటబాలిక్ సిండ్రోమ్, డిప్రెషన్, గుండె జబ్బుల సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

Also Read: వేసవిలో బ్లడ్ షుగర్ అకస్మాత్తుగా పెరుగుతోందా? ఈ 5 కారణాలు మీకు తెలుసా!

ఆహారం:
చియా, ఫ్లాక్ సీడ్స్ , చేపలు వంటివి మిమ్మల్ని యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయ పడతాయి.

ఉప్పు, చక్కెర ఎక్కువగా తినడం ప్రమాదకరం:
మెరుగైన ఆరోగ్యం కోసం, మీ ఆహారంలో చక్కెర , ఉప్పు రెండింటినీ  చాలా వరకు తగ్గించండి. అధిక చక్కెర మధుమేహం, బరువు పెరగడానికి దోహద పడుతుంది. అయితే అధిక ఉప్పు రక్తపోటుకు కారణం అయ్యి, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. చక్కెరలోని ఫ్రక్టోజ్ కాలేయాన్ని దెబ్బతీసి, ఇన్సులిన్ నిరోధకతకు కారణమై, టైప్- 2 డయాబెటిస్‌కు దారి తీస్తుంది. అందుకే రెండింటినీ మితంగానే తీసుకోవాలి.

Related News

ఏసీలో పడుకుంటే తలనొప్పి వస్తోందా? నిపుణులు చెబుతున్న అసలు కారణాలివే!

టీనేజర్ల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్న ఎనర్జీ డ్రింక్స్.. తస్మాత్ జాగ్రత్త!

ఇంటి బయట ॐతో పాటు ఈ నాలుగు చిహ్నాలుంటే.. మీ జీవితంలో సుఖ సంతోషాలే

మార్కెట్‌ నుంచి తెచ్చిన మొక్కలు ఇంట్లో ఎండిపోతున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే ఏళ్ల తరబడి పచ్చగా పెరుగుతాయి

వేసవి నీరసం వల్ల ఓఆర్ఎస్ తాగుతున్నారా? ప్యాకెట్లు వద్దు.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి

మీ అబ్బాయి కోసం పెళ్లిసంబంధాలు చూస్తున్నారా? ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి సర్వ గుణ సంపన్నురాలు

వేసవిలో అద్దంలా మెరిసిపోయే ముఖ చర్మం కావాలా? ఈ టిప్స్ మీ కోసమే

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

Big Stories

×