E-Paper
Advertisement

రేపే టాలీవుడ్ హీరో పెళ్లి.. అందంగా ముస్తాబవుతున్న వేదిక!

రేపే టాలీవుడ్ హీరో పెళ్లి.. అందంగా ముస్తాబవుతున్న వేదిక!
Advertisement

Tollywood Hero: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెళ్లి భాజాలు ఘనంగా మోగనున్నాయి. ఈ జంటను కలపడానికి కల్యాణ వేదిక అందంగా ముస్తాబవుతోంది. పలువురు సినీ సెలబ్రిటీల రాకతో తిరుమల తిరుపతి దేవస్థానం కళకళ లాడబోతోంది అంటూ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ టాలీవుడ్ హీరో ఎవరో కాదు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ పెద్ద కుమారుడు.. యువ హీరో అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొన్ని రోజుల క్రితమే ప్రీ ఎంగేజ్మెంట్ జరుపుకొని తమ ప్రేమ విషయాన్ని పెళ్లి వరకు తీసుకెళ్తున్నామని అధికారికంగా ప్రకటించిన ఈయన.. తన ప్రేయసి కావ్య రెడ్డితో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం చేసుకొని అభిమానులను సర్ప్రైజ్ చేశారు.

రేపే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి..

ఆ తర్వాత పసుపు దంచే కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్న ఈ జంట.. ఆ తర్వాత జంటగా పలువురు సినీ సెలబ్రిటీలను ఆహ్వానించారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి ఆహ్వానించారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇకపోతే ఈరోజు పెళ్లి కొడుకుగా అందంగా ముస్తాబైన ఫోటోలను కూడా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇకపోతే నేడు తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దేవుడి ఆశీస్సులతో కుటుంబ సభ్యుల సమక్షంలో వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఏప్రిల్ 29 2026 అనగా బుధవారం రోజు రాత్రి 11:13 గంటలకు వేద మంత్రోచ్ఛారణ మధ్య సంప్రదాయబద్ధంగా బెల్లంకొండ శ్రీనివాస్ కావ్య రెడ్డి మెడలో మూడు ముళ్ళు వేయనున్నారు. సనాతన హిందూ ధర్మం ప్రకారం వీరు వివాహం జరిపిస్తున్నట్లు బెల్లంకొండ కుటుంబం స్పష్టం చేసింది. ఇకపోతే ఈ వివాహ వేడుకకు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.

ఘనంగా రిసెప్షన్.. ముఖ్యమంత్రులు రాక..

Advertisement

తిరుమల తిరుపతిలో వివాహమైన తర్వాత మే 31వ తేదీన హైదరాబాద్ సిటీలో వెడ్డింగ్ రిసెప్షన్ కోసం ఘనంగా ఏర్పాటు చేశారు.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా పలువురు మంత్రులు, తెలుగు చలనచిత్ర సీమ ప్రముఖులను బెల్లంకొండ కుటుంబం స్వయంగా కలిసి పెళ్లి రిసెప్షన్ కి తప్పకుండా రావాలి అని నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరిన విషయం అందరికీ తెలిసిందే.

బెల్లంకొండ సినిమా కెరియర్..

బెల్లంకొండ కెరియర్ విషయానికి వస్తే.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు శ్రీను సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు.. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈయన ఇటీవల భైరవం సినిమాతో మళ్లీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు కిష్కిందపురి సినిమాతో పర్వాలేదు అనిపించుకున్న వైవాహిక బంధం లోకి అడుగుపెడుతున్నారు. వివాహం తర్వాత కొంతకాలం బ్రేక్ ఇచ్చి మళ్లీ తన తదుపరి సినిమాల షూటింగ్లో బిజీ కానున్నట్లు సమాచారం.

Advertisement

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×