E-Paper
Advertisement

India’s First Electric Car: దేశంలో ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు 1993లోనే వచ్చింది, కానీ సక్సెస్ కాలేకపోయింది, ఎందుకంటే?

India’s First Electric Car: దేశంలో ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు 1993లోనే వచ్చింది, కానీ సక్సెస్ కాలేకపోయింది, ఎందుకంటే?
Advertisement

India’s First Electric Car: గత కొద్ది సంవత్సరాలుగా భారతీయ మార్కెట్ లో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం బాగా పెరిగిపోతోంది. టాటా మోటార్స్, మహీంద్రా, హ్యుందాయ్, కియా, MG మోటార్ వంటి కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త ఎలక్ట్రిక్ మోడల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అయితే, ఇండియాలో ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు ఎప్పుడు వచ్చింది? దాని పేరు ఏంటి? ఆ కారు మార్కెట్ లో సక్సెస్ అయ్యిందా? కాలేదా? అని చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఆ కారు కథ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

1993లో ఇండియన్ మార్కెట్ లోకి ఫస్ట్ ఎలక్టరిక్ కారు!

ఇండియన్ మార్కెట్ లో అడుగు పెట్టిన ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు పేరు లవ్‌బర్డ్. ఇది 1993లో దేశీ మార్కెట్లోకి విడుదల అయ్యింది.  జపాన్‌కు చెందిన యాస్కావా ఎలక్ట్రిక్ Mfg. Co సహకారంతో ఎడ్డీ కరెంట్ కంట్రోల్స్ (ఇండియా) అనే సంస్థ అభివృద్ధి చేసింది. ఈ కారును తొలిసారిగా న్యూఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. అక్కడ ఈ కారు అందరి దృష్టిని ఆకర్షించింది. కొన్ని అవార్డులను కూడా అందుకుంది. భారత ప్రభుత్వం కూడా ఈ కార్ల తయారీకి మద్దతు ప్రకటించింది. గ్రీన్  మొబిలిటీ వైపు తొలి అడుగు పడింది. పెట్రోల్, డీజిల్ వాహనాలు రోడ్లపై ఆధిపత్యం చెలాయించిన సమయంలో, లవ్‌బర్డ్ ఓ సాహసోపేతమైన ఎంట్రీగా మారింది.

లవ్‌బర్డ్ కారు గురించి..

Advertisement

లవ్‌బర్డ్ ఉత్పత్తి కేరళలోని చలకుడి, తమిళనాడులోని కోయంబత్తూర్‌లో జరిగింది. ఇది డైరెక్ట్ కరెంట్ (DC) ఎలక్ట్రిక్ మోటారు, రీఛార్జబుల్ లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్‌ తో నడిచే కాంపాక్ట్ టూ సీటర్ గా అడుగు పెట్టింది. 1990ల ప్రారంభంలో బ్యాటరీ సాంకేతికత పరిమితంగా ఉండటంతో, ఆధునిక లిథియం అయాన్ బ్యాటరీలకు బదులుగా లెడ్ యాసిడ్ సెల్స్పై ఆధారపడి రన్ అయ్యేది.

ఒకే ఛార్జ్ తో 60 కిలో మీటర్ల ప్రయాణం

పూర్తిగా ఛార్జ్ చేస్తే, లవ్‌బర్డ్ 60 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉండేది. ఇది చిన్న పట్టణ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. బ్యాటరీని ఛార్జ్ చేయడానికి దాదాపు ఎనిమిది గంటలు పట్టేది. ఈ కారులో నాలుగు స్పీడ్ ట్రాన్స్‌ మిషన్, రివర్స్ గేర్, వేగాన్ని కంట్రోల్ చేయడంలో సహాయపడే ఎలక్ట్రానిక్ ఛాపర్ సిస్టమ్ ఉన్నాయి.

Advertisement

Read Also: బైక్ బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా దిగిపోతుందా?ఈ సింపుల్ టిప్స్ తో మీ బ్యాటరీ లైఫ్ పెంచుకోండి!

లవ్‌బర్డ్ ఎందుకు ఫెయిల్ అయ్యిందంటే?   

లవ్‌బర్డ్  మార్కెట్ లోకి క్రేజీగా అడుగు పెట్టినా, మార్కెట్లో ఇబ్బంది పడింది. అమ్మకాలు మూడు అంకెలు దాటలేదు.  పరిమిత ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, తరచుగా విద్యుత్ కోతలు, అధిక ఖర్చులు 1990లలో కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ కార్లను అంగీకరించడం కష్టతరం చేశాయి.  కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది. అయినప్పటికీ, లవ్‌బర్డ్ దేశ EV ప్రయాణానికి పునాది వేసింది.

Read Also: వచ్చేసింది మారుతి ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×