RJ Balaji comments : తెలుగు ఆడియన్స్ ఎంత మంచివాళ్ళంటే సినిమా ఏ మాత్రం బాగున్నా కళ్ళకద్దుకుని కాసులు కురిపిస్తారు.అది మన సినిమానా లేక పక్క సినిమానా అని కాకుండా కంటెంట్ బాగుంటే చాలు గుండెల్లో పెట్టుకుంటారు. అందుకే మన సినిమాలకి దీటుగా డబ్బింగ్ సినిమాలు కాసుల వర్షంలో తడిసి ముద్దవుతాయి.ముఖ్యంగా కమల్, రజినీ, సూర్య వంటి వారికి ఇక్కడ సెపరేట్ ప్యాన్ బేస్ ఉంది కూడా. అయితే ఈ వారం సూర్య హీరోగా వస్తున్న ‘వీరభద్రుడు’ (తమిళంలో కరుప్పు) సినిమాపై హైప్ కంటే నెగెటివిటీనే ఎక్కువగా కనిపిస్తుంది.కారణం సినిమాలోని కంటెంట్ అనుకుంటున్నారా ..కాదు ఆర్జే బాలాజీ చేసిన సెన్సేషన్ కామెంట్స్.
అప్పుడేమో వెటకారం.. ఇప్పుడేమో వంతపాడటమా?
విషయంలోకి వెళ్తే… ఆర్జే బాలాజీ మల్టీ టాలెంటెడ్ అని మంచి పేరే ఉంది. కానీ పెరిగిన సోషల్ మీడియా పుణ్యమా అని ఆయన పాత వీడియోలు ఇప్పుడు బయటపడ్డాయి. ఇవే ఇపుడు టాలీవుడ్ నెటిజన్లకు కోపాన్ని తెప్పిస్తున్నాయి. కారణం అప్పుడెప్పుడో జరిగిన గతంలో ఒక అవార్డు వేడుకలో ఆయన తెలుగు సినిమాలపై సెటైర్స్ వేయడమే. తెలుగు సినిమాలో హీరో కచ్చితంగా హీరోయిన్ వెంట పడాలని, అప్పుడే అది సినిమా అవుతుందన్నట్లుగా ఎగతాళిగా మాట్లాడారు. అలాగే గతేడాది సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘యానిమల్’ సినిమా గురించి మాట్లాడుతూ.. అందులో హింసను, మహిళలను కించపరిచే తీరును జనం ఆస్వాదించడం చూసి బాధేసిందని, అందుకే ఆ సినిమాను థియేటర్లో చూడలేదని నీతులు చెప్పుకొచ్చాడు.
5 years ago an absolute clown called #RJBalaji used a platform like this to mock and ridicule Telugu films to prove a point and today his next film as a director is shamelessly releasing in Telugu again. Have some shame maybe @RJ_Balaji ?? Care to apologise?? pic.twitter.com/0m6kxP5Hbb
— Meher Kilaru (@Kilaruness) May 11, 2026
కానీ ‘వీరభద్రుడు’ సినిమా విషయానికి వచ్చేసరికే సీన్ రివర్స్ అయింది. తన సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి ఇదే ఆర్జే బాలాజీ ఇప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోల పేర్లను వాడుకుంటుండటం నెటిజన్లకు అస్సల్ డైజెస్ట్ కావడం లేదు. రీసెంట్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ అంటే గౌరవమని, రామ్ చరణ్‌తో సినిమా చేయాలని ఉందంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ట్రోలర్స్ కి మాంచి స్టఫ్ అవుతున్నాయ్. “అప్పుడేమో తెలుగు సినిమాల్ని తక్కువ చేసి మాట్లాడి.. ఇప్పుడు కలెక్షన్ల కోసం మన హీరోల అభిమానులని కాకా పడుతున్నారా?” అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి కూడా.
also read :CM విజయ్ ‘మాస్’ డెసిషన్.. 717 వైన్ షాపులు ఖాళీ..హీరో విశాల్ రియాక్షన్ వైరల్!
సూర్య ఇమేజ్‌ను ఆర్జే బాలాజీ దెబ్బకొడతారా?
నిజానికి సూర్యకు తెలుగులో మంచి క్రేజ్ ఉందన్న సంగతి చెప్పక్కర్లేదు.అయితే గత సినిమాలు అనుకున్నంత ఆడకపోయినా సూర్య నటనకు మంచి మార్కులే పడ్డాయి. కాని ఈ సారి వస్తున్న వీరభద్రుడు సినిమా ఓపెనింగ్స్ పై దర్శకుడు గతంలో చేసిన కామెంట్స్ ఎఫెక్ట్ గట్టిగానే పడేలా కనిపిస్తుంది. ట్రైలర్ పరవాలేదనిపించినా, సినిమా చుట్టూ ఉండాల్సిన ‘బజ్’ కంటే నెగిటివిటీయే సర్కులేట్ అవుతుంది.
మరోవైపు, ఆర్జే బాలాజీ గతంలో తీసిన ‘మూకుతి అమ్మన్’ (అమ్మోరు తల్లి), ‘వీట్ల విశేషం’ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూల్లే రాబట్టాయి. కానీ ఇప్పుడు ‘వీరభద్రుడు’తో ఆయన మాస్ యాక్షన్ జోనర్‌లోకి అడుగుపెట్టారు. ‘యానిమల్’ సినిమాలో హింసను తప్పుపట్టిన ఈ దర్శకుడు, తన సినిమాలో మాత్రం రక్తం చిందించే యాక్షన్ సీక్వెన్స్‌లను ఎలా సమర్థించుకుంటారో చూడాలి మరి.
మరి ఈనెల 14న థియేటర్లలోకి రాబోతున్న ‘వీరభద్రుడు’ ఈ నెగిటివిటీని తట్టుకొని నిలబడుతుందా? సూర్యకున్న ఇమేజ్ ఈ సినిమాను గట్టెక్కిస్తుందా? లేక ఆర్జే బాలాజీ ఓల్డ్ కామెంట్స్ సినిమా వసూళ్లకు గండి కొడతాయా? అనేది కాలమే డిసైడ్ చేయాలి.