Akhil Lenin :అఖిల్ అక్కినేని …ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్ళు అయిపోతున్నా ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క సాలిడ్ కమర్షియల్ హిట్ కూడా చూళ్లేకపోయాడు .ప్రతి సినిమాకూ లుక్స్ మారుస్తూ, కొత్త ప్రయత్నాలు చేస్తున్నానని చెబుతున్నా, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఫలితాలు దారుణంగా ఉంటున్నాయి. ముఖ్యంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ఏజెంట్’ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోవడమే కాకుండా, భారీ నష్టాలను మిగిల్చింది. ఆ పరాజయం తర్వాత చాలాకాలం పాటు గ్యాప్ తీసుకున్న అఖిల్, ఇప్పుడు ఎలాగైనా మాస్ ఇమేజ్ సొంతం చేసుకోవాలనే తాపత్రయంతో ‘లెనిన్’ అనే ప్రాజెక్ట్ ను లైన్ లోకి తెచ్చాడు.
ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్న అఖిల్
దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అఖిల్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నట్టు కనిపిస్తుంది. గతంలో ‘వినరో భాగ్యము విష్ణుకథ’ లాంటి ఒక మోస్తరు సినిమాను అందించిన దర్శకుడికి, కెరీర్ లో అత్యంత కీలకమైన సమయంలో అఖిల్ బాధ్యతలు అప్పగించడం ఎంతవరకు కరెక్ట్ అనే చర్చలు కూడా ఫిలిం నగర్ లో నడుస్తున్నాయి. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ మరియు సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే.నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఎప్పట్లాగే తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
8ప్యాక్ , వైల్డ్ లుక్ తో పబ్లిసిటీ జిమ్మిక్కులు
అయితే, వరుస ప్లాపులతో సతమతమవుతున్న హీరో కోసం స్టార్ ప్రొడక్షన్ హౌసెస్ ఎంత ఖర్చు చేసినా, కంటెంట్ లో బలం లేకపోతే థియేటర్లకు ఆడియన్స్ రావడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘మిస్టర్ బచ్చన్’ తో తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయిన భాగ్యశ్రీ బోర్సేను ఇందులో హీరోయిన్ గా ఎంపిక చేయడం కూడా ఈ సినిమాపై అంచనాలను పెద్దగా పెంచలేకపోతోంది.
also read :ట్విషా శర్మ డెత్ మిస్టరీ….ఎయిమ్స్ రీ-పోస్ట్‌మార్టంతో టోటల్ సీన్ రివర్స్
ఇక ఈ సినిమా కోసం అఖిల్ తన లుక్ ను కంప్లీట్ గా మార్చుకున్నట్లు, మాస్ బాడీ లాంగ్వేజ్ తో ఊరమాస్ యాక్షన్ ఎపిసోడ్స్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే గతంలో ‘ఏజెంట్’ సినిమా కోసం కూడా అఖిల్ ఇలాగే 8ప్యాక్ , వైల్డ్ లుక్ తో పబ్లిసిటీ జిమ్మిక్కులు చేశారు. తీరా థియేటర్లలో ఆ సినిమా చూసిన ప్రేక్షకులు కంటెంట్ లో సత్తా లేకపోవడంతో డిసప్పాయింట్ అయిపోయారు.
బలమైన కథ ఉందా అన్న డౌట్స్
ఇప్పుడు ‘లెనిన్’ విషయంలోనూ కేవలం లుక్స్, మేకోవర్ నమ్ముకుని వస్తున్నారా లేక బలమైన కథ ఉందా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయ్.అఖిల్ కి ఇప్పటివరకు సరైన మాస్ బేస్ లేకపోవడం, కేవలం క్లాస్ ఆడియన్స్ కే పరిమితం కావడం వల్ల ఈ ఊరమాస్ ప్రయోగం వికటిస్తే ఆయన కెరీర్ మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందంటున్నారు ట్రేడ్ పండిట్స్.
దీనికి తోడు ఈ సినిమా విడుదల తేదీల విషయంలో జరుగుతున్న గందరగోళం బిజినెస్ సర్కిల్స్ లో నెగెటివ్ బజ్ క్రియేట్ చేస్తోంది. మొదట ఈ సినిమాను మే 1న విడుదల చేయాలని అనుకున్నారు మేకర్స్ . కానీ అదే సమయంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వస్తున్న ‘పెద్ది’ సినిమా ఏప్రిల్ 30న విడుదలవుతుందని ప్రకటించడంతో, ఆ భయంతో ‘లెనిన్’ వెనక్కి తగ్గింది. దీంతో పెద్ద సినిమాలతో పోటీ పడేంత సీన్ ‘లెనిన్’ కు లేదని స్వయంగా నిర్మాతలే ఒప్పుకున్నట్లయింది.
also read :ట్రోలర్స్‌కు గట్టి షాక్ ఇచ్చిన విష్ణుప్రియ.. మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు!
ఆ తర్వాత ‘పెద్ది’ సినిమా జూన్ 4కి వాయిదా పడటంతో, మళ్లీ లెక్కలు మార్చిన మేకర్స్ ఇప్పుడు జూన్ 26న ‘లెనిన్’ ను థియేటర్లలోకి తీసుకురావాలని ఫిక్స్ అయ్యారట. రామ్ చరణ్ సినిమా జూన్ మొదటి వారంలో వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే, ఆ వేవ్ లో జూన్ చివరి వారంలో వచ్చే అఖిల్ సినిమాను ఎంతవరకు ఆదరిస్తారనేది ఇపుడు పెద్ద ప్రశ్న. ఇప్పటికే పదేళ్ల కెరీర్ వేస్ట్ చేసుకున్న అఖిల్, ఈ ‘లెనిన్’ తోనైనా అదృష్టాన్ని పరీక్షించుకుంటాడో లేక మరో ప్లాప్ ను ఖాతాలో వేసుకుంటాడో జూన్ 26న తేలిపోనుంది.