E-Paper

చీప్ అండ్ బెస్ట్ ఈవీ స్కూటర్, రేంజ్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

చీప్ అండ్ బెస్ట్ ఈవీ స్కూటర్, రేంజ్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!
Advertisement

Ampere Magnus Neo EV Scooter Launched: గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ భారత ఎలక్ట్రిక్ మార్కెట్‌ లో కొత్తగా ఆంపియర్ మాగ్నస్ నియో స్కూటర్‌ ను విడుదల చేసింది. దీని ధరను రూ. 86,999గా కంపెనీ నిర్ణయించింది. ఇప్పటికే ఉన్న మాగ్నస్ నియో మోడల్ కంటే సుమారు రూ. 2,000 వరకు ఎక్కువ ధరకు వస్తోంది. అయితే, ఈ కొత్త వెర్షన్‌ లో చేసిన ఛేంజెస్ పెద్దగా లేకపోయినా, రోజువారీ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేలా ఉన్నాయి.

తక్కువ బరువు, మంచి హ్యాండ్లింగ్

ఈ స్కూటర్‌ లో ముఖ్యంగా ఎర్గోనామిక్స్‌పై దృష్టి పెట్టారు. సీటు ఎత్తును తగ్గించడం వల్ల రైడర్లకు సులభంగా ఉపయోగించుకునేలా రూపొందించారు. ప్రస్తుతం సీటు ఎత్తు 777 మిల్లీమీటర్లుగా ఉంది. పాత మోడల్‌తో పోలిస్తే తక్కువ. స్కూటర్ బరువును కూడా తగ్గించారు. ఇప్పుడు దీని కెర్బ్ వెయిట్ కేవలం 103 కిలోలు. ఈ మార్పులతో ట్రాఫిక్‌ లో స్కూటర్‌ను హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుంది. ముఖ్యంగా పొట్టిగా ఉన్న రైడర్లకు ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

మెకానికల్ గా నో ఛేంజెస్

Advertisement

మెకానికల్ పరంగా ఈ స్కూటర్ లో పెద్ద మార్పులు లేవు. ఈ స్కూటర్ డ్యూయల్ ఫ్రేమ్ చాసిస్‌ పై తయారు చేశారు.  ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్‌ ను ఉపయోగించారు. బ్రేకింగ్ కోసం ముందు, వెనుక రెండింటిలోనూ డ్రమ్ బ్రేక్‌ లను ఇచ్చారు.

బ్యాటరీ గురించి..

ఈ స్కూటర్ లో 2.3kWh LFP బ్యాటరీ ప్యాక్ అందించారు. ఒకే ఛార్జ్ తో సుమారు 118 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది.   ఎకో మోడ్‌ లో సుమారు 85 నుంచి 90 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 65 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఛార్జింగ్ కోసం ఆఫ్ బోర్డ్ ఛార్జర్ ఉపయోగించాలి. దీని ద్వారా 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ కావడానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది.

డిజైన్, ఫీచర్లలో మార్పులు

Advertisement

డిజైన్, ఫీచర్ల పరంగా ఈ స్కూటర్ లో కొన్ని మార్పులు చేశారు. ఈ స్కూటర్ 3.5 అంగుళాల LCD డిస్‌ ప్లేతో వస్తుంది. ఇది రైడింగ్‌ కు అవసరమైన ముఖ్యమైన సమాచారాన్ని చూపిస్తుంది. ఆల్ LED లైటింగ్ సెటప్ అందించడంతో పాటు USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. అదనంగా, సీటు కింద 22 లీటర్ల స్టోరేజ్ స్పేస్ కలిగి ఉంటుంది. రోజువారీ అవసరాల కోసం సరిపడా స్థలం లభిస్తుంది.

కొత్త మోడల్‌ లో వీల్, మోటార్ సెటప్‌ ను కొంచెం అప్ డేట్ చేశారు. దీని వల్ల యాక్సిలరేషన్ స్మూత్‌గా ఉండటంతో పాటు రైడింగ్ సమయంలో మరింత చక్కగా ముందుకు సాగుతుంది. ఆంపియర్ మాగ్నస్ నియో తక్కువ ధరలో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ గా గుర్తింపు తెచ్చుకోనుంది. రోజువారీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.

Read Also: ఫస్ట్ లుక్ తోనే పిచ్చెక్కిస్తున్న ఎలక్ట్రిక్ బైక్, ఓబెన్ న్యూ మోడల్ లాంచింగ్ ఎప్పుడంటే?

Related News

మారుతి ఇ-విటారా ధరలు పెంపు.. ఏ వేరియంట్ పై ఎంత పెరిగిందంటే?

విడుదలకు ముందు టాటా సియెర్రా ఈవీ టీజర్ లాంచ్.. లుక్ చూస్తే మతిపోవడం పక్కా!

ఆంపియర్‌ కు బంపర్ డిమాండ్.. 3 లక్షల మార్క్ దాటిన ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు!

క్రెటా, సెల్టోస్‌ కు కొత్త టెన్షన్.. దీపావళికి కొత్త హోండా ఎలివేట్ ఫేస్‌ లిఫ్ట్ వచ్చేస్తోంది!

రెనాల్ట్ బ్రిడ్జర్ ఎస్‌యూవీ వచ్చేస్తోంది, ఒకేసారి పెట్రోల్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వెర్షన్ లో ఎంట్రీ!

నిస్సాన్ బేబీ పెట్రోల్ SUV లాంచ్ డేట్ ఫిక్స్.. క్రెటాకు ఇక చుక్కలేనా?

సింగిల్ ఛార్జ్ తో 355 కి.మీ రేంజ్.. హ్యుందాయ్ నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వచ్చేస్తోంది!

కియా కస్టమర్లకు షాక్.. జూలై 1 నుంచి అన్ని మోడల్స్ ధరలు పెంపు!

Big Stories

×