E-Paper
Advertisement

ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ స్పై షాట్స్ లీక్, వారెవ్వా ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయా?

ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ స్పై షాట్స్ లీక్, వారెవ్వా ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయా?
Advertisement

Next-Gen Ather Scooter EL01  Testing: ఏథర ఎనర్జీ త్వరలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేయబోతోంది. EL01 పేరుతో దీనిని మార్కెట్ లోకి తీసుకురాబోతోంది. ఈ స్కూటర్ ప్రస్తుతం టెస్టింగ్ దశ లో ఉండగా, బెంగళూరులో కొన్ని ట్రయల్ రైడ్ షాట్స్ బయటకు వచ్చాయి. కంపెనీ గతంలో నిర్వహించిన కమ్యూనిటీ డే ఈవెంట్‌ లో ఈ స్కూటర్ ను కాన్సెప్ట్ మోడల్‌ గా చూపించింది. 2026 ఎండింగ్ లో ఈ స్కూటర్ మార్కెట్‌ లోకి వచ్చే అవకాశం ఉంది.

EL01 ప్రత్యేకత ఏమిటంటే?

ఇది కొత్తగా డెవలప్ చేసిన EL ప్లాట్‌ ఫారమ్ పై తయారవుతోంది. ఇప్పటి వరకు ఉన్న స్కూటర్లతో పోలిస్తే ఇది పూర్తిగా కొత్త ఆర్కిటెక్చర్ మీద రెడీ అవుతుంది. ఈ ప్లాట్‌ ఫారమ్ మాడ్యులర్ విధానంలో రూపొందించబడింది. అంటే, ఒకే బేస్‌ ను ఉపయోగించి భవిష్యత్తులో మరిన్ని మోడళ్లను సులభంగా తయారు చేసే అవకాశం ఉంటుంది. తయారీ ఖర్చులు తగ్గడం, సర్వీస్ సౌకర్యం మెరుగుపడటం వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి.

డిజైన్ ఎలా ఉందంటే?

Advertisement

EL01 కుటుంబ వినియోగానికి అనుకూలంగా ఉండేలా రూపొందిస్తున్నారు. ఫ్లాట్ ఫ్లోర్‌ బోర్డ్ ఉండడం వల్ల కాళ్లు పెట్టుకునేందుకు విశాలమైన ప్లేస్ ఉంటుంది. సీటు కింద పెద్ద స్టోరేజ్ ఉండి, రెండు హెల్మెట్లు పెట్టుకునే అవకాశం ఉంటుంది.  రోజువారీ ప్రయాణాలకు ఉపయోగపడేలా ప్రాక్టికల్‌ గా డిజైన్ చేశారు. 14 అంగుళాల వీల్స్, పూర్తి LED లైటింగ్ కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

అత్యాధునిక టెక్నాలజీ

ఈ స్కూటర్‌ లో టెక్నాలజీ కూడా చాలా అడ్వాన్స్ డ్ గా ఉంటుంది. కొత్త సాఫ్ట్‌ వేర్ సిస్టమ్ ద్వారా వాయిస్ కమాండ్స్‌ తో కొన్ని ఫీచర్లను నియంత్రించే అవకాశం ఉంటుంది. భారతీయ భాషలకు అనుగుణంగా ఈ ఫీచర్ పనిచేస్తుంది. రోడ్లలో గుంతలను గుర్తించడం, ప్రమాద హెచ్చరికలు ఇవ్వడం లాంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉండొచ్చు. స్కూటర్‌ ను పార్క్ చేసినప్పుడు దొంగతనం కాకుండా రక్షించే సిస్టమ్‌ కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది.

10 నిమిషాల ఛార్జింగ్ తో 30 కిలో మీటర్ల ప్రయాణం

Advertisement

చార్జింగ్ విషయానికొస్తే, EL01లో ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ సిస్టమ్ ఉంటుంది. ఛార్జింగ్ కేబుల్‌ ను స్కూటర్‌ లోనే నిల్వ చేసుకునే విధంగా డిజైన్ చేశారు. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో కేవలం 10 నిమిషాల్లోనే సుమారు 30 కిలోమీటర్ల రేంజ్ పొందే అవకాశం ఉంది. బ్యాటరీ సామర్థ్యం 2 kWh నుంచి 5 kWh వరకు ఉండే అవకాశం ఉంది. వేర్వేరు ధరలలో వేరియంట్లు తీసుకురావడానికి కంపెనీకి అవకాశం ఉంటుంది. ఈ స్కూటర్‌ లో భాగాల సంఖ్యను తగ్గించేలా యూనిబాడీ స్టీల్ ఫ్రేమ్ ఉపయోగిస్తున్నారు. దీని వల్ల తయారీ ప్రక్రియ సులభం అవుతుంది. అలాగే ఖర్చులు తగ్గుతాయి. భవిష్యత్తులో కొత్త మోడళ్లను త్వరగా మార్కెట్‌లోకి తీసుకురావడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. విడుదల తర్వాత  ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో మంచి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.

Read Also: ట్రైన్ లేట్, ఫ్లైట్ మిస్.. చచ్చినట్టు ఆ డబ్బులు కట్టేయాలన్న న్యాయస్థానం!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×