E-Paper
Advertisement

టీవీఎస్ ఐక్యూబ్ పై క్రేజీ ఆఫర్.. ఏకంగా 15,500 తగ్గింపు!

టీవీఎస్ ఐక్యూబ్ పై క్రేజీ ఆఫర్.. ఏకంగా 15,500 తగ్గింపు!
Advertisement

TVS iQube Electric Scooter Offer: TVS మోటార్ కంపెనీ తన పాపులర్ ఎలక్ట్రిక్ స్కూటర్ iQube పై అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. ఈ స్కూటర్‌పై రూ. 15,500 వరకు బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ స్కూటర్ కొనాలని భావించే వారికి ఇదే కరెక్ట్ టైమ్.

మూడు వేరియెంట్లలో iQube

iQube  వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. iQube, iQube S, iQube ST. బేస్ మోడల్  iQube సాధారణ అవసరాలకు సరిపోయేలా రూపొందించబడింది. iQube S వేరియంట్‌లో కొంచెం ఎక్కువ ఫీచర్లు, ముఖ్యంగా పెద్ద డిస్‌ప్లే లభిస్తుంది. ఇక iQube ST ఈ శ్రేణిలో టాప్ మోడల్‌. దీనిలో పెద్ద బ్యాటరీ, ఎక్కువ రేంజ్, అత్యాధునిక టెక్నాలజీ ఫీచర్లు ఉంటాయి.

ధరల విషయానికి వస్తే..

Advertisement

ధరల విషయానికి వస్తే, iQube శ్రేణి రూ.1.11 లక్షల నుంచి రూ. 1.61 లక్షల వరకు లభిస్తుంది. బ్యాటరీ పరిమాణాన్ని బట్టి ధరలు మారుతాయి. చిన్న బ్యాటరీతో ఉన్న మోడళ్లు తక్కువ ధరలో లభిస్తాయి. పెద్ద బ్యాటరీతో ఉన్న మోడళ్లు ఎక్కువ ధరకు వస్తాయి.  ఈ స్కూటర్ ప్రధాన ఆకర్షణ బ్యాటరీ ఆప్షన్స్. బేస్ iQube మోడల్ మూడు రకాల బ్యాటరీ ఆప్షన్‌లతో వస్తుంది.  2.2 kWh, 3.1 kWh, 3.5 kWh. iQube S 3.5 kWh బ్యాటరీతో మాత్రమే లభిస్తుంది. ఇక iQube STలో 3.5 kWh, 5.3 kWh ఆప్షన్స్ ఉన్నాయి. పెద్ద బ్యాటరీతో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉంటుంది.

ఏకంగా 212 కి.మీ ప్రయాణం

రేంజ్ విషయానికి వస్తే, చిన్న బ్యాటరీ ఉన్న మోడల్ సుమారు 94 కి.మీ. వరకు ప్రయాణిస్తుంది. 3.1 kWh వెర్షన్ సుమారు 123 కి.మీ. రేంజ్ ఇస్తుంది. 3.5 kWh వేరియంట్లు దాదాపు 145 కి.మీ. వరకు వెళ్తాయి. ఇక పెద్ద 5.3 kWh బ్యాటరీ ఉన్న ST మోడల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కి.మీ.కు పైగా, సుమారు 212 కి.మీ. వరకు ప్రయాణిస్తుంది. పనితీరు పరంగా అన్ని వేరియంట్లు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. అన్ని మోడళ్లలో 4.4 kW పవర్ ఉన్న మోటార్ ఉంటుంది. ఇది 0 నుండి 40 కి.మీ వేగాన్ని సుమారు 4.2 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ట వేగం మాత్రం బ్యాటరీని బట్టి కొద్దిగా మారుతుంది. 75 నుంచి 82 కి.మీ వరకు ఉంటుంది. ఛార్జింగ్ సమయం కూడా బ్యాటరీపై ఆధారపడి ఉంటుంది. చిన్న బ్యాటరీలు తక్కువ సమయంలో ఛార్జ్ అవుతాయి. పెద్ద బ్యాటరీలకు కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. సాధారణంగా 3 గంటల నుంచి దాదాపు 7 గంటల వరకు ఛార్జింగ్ సమయం ఉంటుంది.

ఫీచర్ల గురించి..

Advertisement

టెక్నాలజీ పరంగా iQube ST ప్రత్యేకంగా ఉంటుంది. ఇందులో పెద్ద TFT టచ్‌ స్క్రీన్, వాయిస్ కమాండ్‌లు, నావిగేషన్, కాల్,  మెసేజ్ నోటిఫికేషన్లు లాంటి స్మార్ట్ ఫీచర్లు ఉంటాయి. జియోఫెన్సింగ్, యాంటీ థెఫ్ట్ అలర్ట్స్, క్రాష్ డిటెక్షన్ లాంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి. రివర్స్ మోడ్, రీజెనరేటివ్ బ్రేకింగ్, USB ఛార్జింగ్ లాంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. సీటు కింద మంచి స్టోరేజ్ స్పేస్ ఉండటం రోజువారీ ఉపయోగంలో ఉపయోగపడుతుంది.

Read Also: కొత్త కైనెటిక్ DX+ ఈ-స్కూటర్ కొనాలనుకుంటున్నారా? కచ్చితంగా ఈ 5 విషయాలు తెలుసుకోండి!

Related News

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

కియా సైరోస్ EV vs కియా సైరోస్ ICE.. ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇదే!

16 ఏళ్ల తర్వాత నిస్సాన్ మాస్టర్‌ పీస్.. కొత్త ఎల్గ్రాండ్ వచ్చేసింది!

Big Stories

Advertisement
×