E-Paper
Advertisement

కొత్త పల్సర్ ఎన్160 వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, ధర వింటే ఇప్పుడే బుక్ చేసుకుంటారు!

కొత్త పల్సర్ ఎన్160 వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, ధర వింటే ఇప్పుడే బుక్ చేసుకుంటారు!
Advertisement

Pulsar N160 : బజాజ్ ఆటోమొబైల్ రంగంలో సరికొత్త సంచలనానికి తెరలేపింది. యువత గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న పల్సర్ సిరీస్ నుంచి సరికొత్త నయా వేరియంట్‌ను దేశీయ మార్కెట్లోకి విసిరింది. అదే ‘బజాజ్ పల్సర్ ఎన్160’ ప్రీమియం ఎడిషన్. బైక్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకునేలా, సరికొత్త హంగులతో రూపుదిద్దుకున్న ఈ మోటార్‌సైకిల్ ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధర ప్రకారం కేవలం రూ. 1,22,000 లకే అందుబాటులోకి రావడం విశేషం. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బజాజ్ డీలర్‌షిప్‌లలో ఈ సరికొత్త రైడింగ్ బీస్ట్ సందడి చేస్తోంది. పాత స్టాండర్డ్ సిరీస్ మోడళ్లతో పోలిస్తే ఈ కొత్త వేరియంట్ అత్యంత ప్రీమియం లుక్‌తో, మునుపెన్నడూ లేనంత మెరుగైన అప్‌గ్రేడెడ్ ఫీచర్లతో రోడ్లపై దూసుకెళ్లడానికి సిద్ధమైంది.

గోల్డ్ కలర్ USD ఫోర్కులతో అల్టిమేట్ లుక్

ఈ సరికొత్త మోడల్‌లో రైడర్ల భద్రతకు, సౌకర్యానికి బజాజ్ కంపెనీ పెద్దపీట వేసింది. సాధారణంగా ఖరీదైన స్పోర్ట్స్ బైకుల్లో మాత్రమే కనిపించే గోల్డ్ కలర్ USD (అప్‌సైడ్ డౌన్) ఫోర్కులను ఈ వేరియంట్‌లో ప్రవేశపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణ టెలిస్కోపిక్ ఫోర్క్ సెటప్‌తో పోలిస్తే, ఈ సరికొత్త గోల్డ్ కలర్ యుఎస్‌డి ఫోర్క్‌ల వల్ల మోటార్‌సైకిల్‌కు మరింత క్లాసిక్, ప్రీమియం ఫ్రంట్-ఎండ్ లుక్ లభిస్తుంది.

Advertisement

ఇది కేవలం స్టైల్ కోసం మాత్రమే కాదు, బైక్ బ్రేకింగ్ వేసినప్పుడు, అలాగే రోడ్లపై మలుపులు (కార్నరింగ్ లోడ్స్) తిరిగేటప్పుడు బైక్ అదుపు తప్పకుండా అద్భుతమైన దృఢత్వాన్ని మరియు స్థిరత్వాన్ని అందిస్తుంది. దీనికి తోడు అడ్వాన్స్‌డ్ డ్యూయల్ ఛానల్ ABS బ్రేకింగ్ టెక్నాలజీని కూడా జోడించడంతో, అత్యంత వేగంగా వెళ్తున్న సమయంలో సడన్ బ్రేక్ వేసినా రైడర్‌కు ఏమీ కాకుండా సేఫ్టీ ఉంటుంది.

అడ్వాన్స్‌డ్ బ్రేకింగ్ మరియు స్లిప్పర్ క్లచ్ టెక్నాలజీ

ఇక లాంగ్ రైడ్స్ వెళ్లేవారికి, ట్రాఫిక్‌లో ఇబ్బంది పడేవారిని దృష్టిలో పెట్టుకొని  ఇందులో సరికొత్తగా ‘అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్‌’ను అమర్చారు. దీనివల్ల క్లచ్ ఆపరేషన్ చాలా స్మూత్‌గా మారుతుంది, గేర్లు మార్చడం సులువవుతుంది, తద్వారా రైడింగ్  మరింత హ్యాపీగా సాగిపోతుంది. అయితే ఈ వేరియంట్ ఇంజిన్ పనితీరులో, పవర్ అవుట్‌పుట్‌లో ఎలాంటి సాంకేతిక మార్పులు చేయలేదు.

Advertisement

ఇప్పటికే మార్కెట్లో సక్సెస్ అయిన నమ్మకమైన పవర్‌ఫుల్ 160సీసీ ఇంజిన్‌ను అలాగే కొనసాగించారు. అంటే బజాజ్ ఈసారి బైక్ పర్ఫార్మెన్స్ కంటే కూడా కేవలం విజువల్ స్టైలింగ్, రైడర్ కంఫర్ట్ మరియు ప్రీమియం ఫీచర్లపైనే స్పష్టంగా దృష్టి పెట్టిందని అర్థమవుతోంది. రాత్రి వేళల్లో కూడా పగటి వెలుతురును తలపించేలా పవర్‌ఫుల్ LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌ను ఇందులో అమర్చారు. ప్రయాణంలో మొబైల్ ఛార్జింగ్ అయిపోతుందనే టెన్షన్  లేకుండా హ్యాండిల్ బార్ సమీపంలోనే USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా ఇవ్వడం విశేషం.

ఫ్యామిలీ రైడర్లకు బిగ్ అప్‌డేట్.. సింగిల్ సీట్ సెటప్

ఇక ఈ కొత్త బైక్ డిజైన్‌లో మరో మేజర్ అప్‌డేట్ ఏంటంటే, రైడర్‌తో పాటు వెనుక కూర్చునే పిలియన్‌కు కూడా ఎక్కువ స్థలాన్ని, అత్యంత సౌకర్యాన్ని అందించేలా ఒకే ఒక విశాలమైన ‘సింగిల్-సీట్’ సెటప్‌ను డిజైన్ చేశారు. దీనివల్ల ఫ్యామిలీతో కలిసి ప్రయాణించే వారికి కూడా ఇది పర్ఫెక్ట్ ఛాయిస్‌ అని చెప్పాలి. రోజురోజుకూ పెరుగుతున్న టూ-వీలర్ డిమాండ్‌కు తగ్గట్టుగా బజాజ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

కాగా, ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన ఒక సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ కేవలం 15 రోజుల్లోనే ఏకంగా 25 వేల బుకింగ్స్ సాధించి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. అదే జోష్ లో, ఇప్పుడు పెట్రోల్ సెగ్మెంట్‌లో యువతను టార్గెట్ చేస్తూ బజాజ్ పల్సర్ ఎన్160 రూపంలో మరో సంచలనానికి తెరలేపింది. స్టైల్, సేఫ్టీ, అఫర్డబుల్ ప్రైస్  ఇలా అన్ని కలగలుపుకొని వచ్చిన ఈ సరికొత్త పల్సర్ రాబోయే రోజుల్లో సేల్స్ పరంగా సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయం అంటున్నారు టెక్ పండితులు. ట్రెండీ లుక్ తో పాటు బడ్జెట్ లో బెస్ట్ ఫీచర్స్ కోరుకునే ప్రతి ఒక్కరికీ ఈ కొత్త వేరియంట్ ఒక అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు.

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×