E-Paper
Advertisement

పల్సర్ 180 రీలాంచ్.. ఏకంగా 4 కొత్త కలర్స్‌ తో ఎంట్రీ!

పల్సర్ 180 రీలాంచ్..  ఏకంగా 4 కొత్త కలర్స్‌ తో ఎంట్రీ!
Advertisement

New Bajaj Pulsar 180: బజాజ్ పల్సర్ 180 మళ్లీ ఇండియన్ మార్కెట్ లోకి అడుగు పెట్టింది. పల్సర్ లవర్స్ ను మరింత క్రేజీగా ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది. ఒకప్పుడు యూత్‌ లో మంచి క్రేజ్ సంపాదించిన ఈ బైక్, ఇప్పుడు కొత్త లుక్ లో  అందుబాటులోకి వచ్చింది. ఈ బైక్ ధర సుమారు రూ.1.22 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ మోడల్‌కు ఉన్న డిమాండ్ కారణంగానే కంపెనీ దీన్ని తిరిగి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

సరికొత్త రంగుల్లో బజాజ్ పల్సర్ 180

డిజైన్ పరంగా చూస్తే, పల్సర్ 180 తన పాత స్టైల్‌ ను ఎక్కువగా అలాగే కొనసాగించింది. ముఖ్యంగా పల్సర్ 150లో కనిపించే ఐకానిక్ బాడీ డిజైన్‌ ను అలాగే ఉంచారు. అయితే, కొత్తగా కొన్ని డీకాల్స్ యాడ్ చేయడం ద్వారా కొంచెం ఫ్రెష్ లుక్ ఇవ్వడానికి ప్రయత్నించారు. ఈ బైక్ నాలుగు రంగులలో అందుబాటులోకి వచ్చింది. బ్లాక్ గోల్డ్, బ్లాక్ బ్లూ, బ్లాక్ గ్రే,  బ్లాక్ రెడ్. ఈ రంగుల్లో ప్రధానంగా బ్లాక్ బేస్ ఉండగా, చిన్న చిన్న గ్రాఫిక్స్, స్ట్రైప్స్ ద్వారా స్టైలింగ్‌ ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

ఇంజిన్ విషయానికి వస్తే..

Advertisement

బజాజ్ పల్సర్ 180 ఇంజిన్ విషయానికి వస్త, ఈ బైక్‌లో 178.6cc సింగిల్ సిలిండర్ ఎయిర్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉంది.   8500 rpm దగ్గర 16.7 bhp పవర్‌, 6500 rpm దగ్గర 15 Nm టార్క్‌ ను అందిస్తుంది. ఈ ఇంజిన్ గతంలోనే మంచి పని తీరును కనబరిచింది. ముఖ్యంగా మిడ్ రేంజ్‌ లో బలమైన పికప్ ఉండటం వల్ల సిటీ రైడింగ్‌ కు,  హైవే డ్రైవింగ్‌ కు కూడా అనుకూలంగా ఉంటుంది.

సరికొత్త ఫీచర్లతో..

ఫీచర్ల పరంగా ఈసారి కొంత అప్డేట్ చేశారు. పూర్తి డిజిటల్ LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. ఇందులో స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. అదనంగా LED టర్న్ ఇండికేటర్లు కూడా యాడ్ చేశారు. ఇది బైక్‌ కు కొంచెం ఆధునిక టచ్ ఇస్తుంది. మొత్తం మీద చూసుకుంటే ఇది పూర్తిగా కొత్త మోడల్ కాదు గానీ, పాత మోడల్‌కు చిన్న మార్పులు చేసిన వెర్షన్ అని చెప్పవచ్చు.

TVS అపాచీ RTR 180తో పోటీ

Advertisement

పల్సర్ 180 మార్కెట్లో TVS అపాచీ RTR 180తో పోటీ పడుతుంది. ఈ రెండు బైక్‌లు కూడా చాలా కాలంగా మార్కెట్లో ఉన్నాయి. తమకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ ను కలిగి ఉన్నాయి. కొత్త టెక్నాలజీ, ఫీచర్లతో మార్కెట్‌లోకి వస్తున్న కొత్త బైక్‌ల మధ్య కూడా ఈ మోడల్‌కు డిమాండ్ ఉండటం విశేషం. పల్సర్ 180 తిరిగి రావడం అనేది పాత బైక్‌ లను ఇష్టపడే వారికి  మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. పెద్ద మార్పులు లేకపోయినా, కొత్త రంగులు, కొన్ని ఫీచర్ అప్డేట్స్‌ తో మళ్లీ రోడ్లపై కనిపించనుంది.

Read Also: టీవీఎస్ ఐక్యూబ్ పై క్రేజీ ఆఫర్.. ఏకంగా 15,500 తగ్గింపు!

Related News

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

కియా సైరోస్ EV vs కియా సైరోస్ ICE.. ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇదే!

16 ఏళ్ల తర్వాత నిస్సాన్ మాస్టర్‌ పీస్.. కొత్త ఎల్గ్రాండ్ వచ్చేసింది!

భారత మార్కెట్ లోకి చౌకైన 7-సీటర్‌.. ఏంటీ.. ధర మరీ అంత తక్కువా?

MG కొత్త EV వచ్చేస్తోంది.. 600 కి.మీ రేంజ్‌తో అదిరే ఎంట్రీ!

సింగిల్ ఛార్జ్ తో 500 కి.మీ ప్రయాణం.. మార్కెట్ లో దుమ్మురేపబోతున్న హ్యుందాయ్ ఈవీ!

Big Stories

Advertisement
×