Automatic Transmission Problems: ఆటోమేటిక్ కార్లు డ్రైవింగ్‌ను చాలా ఈజీగా మార్చాయి. క్లచ్ పెడల్ అవసరం లేకుండా కేవలం డ్రైవింగ్ మోడ్ లో పెట్టి నడిపేయొచ్చు. అందుకే ఇప్పుడు చాలా మంది మాన్యువల్ కార్ల నుంచి ఆటోమేటిక్ కార్లకు మారుతున్నారు. అయితే, కొన్నిసార్లు ఆటోమేటిక్ గేర్ బాక్స్ సడెన్ జామ్ అవుతుంది. డ్రైవర్లు తీవ్ర ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. గేర్ లివర్ కదలకపోవడం, డ్రైవింగ్ చేస్తుండగా కారు ఒకే గేర్ లో ఉండిపోవడం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కానీ, ప్రతిసారి ఇది సీరియస్ ఇష్యూ కావాల్సి అవసరం లేదు. కొన్ని చిన్న ట్రిక్స్ తో సమస్యను హ్యాండిల్ చేయొచ్చు.
సాధారణంగా ఆటోమేటిక్ గేర్ బాక్స్ జామ్ కావడానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి పార్క్ మోడ్ నుంచి గేర్ బయటకు రాకపోవడం. రెండోది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కారు ఒకే గేర్ లో ఉండిపోవడం. దీనిని సాధారణంగా లింప్ మోడ్ అంటారు. గేర్ పార్క్ మోడ్ లోనే ఇరుక్కుపోతే ముందుగా బ్రేక్ లైట్లు పని చేస్తున్నాయో? లేదో? చెక్ చేయాలి. ఎందుకంటే లేటెస్ట్ కార్లలో బ్రేక్ పెడల్ నొక్కితే గేర్ మారే భద్రతా వ్యవస్థ ఉంటుంది. బ్రేక్ లైట్ స్విచ్ దెబ్బతింటే, మీరు బ్రేక్ నొక్కుతున్నారని అర్థం కాదు. అప్పుడు గేర్ రిలీజ్ కాదు. సో, గేర్ ఎలా రిలీజ్ కావాలో తెలుసుకుందాం..
చాలా ఆటోమేటిక్ కార్లలో గేర్ లివర్ దగ్గర చిన్న కవర్ లేదంటే స్లాట్ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా తీస్తే లోపల మాన్యువల్ రిలీజ్ బటన్ కనిపిస్తుంది. బ్రేక్ పెడల్ నొక్కి ఆ బటన్ ను ప్రెస్ చేస్తే గేర్‌ను న్యూట్రల్‌లోకి మారుతుంది. అయితే ఇది కేవలం తాత్కాలిక పరిష్కారం మాత్రమే.
కొన్ని సందర్భాల్లో వాలుగా ఉన్న ప్రదేశంలో కారు పార్క్ చేస్తే కూడా గేర్ ఇరుక్కుపోతుంది. ఎందుకంటే ట్రాన్స్ మిషన్ పై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. అలాంటి సమయంలో ఎవరో సహాయం చేస్తూ కారును కొద్దిగా ముందుకు, వెనక్కు ఊపితే గేర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది.
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కారు ఒకే గేర్ లో ఉండిపోతే దాన్ని లింప్ మోడ్ అంటారు. ట్రాన్స్ మిషన్ లో ఏదైనా లోపం కనిపిస్తే కారు ఈ మోడల్ లోకి వెళ్తుంది. అలాంటప్పుడు కారును ఆపాలి. ఇంజిన్‌ను ఆఫ్ చేసి ఒక నిమిషం తర్వాత మళ్లీ స్టార్ట్ చేయాలి. చాలాసార్లు చిన్న ఎలక్ట్రానిక్ లోపాలు రీసెట్ అయిపోతాయి.
ఇంకో ముఖ్యమైన విషయం ట్రాన్స్ మిషన్ ఫ్లూయిడ్ ను చెక్ చేయాలి. ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఫ్లూయిడ్ తక్కువగా ఉన్నా, మురికిగా మారినా గేర్ మారడంలో సమస్యలు వస్తాయి. మీ కారులో డిప్ స్టిక్ ఉంటే ఫ్లూయిడ్ పరిశీలించి అవసరమైతే నింపాలి. అత్యవసర పరిస్థితుల్లో వీటిని ఫాలో అవ్వడం వల్ల గేర్ బాక్స్ రిలీజ్ సమస్య క్లియర్ అవుతుంది.
Read Also: ఎండలో పార్క్ చేసినా కారు చల్లగా ఉండాలా? ఈ సింపుల్ ట్రిప్స్ ట్రై చేయండి!