E-Paper
Advertisement

TFT డిస్‌ ప్లే, క్విక్‌షిఫ్టర్‌.. అదిరిపోయే ఫీచర్లతో పల్సర్ NS200 గ్రాండ్ ఎంట్రీ!

TFT డిస్‌ ప్లే, క్విక్‌షిఫ్టర్‌.. అదిరిపోయే ఫీచర్లతో పల్సర్ NS200 గ్రాండ్ ఎంట్రీ!
Advertisement

2026 Bajaj Pulsar NS200: బజాజ్ ఆటో పల్సర్ NS200 బైక్ ను మరిన్ని అత్యాధునిక ఫీచర్లతో అప్‌డేట్ చేసింది. కొత్త టెక్నాలజీ, మెరుగైన రైడింగ్ ఎక్స్ పీరియెన్స్ ను కోరుకునే యువతను దృష్టిలో పెట్టుకుని ఈ బైక్‌లో కీలక మార్పులు చేసింది. అప్‌డేట్ చేసిన పల్సర్ NS200 ధరను రూ.1.60 లక్షలుగా నిర్ణయించింది. గతంలో అందుబాటులో ఉన్న USD ఫోర్క్ వేరియంట్ ధర రూ.1.49 లక్షలు కాగా, కొత్త మోడల్ కోసం మరో రూ.11,000 చెల్లించాల్సి ఉంటుంది.

కొత్త TFT డిస్‌ప్లే.. గూగుల్ మ్యాప్స్ సపోర్ట్

ఈసారి పల్సర్ NS200లో చేసిన కీలక అప్ డేట్ లో 5 అంగుళాల TFT డిస్‌ ప్లే. పాత LCD స్క్రీన్ స్థానంలో దీన్ని తీసుకొచ్చారు. ఈ డిస్‌ ప్లే ద్వారా గూగుల్ మ్యాప్స్‌ ను మిర్రర్ చేసుకునే అవకాశం ఉంది. దీంతో ప్రయాణ సమయంలో మార్గాలను తెలుసుకోవడం మరింత సులభం కానుంది. అంతేకాకుండా USB టైప్ C ఛార్జింగ్ పోర్ట్, సర్దుబాటు చేసుకునే లివర్స్, హజార్డ్ స్విచ్, పానిక్ బ్రేక్ అలర్ట్ లాంటి ఫీచర్లను అందించారు.

క్విక్‌షి ఫ్టర్, మరిన్ని రైడ్ మోడ్స్

Advertisement

రైడింగ్‌ ను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు బైక్‌లో బై డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌ను అందించారు. దీనివల్ల క్లచ్‌ను ప్రతిసారీ ఉపయోగించకుండా గేర్లను పైకి, కిందికి మార్చుకోవచ్చు. రైడ్ బై వైర్ థ్రాటిల్ ద్వారా రైడ్ మోడ్‌లను ఉపయోగించుకునే అవకాశం ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ను కూడా యాడ్ చేశారు. ఈ ఫీచర్లు బైక్ కంట్రోల్, రైడింగ్ ను మరింత ఈజీ కానుంది.

ఇంజిన్‌ లోనూ చిన్న మార్పులు

పల్సర్ NS200లో 199.5cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ ను అలాగే ఉంచారు. అయితే, ఇప్పుడు ఈ ఇంజిన్ 25.5hp పవర్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది పాత మోడల్‌ తో పోలిస్తే 1hp ఎక్కువ. గరిష్ఠ టార్క్ 18.7Nmగా ఉంది. ఇంజిన్‌కు 6 స్పీడ్ గేర్‌ బాక్స్‌ ను జత చేశారు.

కొత్త ఫోర్క్, రేడియల్ టైర్

Advertisement

బైక్ హార్డ్‌ వేర్‌ లోనూ మార్పులు చేశారు. పాత 33mm USD ఫోర్క్ స్థానంలో మందమైన 37mm USD ఫోర్క్‌ ను అమర్చారు. వెనుక భాగంలో రేడియల్ టైర్‌ ను అందించారు. అయితే, పెరిమీటర్ ఫ్రేమ్, బాక్స్ సెక్షన్ స్వింగ్‌ ఆర్మ్, వెనుక మోనోషాక్ సెటప్‌ ను యథాతథంగా ఉంచారు.

మూడు రంగుల్లో కొత్త పల్సర్ NS200

ఈ బైక్ ఎబోనీ బ్లాక్ రేసింగ్ రెడ్, పెర్ల్ మెటాలిక్ వైట్, కొత్త నార్డో గ్రే కలర్స్ లో లభిస్తుంది. ధర పరంగా చూస్తే, ఈ బైక్ తో  TVS అపాచీ RTR 200 4V ధర రూ.1.48 లక్షల నుంచి రూ.1.49 లక్షల మధ్య ఉంటుంది. కొత్త ఫీచర్లు, అధిక పవర్ కోరుకునే కొనుగోలుదారులకు పల్సర్ NS200 బెస్ట్ ఆప్షన్ కానుంది.

Read Also: ఇక క్లచ్ పట్టాల్సిన అవసరం లేదు.. కవాసకీ కొత్త అడ్వెంచర్ బైక్‌ భలే ఉందిగా..

Tags

Related News

డుకాటి ఫార్ములా 73 విడుదల, లుక్ చూస్తే మతిపోవాల్సిందే!

వెదురుతో పెట్రోల్.. 10 నిమిషాల్లోనే తయారీ, లీటర్ ధర ఎంతో తెలుసా?

కార్లలో ఇకపై బ్లాక్ బాక్స్.. ప్రమాదం ఎలా జరిగిందో చెప్పేస్తుందట, ఇదిగో ఇలా..

బేయాన్ To 0 ఆల్ఫా.. డిసెంబర్ లో మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న 4 క్రేజీ SUVలు!

ఇక క్లచ్ పట్టాల్సిన అవసరం లేదు.. కవాసకీ కొత్త అడ్వెంచర్ బైక్‌ భలే ఉందిగా..

భారత్‌లోనే CB500 తయారీ.. విదేశాలకు ఎగుమతి చేసేందుకు హోండా ప్లాన్!

మహీంద్రా XUV 3XO CNG బుకింగ్స్ ప్రారంభం.. డెలివరీలు ఎప్పటి నుంచి అంటే..

Big Stories

Advertisement
×